Others

ఫిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వహించిన తాజా చిత్రం ఫిదా’ నిజంగానే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. యువతను గిలిగింతలు పెట్టింది. మధ్యవయస్కులవారిని కూడా మాయచేసింది. వరుణ్‌తేజ్, సాయిపల్లవిలు నిజంగా జీవించారు. దర్శకుడు చెప్పినట్లుగా ‘లవ్ హేట్ లవ్’ స్టోరీ ఇది. మొదటి చూపులోనే ప్రేమించుకొన్నా, ఇగోవల్ల, మాటలవల్ల దూరమై వుండలేక మరలా కలిసే ప్రేమికుల కథ. శేఖర్ ఎప్పుడూ హీరోకు తన లక్షణాలనే ఆపాదిస్తాడు. ఇది ఆనంద్ నుండి వున్నదే. ఇందులో కూడా అంతే. హీరో సిగ్గరి (పొడగరి కూడా), మంచివాడు, హీరోయిన్ పక్కనున్నా నిద్రపోయే రకం. హీరోయిన్ ఎప్పటిమాదిరిగానే (ఆనంద్‌లో కమలినీ ముఖర్జీలాగా) గడుసుది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ వుంటుంది. ‘చెప్పు’ వాట్సాప్‌లో పంపే సీన్, కరివేపాకు సీన్ నవ్వించాయి. సాయిచంద్, అత్తమ్మ బాగా చేశారు. పాటలు అన్నీ బాగున్నాయి. ‘వచ్చిండే’ సంగతి చెప్పక్కర్లేదు. అలాగే ‘ఏదో జరుగుతోంది’, ‘హేయ్ పిల్లగాడా’ ‘ఊరుకోదు’ పాటలు మనసును తాకుతాయి. అలా హాయిగా సాగిపోతూ వుంటుంది ఆమనిలాగా చిత్రం. దిల్ రాజు అభిరుచి, శక్తికాంత్ కార్తీక్ సంగీతం, మధుప్రియ గాత్రం, జె.బి నేపథ్య సంగీతం, శేఖర్ రచన, దర్శకత్వం అలా కుదిరాయి. నేను ఆగస్టు 15న కర్ణాటకకు చెందిన మా స్నేహితురాలితో కలిసి చూశాను. చిన్న చిన్న అపార్థాలు పోయి అర్థం చేసుకున్నాం. అందుకే నాకు నచ్చిన సినిమా ఇది.

-కాళిదాసు విజయచంద్ర, కావలి