Others

సానుభూతి ఒక ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సానుభూతి ఒక ఆయుధం. ఉపాధ్యాయునికి అదే బలం. ఉపాధ్యాయుడికి ఎంత మేధాశక్తి ఉన్నా బోధించిన విషయం విద్యార్థులు అందరికీ అందదు. పిల్లలు వివిధ నేపథ్యాల నుంచి వస్తారు. విద్యార్థులకు ఎన్నో శక్తులు అన్యాయం చేసి ఉంటాయి. అవన్నీ వారిని ప్రభావితం చేస్తుంటాయి. తరగతి గదికి వచ్చే ముందు వాటిని వదిలిపెట్టలేరు. ఇతర శక్తుల ముందు విద్యార్థి నిస్సహాయుడిగా ఉంటాడు. ఆ సమయంలో వారి బుర్రలోకి పాఠాన్ని ఎక్కించే ప్రయత్నం చేసినప్పుడు వారు సరిగా స్పందించరు. లేదా అసహనానికి, ఆగ్రహానికి గురవుతాడు. అది ఉపాధ్యాయునికి పరీక్ష. అక్కడ ఉపాధ్యాయుడు అహం చంపుకోవాలి. తనలో ఉండే సానుభూతిని లేపాలి. అసలు విషయం రాబట్టి విద్యార్థికి పాఠం అర్థమయ్యేలా తీర్చిదిద్దాలి. అది ప్రేమతో చేయాలి. ఉపాధ్యాయుడు సిలబస్‌పై దృష్టి పెట్టినదానికన్నా సమాజ అధ్యయనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ సానుభూతి కార్యాచరణలోకి రావాలి. విద్యార్థి కష్టాలను విని పరిష్కారం చూపి పాఠాలు చెబితే జీవితంలో ఆ ఉపాధ్యాయుడ్ని మరిచిపోడు. సంతోషం పంచుకోవడం గొప్పతనం కాదు. అందుకే ఉపాధ్యాయుడు ఒక బ్లాటింగ్ పేపర్. అంటే సిరాను గుంజుకునే పేపర్‌లాగా ఉపాధ్యాయుడు తయారు కావాలి.

సామాజిక స్పృహ

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగానే జరుగుతాయి. అవి మనకు కొన్ని పాఠాలు కూడా నేర్పుతాయి. హైదరాబాద్ నుంచి నైవేలికి వెళ్లేందుకు విమానంలో చెన్నైకు వచ్చాం. తరువాత నాలుగు గంటలు కారులో ప్రయాణం చేసి నైవేలికి వచ్చాం. వచ్చిన రోజు పిల్లల తల్లిదండ్రులు, అధికారులు, ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనడం సంతోషం కలిగించింది. కానీ తెల్లవారే వరకు జల్లికట్టు ఉద్యమం రాష్టమ్రంతా ఎగబాకింది. స్కూళ్లు మూసేసారు. ఇక విశ్రాంతి తీసుకుందామనుకుంటుండగా 11 గంటలకే పిల్లలు, విద్యార్థి నాయకులు ప్రత్యక్షమయ్యారు. నైవేలీ తెలుగు సమితి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. పిల్లలు క్రమశిక్షణతో కూర్చున్నారు. నేనేం చెప్పాలో ఆ పిల్లలే అడిగారు. గంటన్నరసేపు క్లాస్ తీసుకున్నాను. పిల్లలు చాలా క్రమశిక్షణగా తమ సందేహాలు అడగడం, చర్చ జరగడం జరిగిపోయింది. నాకు వారికి మధ్య జరిగిన చర్చలో ఇరువురం చాలా విషయాలు నేర్చుకున్నాం. తరగతి గది కేవలం జ్ఞానమే నేర్పదు. పౌరునికి బాధ్యతను కూడా నేర్పుతుంది. విద్యార్థులు పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలవైపు నడుస్తారు. నైవేలీలోని విద్యార్థులను రేపటి ఉద్యోగులుగా ఊహించుకుంటే బాధ్యతగల పౌరులుగా విధి నిర్వహణ కొనసాగిస్తారన్న నమ్మకం కలిగింది. ఒకనాడు కాకతీయ యూనివర్శిటీలో పరిధిలో వరంగల్‌లో అమ్మాయిలపై యాసిడ్‌దాడి జరిగినపుడు ఒక మాజీ డిజిపి బాధను గమనించాను. సామాజిక ఉద్యమాలకు పుట్టినిల్లయిన వరంగల్‌లో పిల్లలపై పోలీసు దాడులు జరిగాయి. సామాజిక ఉద్యమాలు అణచివేయాలని చూసారు. సామాజిక ఉద్యమాలు సన్నగిల్లాయి. దాంతో ఒక బాధ్యతాయుతమైన పౌరసమాజ స్పందన తగ్గింది. విద్యార్థి యూనియన్ల ఎన్నికలను నిషేధించడం వల్ల కళాశాలల్లో వాతావరణ మారింది. తరగతి గది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే నేర్పదు. సామాజిక స్పృహ మాత్రమే కలిగించదు. బాధ్యతాయుతంగా ప్రజాస్వామికంగా ఎలా నడవాలో చెబుతుంది. ఆ విధమైన నాయకత్వాన్ని కూడా తరగతి గదే అందిస్తుంది.

-డా.చుక్కా రామయ్య