Others

బాలీవుడ్ రీమేక్‌లో వెంకీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు వెంకటేష్ ‘గురు’ సినిమా తరువాత తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథలు వింటున్న ఆయన ఇంకా ఏ సినిమాకు ఓకె చెప్పకపోవడం విశేషం. తాజాగా ఆయన బాలీవుడ్ హిట్ రీమేక్‌లో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే తాజాగా బాలీవుడ్‌లో విభిన్న చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న హిందీ మీడియం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో రీమేక్ చేస్తే మంచి విజయం దక్కుతుందని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది దర్శకురాలు నందినీ రెడ్డి. అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న నందినీ రెడ్డి ఆ తరువాత మూడు, నాలుగు చిత్రాలు తెరకెక్కించింది. తాజాగా హిందీ మీడియం చిత్రాన్ని రీమేక్ చేస్తుందట. ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని ఇందులో వెంకటేష్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయనతో చర్చలు జరుపుతారని టాక్. ఈ చిత్రానికి తెలుగు మీడియం అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో ఉందట నందినీ రెడ్డి. మరి రీమేక్ సినిమాలంటే ఎక్కువ ఆసక్తి చూపే వెంకటేష్ ఈ సినిమా చేస్తాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.