Others

పెళ్లిఖర్చులు తడిసి మోపెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసినట్లే. నవంబర్‌లో దేశంలో చాలాచోట్ల పెళ్లిబాజాలు మోగుతాయి. అయితే వస్తుసేవల పన్ను, పెద్దనోట్ల రద్దు వంటి చర్యల తరువాత వివాహాల ఖర్చు తడిసిమోపెడు కాబోతోందన్నది అందరినీ భయపెడుతోంది. పెళ్లి ఖర్చులు గతంతో పోలిస్తే అమాంతం పెరిగిపోతాయనడంలో సందేహమేమీ లేదు. ముఖ్యంగా జిఎస్‌టి బాదుడు ఫలితం ఇది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. అసోచామ్ అంచనా. మనదేశంలో వివాహరంగంలో ఏటా 1 ట్రిలియన్ రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రతి ఏడు ఈ మొత్తం 25 నుంచి 30 శాతం మేరకు పెరుగుతూ వస్తోంది. సగటున భారత దేశంలో ఒక్కో వివాహానికి కనీసం మూడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. గరిష్ఠంగా 8 కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. ఇది మామూలు రోజుల్లో జరిగే వివాహ ఖర్చన్నమాట. అయితే ఇప్పుడు జిఎస్‌టి మూలంగా ఈ ఖర్చు మరో పది శాతం పెరుగుతుందన్నది అంచనా. ఎందుకంటే వివాహంలో భాగంగా చేసే ఏర్పాట్లపై విధించే వస్తుసేవల పన్ను బాదుడు తక్కువగా ఏమీ లేదు. ముఖ్యంగా బంగారం, ఆభరణాలు, ఇతర పెళ్లి వస్తువులు, ఫంక్షన్‌హాళ్లను అద్దెకు తీసుకోవడం, విందు వినోద కార్యక్రమాల కోసం హోటళ్లలో ఏర్పాట్లు చేయడం, మేకప్, బ్యూటీపార్లర్ ఖర్చులపై జిఎస్‌టి ఎక్కువ మోతాదులోనే ఉండటం దీనికి కారణం. ఇక వీడియోలు, ఫొటోలు, వాహనాల బుకింగ్ వంటివన్నీ మరింత భారం కానున్నాయన్నమాట. సాధారణంగా పెళ్లి ఏర్పాట్లలో ఇంతకాలం కొన్ని సేవలకు పన్ను ఉండేది కాదు. మరికొన్ని ఉన్నా పెద్దగా లెక్కలోకి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు జిఎస్‌టి ప్రతి సేవకూ విధిస్తున్నారు. పెళ్లి ఏర్పాట్లలో ప్రతిదానికి సగటున 18 శాతం జిఎస్‌టి ఉంది. టెంట్లు, వంటపాత్రలు, చిన్నచిన్న వాహనాలు, భజంత్రీలు, ఫొటోలు, మేకప్ వంటివాటికి గతంలో బిల్లులు ఉండేవి కావు. పన్నులు చెల్లించేవారు కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ జిఎస్‌టి పరిధిలోకి వచ్చేసాయి. పెళ్లి దుస్తులు, పాదరక్షల వంటి వాటికి కూడా చమురు వదలక తప్పదు. రూ.500కు పైబడిన ధర ఉన్న పాదరక్షలపై కూడా 18శాతం జిఎస్‌టి వసూలు చేస్తున్నారు. ఇక పెళ్లిల్లో బంగారం, ఇతర విలువైన ఆభరణాల కొనుగోలు తప్పనిసరి. బంగారం, వజ్రాలతో కూడిన ఆభరణాలపై ఇప్పుడు 3 శాతం పన్ను విధించారు. గతంలో ఇది 1.5 శాతంగా ఉండే. గతంతో పోలిస్తే స్టార్ హోటల్ బిల్లులపై పన్ను 28 శాతం మేరకు అదనంగా పడబోతోంది. నిజానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవలకు జిఎస్‌టి వసూలు చేయడం ఈసారి అదనపు భారానికి కారణం కాబోతోంది. ఇది 18శాతంగా ఉంటుంది. ఇక దూరప్రాంతాలకు వెళ్లి వివాహాలు చేసుకోదలచినవారి ఖర్చులు మరో పది లేదా పదిహేను శాతం మేరకు పెరగక తప్పదు. అయితే ఇదేమీ పెద్ద ప్రభావం చూపదు. ఎందుకంటే ఈ తరహా వివాహాలను ప్రవాస భారతీయులు, విదేశీయులు ఎక్కువగా ఇష్టపడతారు. వారు ఈ ఖర్చులను భరించగలరు. ఎటొచ్చీ సంప్రదాయ సగటు భారతీయుడికి మాత్రం పెళ్లి ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి.

- భారతి