AADIVAVRAM - Others

ఆహార లౌల్యం ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: భర్త మరణించిన తరువాత మాకు తెలిసిన ఒకావిడ తిండిపోతులా మారింది. అందుకు కారణాలు, నివారణ చెప్పండి.
-చంద్రశేఖరరావు, చిలకలూరిపేట
జ: ఆహార లౌల్యం (ళనఆ్ఘ ఒళశఒజఆజ్పళ ఆ్య చ్య్యిజూ) అనేది ఒక మానసిక బలహీనత. కమ్మని భోజన పదార్థాలను కంటితో చూసినప్పుడు, వాసన చూసినప్పుడు, రుచి చూసినప్పుడు ఇంక ఆగలేనితనం ఇందుకు కారణం.
డబ్బుకీ, మందుకీ, మగువకీ లొంగని వాడు కూడా తిండికి దాసోహమనవచ్చు.. దూబరదిండి, చప్పరింత లాంటి పేర్లు ఈ ఆహార లౌల్యం ఎలాంటిదో నిరూపిస్తాయి.
ఆహారం కమ్మగా, రుచిగా, ఆరోగ్యదాయకంగా ఉండాలి. ఇలా కోరుకోవటం, అందుకోసం తగిన జాగ్రత్త తీసుకోవటం ఆహార లౌల్యం అనిపించుకోదు. ప్రతీ మనిషికీ ఈ ఆలోచన ఉండాలి. ఉండి తీరాలి కూడా. కానీ ఆహార నియమాలను పట్టించుకోకుండా తిండి ధ్యాస ఎక్కువగా ఉండేవారు అనేక ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. ఇలా మనల్ని ఆహారానికి లొంగదీసేది మన మనసే! ‘ఆహార లౌల్యం’ అనేది ముదిరితే మానసిక వ్యాధిగానే పరిణమిస్తుంది.
మనోనిబ్బరంతో తిండి ధ్యాసను అదుపు చేసుకోగలిగితే ఈ ‘ఆహార లౌల్యం’ ఏర్పడకుండా ఉంటుంది. మనసులో ఈ వ్యాధి నుండి బయటపడాలనే దృఢ నిర్ణయం తీసుకోగలగటం ఒక్కటే అసలు పరిష్కారం. ఈ లక్షణాన్ని ముందుగానే ఎవరికి వారు గుర్తించి, దాన్ని వదిలించుకోవాలనుకోవటం ఉత్తమం. ఏదో ఒక మందు వేసుకుంటే అదే పోతుందనుకోకూడదు. ప్రతీదీ డబ్బుతోనే సాధ్యపడుతుందనుకోవటం సరికాదు. డబ్బుతో అనారోగ్యాన్ని సరిచేసుకోగలమేమో కానీ, ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆరోగ్య నియమాలే తోడ్పడతాయి.
అమితంగా తినే అలవాటుని ‘బింజి ఈటింగ్’ అంటారు. కొండొకచో ఇదొక వ్యాధిగా కూడా పరిణమించవచ్చు. ఎప్పుడైనా విందు భోజనానికి వెళ్లినప్పుడు మృష్టాన్న భోజనం లేదా షడ్రసోపేతమైన భోజనం వండి ఆదరంగా వడ్డిస్తే ఓ ముద్ద ఎక్కువగా తింటారు ఎవరైనా! అది రోజువారీ వ్యవహారం కాకూడదు. దానివలన బింజి ఈటింగ్ డిజార్డర్ తప్పక ఏర్పడుతుంది. చాలని భోజనాన్ని ముగించలేని స్థితిని అది కల్పిస్తుంది. ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనిపించటం ఈ వ్యాధిలో కనిపించే లక్షణం.
ఆహారాన్ని తీసుకోవటానికి సంబంధించిన వ్యాధుల్లో అనొరెగ్జియా నెర్వోజా, బులీమియా నెర్వోజా అనేవి నాడీ వ్యవస్థకు సంబంధించి కలిగే నరాల జబ్బులు. ఇందులో అనొరెగ్జియా అనేది ఆకలి, రుచి చచ్చిపోయి, అన్నం సహించని వ్యాధి కాగా బులీమియా అతి ఆకలికి సంబంధించిన వ్యాధి. బింజి ఈటింగ్ అనేది ఈ రెండింటికీ భిన్నమైన వ్యాధి. ఇది అతిగా తినాలనే కోరికని కలిగించే ఒక మానసిక వ్యాధి.
అమెరికాలో 6 మిలియన్ల మందికి ఈ అతిగా తినాలనుకునే వ్యాధి ఉన్నదని ఒక సర్వే చెప్తోంది. స్థూలకాయుల్లో మూడొంతుల మందిలో ఈ అతి తిండి లక్షణం కనిపిస్తుంది. బరువు తగ్గేందుకు చికిత్స తీసుకుంటూన్న వారిలో 30% మంది ఈ అలవాటును వదులుకోలేక పోతున్నారు. అతి తిండి వలన స్థూలకాయం, దాని అనుబంధ వ్యాధులైన షుగరు, బీపీ అనుసరించే ఉంటాయి.
అతిగా తినాలనే కోరిక ఉన్నవారిలో మానసిక సమస్యలు, ఆందోళన, దిగులు కూడా ఎక్కువగా ఉంటున్నాయని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. విషాద సంఘటనలు జరిగినప్పుడు కొందరిలో ఇది మొదలౌతున్నట్టు కూడా కనుగొన్నారు. మానసిక ఆందోళన పడే మనస్తత్వం ఉన్న వారిలో బింజి ఈటింగ్ డిజార్డర్ ఎక్కువగా కనిపిస్తుంది.
దీన్ని తగ్గించటానికి వైద్య సలహాలు, మందులూ, మానసిక వైద్యుని కౌన్సిలింగ్ మూడూ అవసరమే! వాటితోపాటు తాను మారాలనే గట్టి ఒట్టు కూడా రోగి పెట్టుకోగలగాలి. ఇక్కడ ఆకలిని కాదు ఆహార లౌల్యాన్ని జయించాలి!
బింజి ఈటింగ్ వ్యాధి రావటానికి కారణం ఇతమిత్థంగా ఇదీ అనేది ఇంతవరకూ కనుక్కోలేదు. మానసిక, శారీరక, పర్యావరణ కారణాలు మూడూ తోడై ఈ వ్యాధి వస్తున్నట్టు శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
తినటం మొదలుపెట్టాక ఇంక చాలు అనే తృప్తి కలగకపోవటం, చాలా కొద్దిగానే తిన్నట్టనిపించటం, చాలనితనం, ఏదో చెప్పలేని దిగులు, విచారం, ఆత్రుత, ఆందోళన, అవమానం జరిగిందనే భావన, తన మీద తనకే తక్కువచూపు లాంటి మానసిక లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ బింజి ఈటింగ్ డిజార్డర్‌ని సాంకేతికంగా కంపల్సివ్ ఓవర్ ఈటింగ్ అని పిలుస్తారు. ఆపుకోలేక పోవటం, నిగ్రహం కోల్పోవటం, ఎవరైనా ఏమనుకుంటారోననే లజ్జ, సిగ్గు, బిడియాలు లేకపోవటం లాంటి తీవ్ర లక్షణాలు కూడా కలగవచ్చు. భోజనానికి కూర్చుంటే కనీసం 2 గంటలపాటు తినటం, సహజంగా తినవలసిన దానికన్నా ఎక్కువగా తినటం, ఆకలి లేకపోయినా ఏదో ఒకటి తినాలనిపించటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడటం మంచిది.
రోజూ ఆల్కహాలు తీసుకోకుండా ఉండలేకపోతే అది ఎడిక్షన్ అవుతుంది. అలాగే ధూమపానం, గుట్కాలు వగైరా కూడా! రోజూ అన్నం తింటాం. దానర్థం అన్నానికి మనం ఎడిక్ట్ అయ్యాం అని కాదు కదా! ఆరోగ్య దాయకమైన వాటిని ఆరోగ్యదాయకంగా నిత్యం సేవించటాన్ని ఎడిక్షన్ అనకూడదు. రోజూ భోజనం చేయటం ఎడిక్షన్ కాదు. కానీ బింజి ఈటింగ్ వ్యాధిలో అన్నం తినటం అనేది ఒక ఎడిక్షన్‌గా మారుతుంది. మానసిక ఉద్వేగాల నుండి బయటపడటానికి తిండి మీదకు ధ్యాస మళ్లించటం మనసుకు ఒక ప్రత్యామ్నాయం. ఇదే చేయకపోతే మానసికమైన టెన్షన్‌కు శారీరకంగా ఏదైనా ప్రమాదం జరగవచ్చు కూడా! దాన్ని తప్పించటానికి మనసు దూబరదిండిగా ఆ వ్యక్తిని మారుస్తుంది. ప్రమాదకరమైన స్ట్రెస్‌లోంచి రోగిని బయటకు తీసుకురాలేకపోతే అన్నానికి ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఆయుర్వేద శాస్త్రంలో ఈ మానసిక వ్యాధికి కొన్ని చికిత్సా సూత్రాలు చెప్పారు. వాటిలో ఎవరికి వారు చేసుకో గలిగినవి కొన్ని ఉన్నాయి.
బ్రాహ్మీ ఆకులు, జటామాంసి, మాల్కంగిణీ గింజలు, వస వీటిని సమాన మోతాదులో తీసుకుని మెత్తగా దంచిన పొడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం టీ లాగా కాచుకుని తాగుతూ ఉంటే అతి తిండి ధ్యాస తగ్గుతుంది. ఈ ద్రవ్యాలు మూలికలమ్మే షాపుల్లో దొరికేవే! ప్రయత్నించండి. స్థూలకాయం, షుగరు వ్యాధి, బీపీ వ్యాధులున్న వారు కూడా దీన్ని ‘హెర్బల్ టీ’ లాగా కాచుకు తాగవచ్చు.
ఉదయం అల్పాహారం కోసం ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా, బజ్జీ, పునుగులు మానేసి ఉదయానే్న మజ్జిగ అన్నం లేదా పెరుగన్నం తినండి. అందులో రకరకాల కూరముక్కలు కలిపి తింటే మరీ మంచిది.
మంచి నీళ్లకు బదులుగా మజ్జిగ మీద తేరిన నీటిని తాగండి. జీర్ణాశయ వ్యవస్థను సరిచేస్తాయి.
మానసిక వత్తిడుల నుండి బయటపడండి. మనోనిబ్బరాన్ని తెచ్చిపెట్టుకోవాలే గాని, దానికదే కలగదు.
ఎక్కువ తినవలసి వస్తున్నప్పుడు అందులో నూనె పదార్థాలు, పాలు, మీగడ, పెరుగు లాంటివి లేకుండా జాగ్రత్త పడండి. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటే ఎక్కువగా తిన్నా పెద్దగా చెడు జరగదు.
శరీరంలో వాతం, వేడి ఎక్కువగా ఉండటం వలన కూడా ఈ ఆహార లౌల్యం ఏర్పడుతుంది. పులుపు ఈ వ్యాధిలో ఆగర్భ శత్రువు. దుంపకూరలు, వాతాన్ని కలిగించే పదార్థాలు తినకుండా ఉంటే దాని ప్రభావంతో ఆహార లౌల్యం కూడా తగ్గుతుంది.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com