Others

భద్రత లేనిది ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో మతరాజ్యాలు చాలానే ఉన్నాయి. ముస్లింలకు, క్రైస్తవులకు మత ప్రాతిపదికన చెప్పుకునేందుకు చాలా దేశాలు ఉన్నాయి. మరి హిందువులకు ఒక్క దేశమైనా ఉన్నదా? హిందూమతం లేదా హిందూ ధర్మం మిగతా రెండు మతాలకన్నా చాలా ప్రాచీనమైనది. క్రీస్తునకు కొన్నివేల సంవత్సరాలకు ముందే భారతదేశంలో వేదాలు పుట్టాయి. ఇది అందరూ అంగీకరించిన, కాదనలేని సత్యం. ఇప్పుడే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి అనవచ్చు. భారత ఉపరాష్టప్రతిగా పదవికాలం ముగిసేనాటికి ముందు రోజున హమీద్ అన్సారి ‘రాజ్యసభ టి.వి.’ కోసం కరణ్ థాపర్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మతం ప్రాతిపదికన, అతని భారతీయతను ప్రశ్నించటమనేది తీవ్ర ఆందోళనకరమని అన్నారు. తమకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలతో ముస్లింలు, అభద్రతాభావంతో ఉన్నారన్న అంచనాతో ఏకీభవిస్తారా అంటే ‘అవును, ఇది అక్షరాలా నిజం’ అన్నారు. ఈ మేరకు వార్తలు వచ్చాయి. ఇక ఆగస్టు నెలలో విషయాలు. తరువాత దిగ్భ్రమ కలిగించే పరిణామాలు సెప్టెంబరు చివరి వారంలో బయటకొచ్చాయి. ఆ విషయాలు తెలుసుకోవాలి. దాదాపు డెబ్బయి, ఎనబై ఏళ్ల వయస్సున్న ఇద్దరు అరబ్‌షేక్‌లు చేతికఱ్ఱ లేకుండా నడవలేని స్థితిలో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బాలికలను వివాహం చేసుకునేందుకు ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి సిద్ధపడటం. డబ్బున్నంత మాత్రాన సరిపోదని, జీవితాన్ని అనుభవించాలని, శృంగారం అంటే ఇష్టమని, దానికోసం ఏమైనా చేస్తామని వారు బదులివ్వడం వారిని పట్టుకున్న పోలీసులను నివ్వెరపరచింది. ప్రతి ఏటా ఇలా చిన్నపిల్లలతో వివాహానికి ఒమన్, ఖతార్, సౌదీ ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది అరబ్ షేక్‌లు మనదేశానికి వస్తుంటారని అంచనా. లైంగికపటుత్వం కోసం వారు ఔషధాలు వాడతారని మరో వార్త. ఇవి సెప్టెంబర్ 23, 27 తేదీలలో ప్రచురితమైనాయి. ఒమన్ నుంచి వచ్చిన ఇమాం వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకునే స్థితిలో 11వ పెళ్లికోసం మనదేశానికి వచ్చాడు. అలాంటి వారికి మనదేశంలోని ఖాజీలు సహకరించడం బాధాకరం. హోటళ్లలోను, సొంతంగా కట్టిన అతిథిగృహాల్లోను ఈ అక్రమాలు సాగిపోతున్నాయి. ఈ అంశాలు ఒకటీ అరా పత్రికల్లో మాత్రమే ప్రచురితమవుతుంటాయి. అయితే ఇంత అన్యాయం జరుగుతున్నా ఆ వర్గానికే చెందిన నాయకులు స్పందించరు. ఇలాంటి ఘటనలపై హమీద్ అన్సారీ, ఎంఐఎం నాయకులు ఒవైసీలు, నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తున్న యశ్వంత్‌సిన్హాలు నోరు విప్పరు. ముస్లింల భద్రతకు ముప్పు ఏర్పడినది ఎవరివల్ల? ముస్లింల అభద్రతపై మాట్లాడేవారు అసలు బాధితుల పక్షాన, అసలు నిందితులకు వ్యతిరేకంగా మాట్లాడరు. కమ్యూనిస్టులు, హేతువాదులు వౌన ప్రేక్షకులుగా మిగిలిపోతారు. నిజానికి పేద ముస్లింల పక్షాన నోరువిప్పని లౌకికవాదులు వీరంతా. ఈ సందర్భంలో హైదరాబాద్ శివారు కోకాపేటలో ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కనె్వన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన వచ్చింది. ఇక్కడ అరబ్ షేక్‌ల బారిన పడుతున్న ముస్లిం బాలికల రక్షణ ముఖ్యమా? కనె్వన్షన్ సెంటర్ ముఖ్యమా? రాజకీయ పక్షాల వైఖరిని చూస్తే ముందుముందు మనదేశం ఎలా రూపాంతరం చెందుతుందోనన్న ఆందోళన కలుగుతోంది.

-చాణక్య