ఉత్తరాయణం

మార్పు వస్తే మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమని, తమ మతాన్ని అవమానించేవారిని ముస్లింలు, క్రైస్తవులు ఎంతమాత్రం సహించరు. హిందువులే నోరుమెదపరు కనుక అందరికీ లోకువైపోయారు. ఈమధ్యే వారిలో కొద్దిపాటి మార్పు కనిపిస్తోంది. సకల సదుపాయాలూ, వైభోగాలు అనుభవిస్తూ కూడా షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లు దేశంలో అసంతృప్తి పెరిగిపోతున్నది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోపగించిన కొన్ని హిందూ సంఘాలు వారి సినిమాలను బహిష్కరించగా అమీర్ కళ్లు తెరచుకున్నాయి. నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి గర్వపడతాను అని చెబుతూ సభ ల్లో జాతీయగీతం పాడుతున్నాడు. మహారాష్టల్రో కరవు ప్రాంత ప్రజల సహాయార్థం కూలీలతో కలిసి మట్టి తవ్వి తట్టలు మోసి సేవ చేశాడు. అతనిలో నిజంగా మార్పు వస్తే మంచిదే.
-సాహిత్యదీప్తి, రమణయ్యపేట
దార్శనికుడు మధోక్
దార్శనికుడు, దేశభక్తుడు భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు బలరాజ్ మధోక్ మరణం దేశానికి తీరని లోటు. విలువలకు, సిద్ధాంతాలకు చివరి శ్వాసవరకు కట్టుబడి ఉండటమే కాక జనసంఘ్ పార్టీ ఆశయాలను, సిద్ధాంతాలను, రాజకీయ అధికారం కోసం వదులుకోకుండా నిలబడిన వ్యక్తి మధోక్. ఆయన సేవలను జనసంఘ్ నుంచి భాజపాగా రూపాంతరం చెందిన తర్వాత కూడా పార్టీ ఉపయోగించుకోలేకపోయింది. మధోక్ నాటి తరానికి స్ఫూర్తిదాయకమైతే, నేటి తరానికి ఆదర్శవాది, మార్గదర్శి.
- వేదుల జనార్థన్ రావు, వంకావారి గూడెం
సింగపూర్ కంపెనీల పెత్తనం
వెనకటికి ఎవతో ముసలమ్మకు పెత్తనమిస్తే నెత్తికెక్కి కూర్చొని తానాడమన్నట్టల్లా ఆడమందట. అలాగే ఉంది మన రాజధాని నిర్మాణం. మాస్టర్ ప్రణాళికను కేబినెట్‌లో చర్చించి విధివిధానాలను రూపొందించి తనుగుణంగా నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాక కూడా సింగపూర్ ప్రైవేటు కంపెనీల పెత్తనం ఎక్కువైపోయింది. డిజైను జష్టారాజ్యంగా మార్చెయ్యడం, ఎస్టిమేట్లను పెంచెయ్యడం వల్ల సీడ్ క్యాపిటల్ వైశాల్యం ఆమోదించిన 8 చదరపుకిలోమీటర్ల నుండి 17 చదరపు కిలోమీటర్లకు అమాంతం పెరిగిపోయింది. అందువల్ల మరొక ఇరవైవేల కోట్లు అదనంగా నిధులు కావాల్సి ఉంటుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రాష్ట్రానికి కేంద్రం నుండి నయాపైసా సహాయం అందడం లేదు. రాజధాని నిర్మాణం అంతా రాష్ట్రానికి సంబంధించిన విషయం అంటూ కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. ఈ తరుణంలో ఇష్టారాజ్యంగా ప్లానులు పార్చేసి నిర్మాణ వ్యయం పెంచడం అంత శ్రేయస్కరం కాదు. మాస్టర్ ప్లాన్‌ను నిశ్చయం చేసుకొని అంచలంచెలుగా నిర్మాణం సాగించడం ఉత్త మం. రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. వాటి పరిష్కారంపై తక్షణం దృష్టి కేంద్రీకరించాలి.
- ఎ.కనకదుర్గ, తెనాలి
ఫిరాయింపు నిరోధక చట్టం ఎక్కడ?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరుగుతున్న ఎమ్మెల్యేల పార్టీల ఫిరాయింపులు చూస్తుంటే అసలు ఫిరాయింపు నిరోధకచట్టం ఉందా? అనిపిస్తుంది. అవసరంలేకపోయినా అధికార పక్షాలు రెండురాష్ట్రాలలోను ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటం శోచనీయం. ఈ ఫిరాయింపుల ప్రోత్సాహం వల్ల ప్రభుత్వాల ప్రతిష్ట దిగజారిపోతున్నది. ప్రతిపక్షం బలంగా ఉన్నప్పుడే పాలకపక్షం సమర్థవంతమైన పాలన ఇస్తుందనే ప్రజాస్వామ్య సూత్రాన్ని తుం గలో తొక్కి అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని అధికారపక్షాలు ప్రయత్నిస్తుండడం సబబు కాదు. ఫిరాయిపుదారులపై చర్యలు తీసుకోకపోతే అసలు ప్రతిపక్షంలో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీ ఫిరాయించిన నంద్యాల, అరకు ఎంపిలపై ఇప్పటిదాకా చర్యలు లేవు. ఎమ్మెల్యేలు అధికార, ధన వ్యామోహాలకు లోబడి చొక్కాలు మార్చినట్టు పార్టీలను మారుస్తుంటే ప్రజస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచిది కాదు. పార్టీ మారే ఉద్దేశం ఉంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో గెలిచి సత్తా చాటాలి కాని, ఇలా దొంగదారిన పార్టీలు మారడం సముచితం కాదు. ఇకనైనా అధికార పార్టీలు ఈ ఫిరాయింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి పాలనపై దృష్టి పెడితే మంచిది.