Others

తప్పదు మరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెజీనా తెరంగేట్రం చేసినప్పుడు చేతిలో ఫటాఫటా రెండు హిట్లు పడిపోయాయి. వెంటనే ఒక్కసారిగా రెజీనా ఖాతాలో అవకాశాలు కూడా అంతే వేగంగా పడిపోయాయి. కానీ రోజురోజుకి చిత్రాల విజయాల శాతం మాత్రం రెజీనా అకౌంట్‌లో తగ్గిపోవడంతో ఆమె పారితోషికం కూడా రూపాయి రూపాయి తగ్గిపోతోంది. తన అందం, నటనతో మంచి అవకాశాలు దక్కించుకున్నా హిట్లు లేకపోవడంతో డిమాండ్ కూడా పడిపోయింది. మొదట్లో రెజీనా ఎంత అడిగితే అంత ఇచ్చే నిర్మాతలు ప్రస్తుతం ఆమెకు పారితోషికాన్ని
నిర్ణయించడానికి ముక్కులెగరేస్తున్నారు. చిన్నాచితకా చిత్రాల్లో తప్పదన్నట్లు రెజీనాను తీసుకున్నా పెద్ద చిత్రాల్లో మాత్రం తక్కువ పారితోషికానికి ఎంపిక చేస్తున్నారు. రెజీనా కూడా తాను తీసుకునే పారితోషికంలో సగం ఇచ్చినా సరే పెద్ద హీరోలతో చేయడానికి సిద్ధమంటోంది. పాపం రెజీనా ఖాతాలో మరో హిట్ పడితే కానీ ఆమె బాధలు తీరవు!