Others

తరచు అలెర్జీ సమస్య... ఎందుకని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక కాలంలో బాగా విస్తరించిపోయిన ఈ సమస్య ఏదంటే అలెర్జీ. ప్రపంచ వ్యాప్తంగా 10నుంచి 30శాతం మంది వరకు అలెర్జీ బాధితులే.
అలెర్జిక్ రైనైటిస్
అలెర్జిక్ వ్యాధుల్లో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. కాలానుగుణంగా లేదా ఎప్పుడూ వుండొచ్చు. దీన్ని హేఫీవర్ అని కూడా అంటారు. అదేపనిగా తుమ్ములు, ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం, ముక్కులో, కళ్లల్లో, నోటిపై భాగంలో దురద వుంటుంది. ఈ సమస్య ఎప్పుడూ వేధిస్తుంటే ఇంట్లో వుండే డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువులు, బూజు కారణం కావచ్చు. ప్రధానంగా గాలిలో చేరిన అలెర్జీ కారకాలు శ్వాస తీసుకునే సమయంలో ముక్కులో చేరడం వల్ల ఈ సమస్య నిరంతరం వేధిస్తుంటుంది. అలెర్జీ కారకాలు ముక్కులోపలికి చేరిన తరువాత కణజాలం వాపునకు గురవుతుంది. ఈ అలెర్జీకి కళ్లు, చెవులు, సైనస్‌తోనూ సంబంధం ఉంది.
యుర్టికేరియా (దద్దుర్లు)
చర్మంపై ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. పెద్దగా లేదా చిన్నగా ఉండొచ్చు. దురద వుంటుంది. కొన్ని రకాల ఆహార పదార్ధాలు, మందుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.చిన్నారుల్లో వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు.
అలెర్జిక్ కంజెంక్టివైటిస్
అలెర్జీ కారకాలకు కళ్లు స్పందించినప్పుడు ఏర్పడే లక్షణాలు కళ్లు ఎర్రబారడం, దురద, వాపు, నీరు కారడం, కనుగుడ్డు చుట్టుపక్కల, కనురెప్ప లోపలి వైపు భాగంలో వాపు, మంట వుంటాయి.
ఫుడ్ అలెర్జీ
ఫుడ్ అలెర్జీ వున్న వారికి కొన్ని రకాల ఆహార పదార్దాలు సరిపడవు. దాంతో ఆ పదార్ధాలు తీసుకున్నప్పుడు అందులో వుండే అలెర్జీ కారకాలపై పొరాడేందుకు రోగ నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ఆవుపాలు, గుడ్లు, వేరుశనగ, గోధుమ, సోయా, చేపలు, షెల్ ఫిష్, నట్స్‌లో వుండే కాంపొనెంట్స్ వల్ల ఫుడ్ అలెర్జీలు వచ్చే అవకాశం వుంది. యాంటీబయోటిక్స్ (పెన్సిలిన్), యాస్పిరిన్, ఐబూప్రొఫెన్ తరహా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాల వల్ల కూడా అలెర్జిక్ రియాక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
సైనసైటిస్
నాసికా కుహరములలో (ముక్కుకు అనుసంధానంగా ముక్కుపక్కన కంటి కిందభాగంలో వుండేవి) వాపునే సైనసైటిస్ అంటారు. సైనసైటిస్ వాపు కారణంగా రంధ్రాలు మూసుకుపోతాయి. అవి ఫ్లూయిడ్‌తో పూడుకుపోతాయి. అప్పుడు క్రిములు వృద్ధి చెంది ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తాయి. తలనొప్పి, ముక్క్భుగంలో నెప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
తీవ్రమైన అలెర్జిక్ రియాక్షన్స్
అనాఫిలాక్సిస్ అనేది తీవ్రమైన ప్రాణాంతక అలెర్జిక్ రియాక్షన్. ఆహార పదార్ధాలు, పురుగులు కుట్టడం, మందులవల్ల ఈ రియాక్షన్ రావచ్చు. ఈ రియాక్షన్‌కు వెంటనే చికిత్స ఇప్పించాలి. లేకుంటే ప్రాణాంతకం అవుతుంది.