Others

‘పొగ’తో ప్రాణాలకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగాకు, నికోటిన్‌తో తయారు చేసిన చుట్టలు, సిగరెట్లు, చివరకు ఇ-సిగరెట్లు కూడా ప్రాణానికి ముప్పు తెచ్చిపెడతాయని అందరికీ తెలిసిన విషయమే. ధూమపానం అలవాటు లేకపోయినప్పటికీ పొగతాగేవారి పక్కన ఉండి పొగను పీల్చేవారికి కూడా ప్రమాదం తప్పదన్న విషయం కూడా చాలామందికి తెలుసు. అయినా బలహీనత, వ్యసవం వల్ల వాటిని చాలామంది మానలేకపోతున్నారు. అయితే తాజా అధ్యయనాలు మరికొన్ని ఆందోళనకర విషయాలను వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే విస్తుపోవలసి వస్తుంది. రోజుకు కనీసం వెయ్యికోట్ల సిగరెట్లను మనవాళ్లు కాలుస్తున్నారు. వాటివల్ల పొగాకు పొగ వల్ల వేలాది టన్నుల హానికారక, విషతుల్య వాయువులు గాలిలో కలుస్తున్నాయి. కేన్సర్‌కు పొగతాగడం ఒక కారణం. పొగాకు వల్ల వచ్చే వాయువుల్లో 70 రకాల రసాయనాలు ఉంటాయి. కేన్సర్ రావడానికి ఆ విష రసాయనాలు కారణమవుతున్నాయి. నిజానికి సిగరెట్‌తోపాటు వాటి చివరన ఉండే సిగరెట్ పీకలు (్ఫల్టర్)లు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. పట్టణాలు, తీరప్రాంతాల్లో తొలగిస్తున్న చెత్త, వ్యర్థాలలో 40 శాతం ఈ చుట్ట, సిగరెట్ పీకలే ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిజానికి ఈ సిగరెట్ పీకల్లో ఉండే పదార్థం పూర్తిగా ధ్వంసం కాదు. నీటిలో ఇవి కలిసిన తరువాత అవి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయి. పొగాకు పంట ప్రాణాలకు, పర్యావరణానికి ప్రమాదకరమని, నదులు, సముద్రాల్లో కలుస్తున్న సిగరెట్ పీకల జలచరాలకు, జల వాతావరణ సమతుల్యతకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయని పర్యావరణ వేత్త ప్రొపెసర్ పురుష్తోతం రెడ్డి హెచ్చరిస్తున్నారు. పొగాకు ఉత్పత్తుల వ్యర్థాలను తింటున్న జలచరాలు అస్వస్థతకు గురవుతున్నాయని ఆయన అంటున్నారు. దేశంలో కేన్సర్‌తో బాధపడుతున్నవారిలో 44 శాతం మంది పొగతాగడంవల్లే ముప్పు ఎదుర్కొంటున్నారని అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్ పి.విజయానందరెడ్డి చెప్పారు. పొగాకు వాడటం వల్ల శరీరంలోకి చేరే విష రసాయనాల నుంచి డిఎన్‌ఎను రక్షించేందుకు రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుందని, అయితే పదేపదే అలా జరుగుతూంటే జన్యుపరమైన సమస్యలకు దారి తీస్తుందని ఆయన అంటున్నారు. ధూమపానానికి బానిసైనవారు అందులోంచి బయటపడటానికి నికోటిన్‌తో కూడిన ఇ-సిగరెట్‌ను వాడుతున్నారు. అయితే నికోటిన్ కూడా ప్రమాదకరమైనదే. ఒక గ్రాము పొగాకులో ఒక మిల్లీ గ్రాము నికోటిన్ ఉంటుందని, దానికే వినియోగదారుడు బానిసవుతున్నాడని, కేవలం నికోటిన్‌తో కూడి ఇ-సిగరెట్ వాడినా అలాగే అలవాటుపడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా దేశాలలో నికోటిన్ విష రసాయనాల జాబితాలో ఉందని చెబుతున్నారు. అది కళ్లు, హృదయం, మూత్రపిండాలను దెబ్బతీస్తుందని అంటున్నారు. పొగాకు, నికోటిన్ ఉత్పత్తులను నియంత్రించాలని వారు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న గణాంకాల ప్రకారం పొగతాగడం అలవాటు లేకపోయినా పొగతాగేవారి సమీపంలో ఉండి ఆ గాలి పీల్చడం వల్ల అనారోగ్యానికి గురై మరణిస్తున్నవారి సంఖ్య ఏటా పది లక్షలు. పొగతాగినప్పటికీ దీర్ఘకాలం జీవించి ఉన్నవారిని ఈ విషయంలో ఉదాహరణగా తీసుకోవడం మూర్ఖత్వమని, అలాంటి వారి సంఖ్య పరిగణనలోకి తీసుకోలేనంత స్వల్పమని వైద్యులు అంటున్నారు.

-ఇందులేఖ