Others

సువర్ణ కాంతుల పూలజల్లు!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర్ణ్భారత భారతి సౌభాగ్య సౌధం
శాంతి- మావితోరణాలతో శోభిల్లగ,
గుండెల గుమ్మటాల్లో మమతాజ్యోతులు వెలుగ
ఇంటింటా విరిసేను ‘సువర్ణదీప్తుల హరివిల్లు’!!

ధర్మం - సత్యం- పరాక్రమం- అహింస
శాంతి- కాంతుల దివ్య మాలిక ‘దీపావళి’!
నరకుని కూల్చి ధరను- ధర్మస్థాపన చేసిన
వీర సాత్రాజితి- ‘్ధర్మదీక్షాజ్వాల’ ఈ ‘దీపావళి’!!

మూగజీవుల కన్నీళ్ళు తుడిచిన ‘శాంతమూర్తి!’
మహావీరుని ‘అహింసా బోధావళి’- దీపావళి!
శకహూణుల పారద్రోలిన విక్రమాదిత్యుని
భారత పరాక్రమ ప్రభావళి- ఈ దీపావళి!!
‘‘గడ్డి నరకాసురు’’లను కాల్చుటే- దీపావళి కాదు
మతాబాల వెలుగుల్లో మురియుటే దీపావళికాదు
‘‘అన్నమో రామచంద్రా’’ అనే దిక్కులేని దీనులకు
పట్టెడన్నం పెట్టడమే ‘కారుణ్య దీపావళి’!!

దేశమాత వాకిట- ధీరంగా వెలిగే దీపాలు
భారత వీర జవానుని శౌర్య విజయ పతాకాలు!
పంట పొలాలలో - తలలూపే పచ్చని దీపాలు
అన్నదాతల కలల కాంతుల సువర్ణరేఖలు!!

దేవాలయ ప్రాంగణాల్లో వెలిగే దీపాలు
‘తమసోమా జ్యోతిర్గమయా’ అనే సుప్రభాతాలు!!
సకల ప్రజల్లో వెలిగే సౌహార్ద్రతా దీపాలు
స్వర్ణ భారత మాత సుందర సువర్ణ దరహాసాలు!!

రైతన్నల చిరునవ్వులే- దేశానికి దీపావళి!
చెల్లెమ్మల కిలకిలలే- దేశానికి శోభావళి!
యువత - స్వర్ణ్భవితే- దేశానికి జ్యోత్న్సావళి!
భారతావని కవే- సువర్ణ కాంతుల దీపావళి!!

ప్రతి కలం- విశ్వశాంతి తారాజువ్వై విరాజిల్లగా
ఆసేతు హిమాచలం- అఖండ జ్యోతియై శోభిల్లగా
భారతావనిలో విరిసేను స్వర్ణకాంతుల హరివిల్లు!
‘తెలుగు భారతి’పై కురిసేను- సువర్ణదీప్తుల పూలజల్లు!!

-కళ్యాణశ్రీ జంధ్యాల వేంకట రామశాస్ర్తీ