AADIVAVRAM - Others

బంతి/ కందుక క్రీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పుడు బంతితో ఆడుకోని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. బంతి చిన్నపిల్లల జీవితంతో ముడిపడి ఉంటుంది. బంతిని చూసి నేర్చుకోవాల్సినవి చిన్నప్పటి కన్నా పెద్దగా అయిన తరువాతనే ఎక్కువగా ఉంటాయి.
నేను యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడు బంతిని చూసి ఓ కవిత రాశాను. దాని పేరు ‘కందుక క్రీడ’. బంతి ఎలా ప్రతిస్పందిస్తుందో చూసి ఆ కవిత రాశాను. బంతిని మనం నేలకు విసిరి కొడితే అది తిరిగి పైకి లేస్తుంది. బంతి గురించి చెప్పకుండా కవిత కొనసాగుతుంది. ఆ కవిత నేపథ్యం మాత్రం బంతే! ఆ కవిత ఇలా కొనసాగుతుంది.
నన్ను చీకట్లోకి తొయ్యాలని చూస్తావ్/ తోస్తే/ రేడియమ్‌నై వెలుగుతా

నన్ను తొక్కాలని చూస్తావ్/ తొక్కితే
అరటి పండు తొక్కనవుతా
నన్ను నీ గుప్పిట్లో బంధించాలని చూస్తావ్
బంధిస్తే/ సముద్రాన్నవుతా

నా చేతులు నరకాలని చూస్తావ్
నరికితే/ గుర్రపు డెక్క ఆకునవుతా

నన్ను చంపాలని చూస్తావ్/ చంపితే/ అమరుణ్నవుతా.
-చాలా రోజుల తరువాత బంతిని చూసినప్పుడు బంతిని మన జీవితానికి అన్వయించుకోవాలని అన్పించింది. బంతి క్రింద పడితే అది పగిలిపోదు. అక్కడే ఉండిపోదు. పైకి లేస్తుంది. కొంత బలంతో నేలను తాకితే ఇంకా కాస్త పైకి లేస్తుంది.
కిందపడ్డా పైకి లేచే గుణం రబ్బరు బంతికి ఉంటుంది. దాన్ని ఎంత గట్టిగా కొడితే అది అంత పైకి లేస్తుంది. రబ్బరు బంతి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం లేదు. అది ఏ నేలనైనా ఎదుర్కొంటుంది.
మనిషి కూడా రబ్బరు బంతిలా ఎందుకు మారకూడదు.
జీవితం తుత్తునియలు చేయాలని ప్రయత్నించినప్పుడు మళ్లీ ఎందుకు పైకి లేవకూడదు.
నిజానికి మనిషి బంతి లాంటివాడే!
కానీ
ఆ విషయం అతను అర్థం చేసుకోవడంలో ఆలస్యం అవుతుంది.
నా కవిత ‘కందుక క్రీడ’ చెబుతున్నది అదే! కొంచెం అతిశయోక్తిగా అన్పిస్తుందేమో కానీ-
అందరం గుర్తుంచుకోవాల్సింది ఇదే!