Others

ఎందుకు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ తల్లి బిడ్డ అయినా నా బిడ్డే అని భావించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే భావన నేటి ఉపాధ్యాయుల్లో ఎంతమందికి ఉంది? ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మానసిక ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు? దానికి అసలు కారణాలేమిటి? అవగాహనా లోపమా? లేక మార్కుల వెంపర్లాటా..? ఒకప్పుడు చాకలి పద్దు రాసుకునే చదువు ఆడపిల్లకి, కుటుంబాన్ని పోషించుకునే శక్తి మగపిల్లవాడికి ఉంటే చాలు అనేవారు. కానీ ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రయాణించగలిగే సత్తా, తెలివితేటలున్నాయని నిరూపించుకునే స్థాయికి నేటి యువతీ యువకులు ఎదిగారు.
భక్తి స్థానంలో భయం
తల్లిదండ్రులు చదువుకోని వారైనా తమ బిడ్డలు చదువుకోవాలని కోరుకుంటూ కడుపు మాడ్చుకుని మరీ పిల్లలకు చదువులు చెప్పిస్తున్న రోజులివి. అలాంటి తల్లిదండ్రులకు పిల్లల్ని లేకుండా చేస్తోంది నేటి విద్యా విధానం. గురువు అంటే భక్తి ఉండాల్సిన స్థానంలో భయం ఏర్పడే విధంగా నేటి గురువుల ప్రవర్తన ఉండటం హేయం. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ఫీజుల భారం తల్లిదండ్రులపై మోపుతున్న నేటి విద్యా సంస్థల్లోని విద్యా విధానం విద్యా వ్యవస్థ కుళ్లిపోయిందనే దానికి తార్కాణం.
ఈ చక్రవ్యూహంలో తల్లిదండ్రులు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు మాత్రమే చదువులుగా భావించడం వారి వెర్రితనమా? కార్పొరేట్ విద్యా విధానం మాయాజాలమా? అనే ప్రశ్న ప్రతిఒక్కరూ తమకు తాము వేసుకోవాలి. ఏ చదువైనా వారికి బంగారు భవిష్యత్‌ను ఇస్తుందనే అవగాహన విద్యార్థులకు, తల్లిదండ్రులకు కల్పించాల్సిన నేటి విద్యాలయాలు ఎంతవరకు దాన్ని అమలుపరుస్తున్నాయి? ఒకప్పటి డిగ్రీ చదువులు చదివి ఈనాడు ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. అప్పటి విద్యకు ఉన్న విలువ నేటి విద్యా విధానానికి, విద్యకు లేదనేది నిర్వివాదాంశం. అందుకే చేతిలో ఇంజనీరింగ్ పట్టా ఉండి కూడా క్లర్క్ పోస్టుకి అభ్యర్థులు పోటీపడే దౌర్భాగ్య స్థితికి నేటి విద్యా విధానం దిగజారిపోయింది.
ఇక నిరుద్యోగ సమస్య వింటూ, చూస్తూ నేటి యువత రేపు నాకు కూడా అదే పరిస్థితి అవుతుందేమో అనే న్యూనతా భావంతో మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు! మరోపక్క ఇప్పటి కార్పొరేట్ విద్యా విధానంలో పిల్లలను ఒత్తిడికి గురిచేస్తూ ముందు సెక్షన్, వెనక సెక్షన్ అని మారుస్తూ వారిని మానసికంగా న్యూనతకు గురిచేస్తున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. ఇటీవల ఒకే వారంలో ఆరుగురు విద్యార్థులు ఇంకా ప్రపంచం అంటే ఏమిటో పూర్తిగా అవగాహన లేని చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకోవాలనుకునే దృఢ నిశ్చయానికి వచ్చారంటే వారు ఎంతటి మానసిక సంఘర్షణకు గురై ఉంటారో ఊహించవచ్చు.