Others

వృద్ధులు సుద్దులుకారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్యం బంగారమైతే, యవ్వనం వెండి లాంటిది. మరి వృద్ధాప్యం? కచ్చితంగా ఇది ఇనుమే. బంగారం, వెండితో పోలిస్తే ఇనుము ఖరీదు చాలా తక్కువ. ధర తక్కువే అయినా దాని అవసరం ఎక్కువ. అది మన అవసరాలన్నిటిని తీరుస్తోంది. భవనాలు నిర్మించడానికే కాదు, రైలు పట్టాలకి, వంతెనల నిర్మాణానికి, యంత్రాల తయారీకి ఇలా ఎన్నిటికో దాని అవసరం ఉంది. అలాగే వృద్ధాప్యంలో మనుషులు పని చేయడానికి అసక్తులైనా, వారి ఆలోచనలు, సలహాలు అందరికీ ఎంతగానో ఉపకరిస్తాయి. అందువల్ల వారిని పనికిమాలిన వారిగా భావించి అలక్ష్యం చేయడం తగదు.
పాశ్చాత్య దేశాలలో స్ర్తి పురుషులందరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటారు. ఆ కారణంగా భార్యాభర్తలకు తమ పిల్లల్ని దగ్గరుండి సాకడానికి కుదరదు. అందుచేత బిడ్డలు పుట్టగానే వారిని ఆయాలకు అప్పగించేస్తారు. వారి సంరక్షణలోనే పెరిగి పెద్దవారవుతారు. ఆ కారణంగా తల్లిదండ్రులకు పిల్లలతో అనుబంధానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పోనీ వారిని తాత నాన్నమ్మలు చూసుకోవాలన్నా వయసురీత్యా ఇబ్బందే మరి. అందుకే వారు తమ తల్లిదండ్రుల్ని ఓల్డేజి హోమ్స్‌లో చేర్పిస్తుంటారు.
ప్రతి ఏడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకోవడం మనందరికి తెలిసిందే. బహుశా సంవత్సరానికి ఒక్క రోజైనా కన్నవాళ్లని కలిసి వారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికేమో! అయితే మనకు ఆ అవసరం లేకున్నా వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఓ అలవాటుగా మారింది.
మన దేశం ఇతర దేశాలతో పోలిస్తే సంస్కృతీ సంప్రదాయాల్లో చాలా తేడా ఉంది. అనివార్య పరిస్థితులలో తప్ప దంపతులెవరూ ఇక్కడ తమ బిడ్డల్ని ఎడంగా ఉంచడానికి ఇష్టపడరు. తమ చిన్నారుల్ని వారసత్వ సంపదగా భావించి పెద్దయ్యేదాక వారి ఆలనా పాలనా చూస్తూ వారి మీద ప్రేమాభిమానాలు కురిపించడం పరిపాటి. ఆ రకంగా బిడ్డలతో తలిదండ్రులకు విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది.
చరిత్రలోకెళితే మహారాజులు సైతం వృద్ధుల సలహాల్ని అడిగి తెలుసుకుంటూ ప్రజారంజకంగా పాలన సాగించారన్న సంగతి మనందరికి తెలిసిందే. అందువల్ల వృద్ధులు ఎప్పుడూ సుద్దులు కారు అని, వాళ్ల అవసరం ఎల్లప్పుడూ మనకు ఉంటుందని భావించాలి. తప్పని పరిస్థితులలో మాత్రమే వాళ్లని వృద్ధాశ్రమాలకు పంపాలే తప్ప వాళ్లవల్ల మన స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని భావించకూడదు. ప్రతి గడపలో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలంటే విధిగా పెద్దలు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-దూరి వెంకటరావు