Others

భక్త పోతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలలో ప్రవేశించిన తర్వాతనే ఎవరైనా సినిమా గురించి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఇది సాధారణం. ముందే సినిమా పరిజ్ఞానం అవగాహన చేసుకొని చిత్రరంగ ప్రవేశం చేయడం అన్నది అరుదు. ఇటువంటి అరుదైన విశేషంతో సినిమా ప్రవేశం చేసినవారు ప్రసిద్ధ నిర్మాత దర్శకుడు మార్గదర్శకుడు కె.వి.రెడ్డి.
కె.వి.రెడ్డి పోతన కథ తీద్దామనుకున్నారు. విశేషం ఏమిటంటే, ఆయన చిత్రాల్లోకి రాకముందే పోతన, వేమన కథల్ని చిత్రాలుగా తీయాలన్న ఆశయంతో వుండేవారు. ఆ కథలకి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, వాటి గురించి ఆలోచించడం చేసేవారు. వాహిని వారి దేవత (1941) జరుగుతూ వుండగానే రాత్రివేళల్లో సముద్రాల రాఘవాచార్యతో కూర్చొని కె.వి.రెడ్డి పోతన గురించి చర్చలు జరిపేవారు. బమ్మెరపోతనామాత్యుడు శ్రీ మదాంధ్ర మహాభాగవతము సృష్టించిన కవి శ్రేష్ఠుడు అంతకంటే గొప్ప శ్రీరామభక్తుడు. అందువలన అది భక్తితో కూడిన చిత్రం కాగలదని, భక్తి చిత్రాలను ప్రజలు తప్పక ఆదరిస్తారని కె.వి.రెడ్డి దృఢవిశ్వాసం.
భక్తిరస ప్రధానమైన కథగా ‘పోతన’ స్క్రిప్టు తయారైంది. మన కవులందరూ మహాభక్తులు కారు- మహాభక్తులందరూ కవులు కారు. కాని బమ్మెర పోతన రెండు రసాలను ఏక రసంగా అనుభవించిన మహామహుడు, శాంత స్వరూపుడు, నిత్య మందహాసి, పేదరికంలో వున్నా, అడిగినవారికి లేదని చెప్పలేని సద్గుణశాలి. ఇటువంటి మహత్తర పాత్రను ఎవరి చేత ధరింపచెయ్యాలి? అన్నది పెద్ద మీమాంస. అమిత భక్తిరస హృదయంలో గానం చేయగలిగే శక్తి వున్నవారు కనుక ముందునుండి నాగయ్యనే అనుకున్నారు. నాగయ్య అయితేనే పాత్రకి న్యాయం చేకూరుతుందన్న అభిప్రాయం అందరికీ కలిగి ఆయనే్న నిర్ణయించడం జరిగినది. ఇక పాత్రలలో ముఖ్యమైన మరో పాత్ర శ్రీనాథుడు. పోతన శాంత స్వరూపుడయితే శ్రీనాథుడు దర్పముగల మహాకవి, మంచి గాయకుడు. హిందుస్తానీ సంగీతం బాగా పాడే జంధ్యాల గౌరీనాథశాస్ర్తీ గారిని శ్రీనాథ పాత్రకు నిర్ణయించడం జరిగింది. పోతన కొడుకు పాత్రకు శ్రీవల్లభ జోస్యుల శివరాంగారిని తీసుకున్నారు.
శ్రీరాముడి పాత్రలో సిహెచ్.నారాయణరావు, సరస్వతీ పాత్రలో శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గెస్ట్‌లుగా కాసేపు కనిపించినా ప్రేక్షకుల హృదయంలో మరపురాని ముద్ర వేశారు. పాత్రదారుల నిర్ణయం అయిన తర్వాత రోజు ఆఫీసులో రిహార్సల్సు జరిగేవి. అపుడు వాహిని ఆఫీసు టి.నగర్‌లోని తనికాచలం రోడ్‌లో వుండేది. దాదాపు చిత్రం షూటింగ్ అంతా వేల్ పిక్చర్ స్టూడియోలో జరిగింది. అవుట్‌డోర్ దృశ్యాలు, మద్రాసు శివార్లలో వల్లావం ప్రాంతాల్లో తీశారు. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. పోతన చిత్రలోని ఒక దృశ్యంలో శ్రీనాథుడు, పోతనను పరీక్షించడానికి బళ్ళమీద బ్రాహ్మణులను వెంటబెట్టుకొని వస్తాడు. ఆ దశ్యంలో వందకుపైగా రెండెద్దుల బళ్ళు, రెండు వందలకుపైగా బ్రాహ్మణులు కావలసి వచ్చారు. అంతమంది బ్రాహ్మణులు మద్రాసులో లభించడం కష్టం కనుక కంచి నుండి కూడా కొందరిని రప్పించారు. అలాగే బళ్ళు.
కె.వి.రెడ్డికి తార్కిక దృష్టి ఎక్కువ. నిర్మాణాత్మకమైన మేధస్సు. ‘్భక్తపోతన’ చిత్రంను చూసినవాళ్ళెవరూ కె.వి.రెడ్డి తీసిన తొలి చిత్రం అంటే నమ్మరు. అంతటి అనుభవం ఆ చిత్రం నిండా కనిపిస్తుంది. భక్తపోతన చిత్రం 1944లో విడుదలైంది. ఈ చిత్రం ఆర్థికంగా కూడా ఎంతో విజయం సాధించింది. వాహిని చిత్రాల్లో అది ఒక మణిపూసగా నిలిచిపోయింది.
‘సర్వమంగళనామ సీతారామ’, ‘కాటుక కంటినీరు’, ‘ఎవ్వనిచే జన్మించు’, ‘విధి చాలా సుఖమా రామ, నీ సన్నిధి చాలా సుఖమా, పావన గుణనామా’, ‘ఏ తీరుగ నను దయ చూచెదవో’ మొదలైన పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
ఈ చిత్రానికి చెందిన మరో విశేషం కూడా వుంది. ముమ్మడివరంలో ఒక పశువుల కాపరి పోతన సినిమా చూసి బాలయోగిగా మారాడట.
కథా సంగ్రహం: పలికేది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడట అంటూ భాగవతాన్ని తేట తెలుగులో అందించిన కవి యోగి పుంగవుడు అయిన బమ్మెర పోతనామాత్యుని కథ అందరికీ తెలిసినదే. సామాన్య రైతు కుటుంబానికి చెందిన పోతనకు శ్రీరామచంద్రుడు కలలో కనిపించి భాగవతాన్ని తెనిగించమనటం, అందుకు పోతన శ్రీకారం చుట్టడం, అతని బావమరిది శ్రీనాథ మహాకవి ఆ కృతిని రాజులకు అంకితమివ్వు అనటం, అతనికి సరస్వతీ సాక్షాత్కారం. ఇది భక్తి ముక్తిదాయకమైన పోతన కథ.
నట వర్గం: చిత్తూరు నాగయ్య, గౌరీనాథశాస్ర్తీ, లింగమూర్తి శివరావు, సిహెచ్.నారాయణరావు, మాలతి, సి.హేమలత, సుందరమ్మ, టంగూరు సూర్యకుమారి, సుందరమ్మ సామ్రాజ్యము
సాంకేతికవర్గం: దర్శకత్వం: కె.వి.రెడ్డి, నిర్మాత: మూలా లక్ష్మీనారాయణ స్వామి. రచన: సముద్రాల రాఘవాచార్యులు, సంగీతం: చిత్తూరు నాగయ్య, నిర్మాణ పర్యవేక్షణ: బి.ఎన్.రెడ్డి, నిర్మాణ కార్యదర్శి: లింగమూర్తి.

-ఎ.సి.పుల్లారెడ్డి