Others

ఏది నిజం! ఏది నమ్మాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో గల సమస్త ప్రాణులకి మరణమంటే విపరీతమైన భయం. మరణాన్ని తప్పించుకునేందుకు ప్రతిప్రాణీ శాయశక్తులా కృషి చేస్తుంది. మరణం ఎప్పుడు ఏ రూపంలో ప్రాణిని హరిస్తుందో తెలియదు. గీతలో చెప్పినట్టు పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరవలసిందే. అందువలనే మహనీయుల తపస్సులకు సంతసించి ప్రత్యక్షమైన దేవతలు ఎన్ని వరాలైనా ఇచ్చారు కానీ మరణం లేకుడా ఎవరూ వరం ఇవ్వలేకపోయారు.
ఈ విషయం తెలిసి కూడా మానవులు ఇంకా ఇంకా జీవించాలనే కోరుకుంటారు. వ్యాధి సోకిన వెంటనే ఔషధాలు సేవిస్తారు. మరణ నివారణోపాయాలు అనే్వషిస్తారు. జీవశ్రాద్ధ మొనర్చుకున్న యతీశ్వరుడైనా మరణ సమయంలో తనను ఏ వైద్యుడు రక్షిస్తాడో ఏ ఔషధం పనిచేస్తుందో అనే తాపత్రయంలో పడిపోతాడని కాళహస్తీశ్వర శతకం చెబుతుంది.
కానీ ఆయువు పరిసమాప్తి కాగానే కోటిమంది వైద్యులు గుమి కూడినా ప్రాణం పోయలేరు. శరీరం వున్నంతవరకు దానిని రక్షించుకోవాలి. ఆత్మహత్య మహా పాతకం. ఫలానా వ్యక్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడు అని కొందరు అనడం వింటాం. ఇది పొరపాటు. ఆత్మహత్య చేసుకునేందుకు చాలా ధైర్యం అవసరం. అది లేనివారు ఆత్మహత్య చేసుకోలేరు.
తాను ఇక్కడ శాశ్వతమని, ఎవరో మరణిస్తూ వుంటారు కానీ తాను ఇంకా చాలాకాలం ఈ భూమిపై వుంటానని భ్రమతో అనేక వక్రమార్గాల ద్వారా ఆస్తులు సంపాదిస్తున్నారు. ఇలా పోగుచేసిన ఆస్తి అంతా వారు అనుభవించలేరు. చివరకి అది దారా పుత్రాదులకు బంధు మిత్రులకు దక్కుతుంది. అక్రమార్జన ప్రభుత్వ దృష్టికి వస్తే ప్రభుత్వ హస్తగతం అవుతుంది. ఇలా చేయడం దోషమని తెలుసుకోవడంలేదు. తనకు కావల్సినది ఆర్జించడంలో తప్పులేదు.
దురాశ కొంప ముంచుతుంది. మరణం ఏ సమయంలో సంభవిస్తుందో తెలియదు కనుక సత్కార్యాలు చేయడానికి వాయిదాలు వేయకూడదు. కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు రాజ్యపాలన చేస్తుండగా ఓరోజు కొలువుకి ఓ బ్రాహ్మణుడు వచ్చి ఆర్థిక సహాయం కోరాడు. పని తొందరలో వున్న ధర్మరాజు అతనిని మరునాడు రమ్మన్నాడు. ఇది విన్న భీమసేనుడు వెంటనే మంగళవాద్యకారులను రప్పించాడు.
ధర్మరాజు అది చూసి నాయనా భీమసేనా ఇప్పుడు మంగళ వాద్యాలు దేనికి అని ప్రశ్నించగా తమరు రేపటి వరకు జీవించి వుంటారని ఘంటాపథంగా తెలిసింది అందుకనే సంతోషం తెలియజేయడానికి మంగళవాయిద్యాలు వాయించమన్నాను అని చెప్పాడు. ధర్మరాజు అప్పుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపపడి ఆ బ్రాహ్మణుని రప్పించి తగు విధంగా సహాయం చేసాడు. మరణానంతరం ఆ వ్యక్తి తాలూకు బంధువుమిత్రులు మరు భూమి వరకు వచ్చి వెను తిరిగిపోతారు. ఆ వ్యక్తి కూడా వచ్చేది ధర్మమే అందువలన మానవులు ఐహిక సుఖాలపై విపరీతమైన వ్యామోహం పెంచుకొనక పరలోక సుఖ హేతువులైన పుణ్య కార్యాలు అనగా అహింస, పరోపకారం, సత్యవాక్కులు పాటించాలి.

- వేదుల సత్యనారాయణ