Others

ఆందోళన కలిగించే ఆస్తమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తమా అన్నది దీర్ఘకాలిక, ఎడతెగని ఊపిరితిత్తుల సమస్య. దగ్గు, ఛాతి బిగపట్టినట్టు వుండడం, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, పిల్లికూతలు తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా లక్షణాల్లో శ్వాస నాళాల్లో వాపు వచ్చి అవి కుచించుకపోతాయి. దాంతో శ్వాస కష్టంగా అనిపిస్తుంది. ఆస్తమా సమస్య వున్న 78శాతం మందిలో అలెర్జిక్ రైనైటిస్ కూడా వుంటుంది. ఈ రెండింటి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఎక్కువ మందిలో అలెర్జిక్ రైనైటిస్‌తోనే మొదలై ఆస్తమాగా మారుతుంది. ఆస్తమా వున్న వారికి శ్వాస కోస ఇనె్ఫక్షన్లు వస్తే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది. ఆస్తమా వస్తుంటే తేమ తక్కువ వుండేలా చూసుకోవడంతోపాటు వారానికోసారి బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, బ్లాంకెట్లను వేడినీటితో వాష్ చేయాలి. ఇంట్లో పెంపుడు జంతువుల కారణంగా అలెర్జీలు వస్తుంటే వాటిని ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంట్లో పీల్చే వాయువును స్వచ్ఛంగా మార్చేందుకు ఎయిర్ ప్యూరిఫయర్లు మార్కెట్లో వున్నాయి. వాటిని వాడుకోవడం వల్ల ఉపయోగం వుంటుంది.