Others

వ్యామోహం ఇంత చేసిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్రవ్యామోహం, పుత్రుని మీద మమకారం అనేది కేవలం మానవులకే కాదు దేవతలకు కూడా ఉంటుందని శచీదేవిని చూస్తే అనిపిస్తుంది. ఒకానొక కాలంలో శతజిహ్వుడనే రాక్షసుడు మితిమీరి ప్రవర్తిస్తుండేవాడు. సజ్జనులను హింసించడం రాక్షసుల ప్రవృతి. ఈ రాక్షసులు యజ్ఞాలను ధ్వంసం చేయడం వారి హక్కుగా భావిస్తారు కదా. అట్లానే ఈ శతజిహ్వుడు కూడా యజ్ఞవిధ్వంసకుడుగా చెలరేగి ప్రవర్తిస్తుండేవాడు. అలాంటి సమయంలోబ్రహ్మ శచీదేవి కుమారుడైన జయంతుని దగ్గరకు వచ్చాడు. ‘ఓ జయంతా! నీవు వెళ్లి యుద్ధం చేసి ఆశతజిహ్వుడను రాక్షసుని పరిమార్పుము’అని ఆదేశించాడు. ఈ సంగతి శచీదేవి విన్నది. వెంటనే ఆమె బ్రహ్మకు అడ్డుపడి మహామహులెందరో ఉన్నారు కదా వారిలో ఎవరినైనా యుద్ధానికి పంపండి. అసలే శతజిహ్వుడు రాక్షసుడు వానితో పోరుకు నా కొడుకును పంపించకండి అని అన్నది. దాంతో బ్రహ్మ కు కోపం వచ్చింది. ఇంత భయపడుతున్నావు కనుక నీవు భూలోకంలో వైశ్య కన్యవై జీవించుదువుగాక ! అని శాపం ఇచ్చాడు. దీనితో ఇంద్రుడు భయపడిపోయాడు. ‘తండ్రీ బ్రహ్మాదేవా! మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రీ. ఈ శచీదేవి వైశ్యకులంలో పుడితే ఎలా ’ అంటూ వేడుకున్నాడు. బ్రహ్మ నా నోటినుంచి పరబ్రహ్మ ఏది పలికిస్తే అదే వస్తుంది. నేను ఏం చేయను. మరేంఫర్లేదులే.. అంతా ఆ పరబ్రహ్మ చూసుకొంటాడు అని అన్నాడు. అయినా పదేపదే ఇంద్రుని వేడుకోలు విన్న బ్రహ్మ ఈ శచీదేవి వైశ్యకులంలో పుట్టినా ఎవరినీ పెండ్లి చేసుకోకుండానే నీ దగ్గరకు తిరిగి వస్తుందిలే వరం ఇచ్చాడట.
ఆ సమయంలోనే సోమకాంతుడను యక్షుని భార్య సుశీల అను నామె శచీదేవి ని పూజించేది. శచీదేవిని తన కుమార్తెగా పుట్టమని పదేపదే వేడుకుంటూ ఉండేది. ఆమె కోరిక ప్రకార శచీదేవి ఆమెకు పుత్రికగా పుట్టింది. అపుడు దిన దిన ప్రవర్థమానమై పెరుగుతుండగా ఆమె అందాన్ని చూచి చిత్రకంఠుడను గంధర్వుడు ఆమెను పెళ్లాడాలని అనుకొన్నాడు. ఆ జన్మలో కూడా సుశీల కూతురు చిత్రరథుని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది.దాంతో వానికి కోపం వచ్చి నీవు వైశ్యకులంలో జన్మించుదు గాక అని శాపం ఇచ్చాడట.
ఇవన్నీ కలసి శచీదేవి వైశ్యుల ఇంట పుట్టింది.

- రాయసం లక్ష్మి 9703344804