Others

వినియోగదారుల హక్కులకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వినియోగదారుల దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 1962 మార్చి 14వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించడం జరిగింది. ఆ సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనె్నడీ ప్రసంగిస్తూ ‘వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇచ్చినట్లయితే, ధరలు మరీ ప్రియంగా ఉంటే, ఔషధాలు సురక్షితంగా లేకపోతే లేదా గుణహీనంగా ఉంటే, వినియోగదారు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలుకు ఎంపిక చేసుకొంటే, అటువంటప్పుడు డాలర్ తన విలువను కోల్పోయినట్లవుతుంది. వినియోగదారు ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. దేశ ప్రయోజనం దెబ్బతింటుంది కూడా’ అన్నారు. ఆ రోజున యుఎస్ కాంగ్రెస్‌లో కెనె్నడీ చేసిన ప్రసంగం యొక్క ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణనలోకి తీసుకొన్న కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ (సిఐ) 1983 నుంచి ప్రతి సంవత్సరం మార్చి నెలలో 15వ తేదీని ‘ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినం’గా పాటించాలంటూ 1982లో ఒక నిర్ణయం తీసుకుంది. ప్రగతిశీల శాసనాలను ప్రవేశపెట్టడంలో భారతదేశం ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఓటు వేసే హక్కును మహిళలకు ఇచ్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. గాంధీగారు ‘మన వాకిట్లోకి విచ్చేసే వినియోగదారు ఒక ముఖ్యమైన సందర్శకుడు. అతడు మన మీద ఆధారపడి లేడు. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. మన పనిలో అతడు ఒక అంతరాయం కాదు. మన పని యొక్క ఉద్దేశమే అతడు. ఆయనకు సేవ చేయడం ద్వారా మనం అతడికి ఏదో మేలు చేస్తున్నట్లు కాదు, తనకు సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించడం ద్వారా అతడు మనకు మేలు చేస్తున్నాడు’ అని చెప్పారు.
వినియోగదారుకున్న హక్కులలో ఆరోగ్యదాయకమైన ఆహారం ఒక హక్కుగా 2015 సంవత్సరంలో ప్రపంచ వినియోగదారు హక్కుల దినం (డబ్ల్యుసిఆర్‌డి) సందర్భంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో వారికి తోడ్పడాలని కన్స్యూమర్స్ ఇంటర్నేషనల్ నిర్ణయించింది. వినియోగదారులందరూ కేవలం ఆహార హక్కును మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందే హక్కును కూడా కలిగి వున్నారు. అన్ని దేశాలు కట్టుబడి ఉండగల ఏదైనా ఒక ఒడంబడిక అనేది వినియోగదారులందరికీ ఆరోగ్యవంతమైన ఆహారం సులువుగా లభించే ఏర్పాటు చేయగలగడంతో పాటు మరింత సమానత్వంతో కూడిన, నిలకడ కలిగిన ఆహార వ్యవస్థకు పూచీ పడగలుగుతుంది. ఆహారంతో ముడిపడి ఉండే వ్యాధులు.. స్థూలకాయం, మధుమేహం, గుండెజబ్బు, ఇంకా కొన్ని కేన్సర్‌లు.. ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంక్షోభాన్ని సూచించేవే. పొగ తాగడం వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావంకన్నా సరైన రీతిలో లేని ఆహారాన్ని తీసుకోవడమనేది ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావమే అధికం. అనారోగ్యానికి దారితీసే, తక్కువ ధరలకు దొరికే ఆహార పదార్థాలు, బడా అంతర్జాతీయ ఆహార కంపెనీల మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం.. ఇవి అన్నీ కలిసి ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని ఎంచుకోవడాన్ని కష్టతరంగా మార్చివేస్తున్నాయి.
వినియోగదారు హక్కులు
వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. వ్యాపారంలోని అనుచిత పద్ధతుల బారిన పడకుండా వినియోగదారును కాపాడవలసి ఉంటుంది. ఈ హక్కులను గురించి వినియోగదారులు తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. వినియోగదారు హక్కులను రక్షించేందుకు భారతదేశంలో బలమైన, స్పష్టమైన చట్టాలు ఉన్నా, దేశంలోని వినియోగదారుల వాస్తవ దురవస్థ అత్యంత నిరుత్సాహకరంగా ఉంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి అమలవుతున్న వివిధ చట్టాలలో 1986 సంవత్సరంలో వచ్చిన వినియోగదారు రక్షణ చట్టం అత్యంత ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ప్రకారం, ప్రతి ఒక్కరు.. వ్యక్తులు, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం, కంపెనీ.. వస్తువులను, సేవలను కొనుగోలు చేసేందుకు తమ వినియోగదారు హక్కులను ఉపయోగించే హక్కును కలిగి వున్నారు. ఒక వినియోగదారుగా తన వౌలిక హక్కులను గురించి, న్యాయస్థానాలను గురించి, హక్కుల అతిక్రమణ తదుపరి అమలు కావలసిన విధానాలను గురించి కూడా తెలుసుకోవలసి ఉంది.
వినియోగదారు రక్షణ చట్టం
1986 దేశంలోని వినియోగదారు రక్షణ/ వినియోగదారు ఉద్యమంలో అత్యంత ముఖ్యమనదగిన మైలురాళ్లలో ఒకటి, వినియోగదారు రక్షణ చట్టం. 1986కు శాసన రూపాన్ని ఇవ్వడం, వినియోగదారుల కోసం మూడు అంచెలతో కూడిన క్యాసి ‘జ్యుడీషియల్ కన్స్యూమర్ డిస్‌ప్యూట్ రిడ్రెసల్ మెషినరీ’ని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు హక్కులను ఉత్తమమైన రీతిలో కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని కోరే హక్కు 1986లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ (సిఒపిఆర్‌ఎ) ఆమోదం పొందేందుకు కారణమైంది. దీనిని వినియోగదారుల హక్కుల పత్రం (మాగ్నా కార్టా)గా నిర్వచించడం జరిగింది. అయితే ఇది ఈ హక్కులలోని ఆరు హక్కులను మాత్రమే గుర్తించింది. అవి 1.్భద్రత, 2.సమాచారం, 3.ఇష్టం, 4.ప్రాతినిధ్యం 5.సరిదిద్దడం మరియు 6.వినియోగదారు చైతన్యం. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం కోసమే 90-150 రోజుల పరిమిత వ్యవధిలో న్యాయ నిర్ణయం చేయడానికి/ మధ్యవర్తిత్వం వహించడానికి క్యాసి ‘జ్యుడీషియల్ కోర్టుల వ్యవస్థ’కు వీలు కల్పించి విప్లవాత్మక మనదగిన న్యాయ సంబంధ సంస్కరణలను తీసుకురావడంలో సిఒపిఆర్‌ఎ సఫలమైంది. వౌలిక అవసరాలకు సంబంధించిన హక్కులను, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సిఒపిఆర్‌ఎ ద్వారా ఆవిష్కరించడం కుదరలేదు. ఎందుకంటే, ఇవి పేదల మరియు అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు కావడం ఒక కారణం కాగా, ధర చెల్లించితే మార్కెట్‌లో దొరికే సరుకులు, సేవలకు సంబంధించిన అంశం కాకపోవడం మరొక కారణం అయితే ఇవి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా ఆందోళనలకు వెనె్నముకగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం 1986 సంవత్సర వినియోగదారు రక్షణ చట్టానికి శాసన రూపం కల్పించినప్పటికీ, ఆ చట్టం యొక్క ముఖ్యోద్దేశమైన తక్కువ ఖర్చులో, సులభమైన రీతిలో, సత్వర న్యాయాన్ని అందించడం అనే పరమార్థం ఇప్పటికీ సరిగా నెరవేరలేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి వినియోగదారు రక్షణ చట్టానికి సవరణను ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వినియోగదారుని అవగాహనా కార్యక్రమం
ఒక సుశిక్షితుడైన వినియోగదారుడు ఒక సాధికారిత గల వినియోగదారుడు. ఒక శిక్షితుడైన వినియోగదారుడు దోపిడి నుండి తనను మాత్రమే కాకుండా ప్రేరణాత్మక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. సేవల రంగాలలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని కలిగి ఉంటాడు. వినియోగదారుని జాగృతపరచడం ముఖ్యమైనదిగా ప్రభుత్వం గుర్తించి వినియోగదారుని విద్య, వినియోగదారుని రక్షణ, వినియోగదారుని అవగాహనలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. భారతదేశం వినియోగదారుల రక్షణ కోసం ప్రగతిశీల చట్టాన్ని ప్రవేశపెడుతూ ముందంజలో ఉంది. ‘జాగో గ్రాహక్ జాగో’ వినియోగదారుని విద్య మరియు అవగాహన వైపు ఒక ముందడుగు. 11వ పంచవర్ష ప్రణాళికలో వినియోగదారుని అవగాహనను పెంచే అవసరాన్ని నొక్కి చెబుతూ ప్రభుత్వం నిధులను వెచ్చించి సామాన్యుడికి ఒక వినియోగదారునిగా తన హక్కులను తెలియజేయడానికి ప్రయత్నించడం జరిగింది.
జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్
వినియోగదారుల ఫిర్యాదులకు స్పందించడానికి ఢిల్లీ హెల్ప్‌లైన్‌ను టోల్ ఫ్రీ 1800 11 4000ను వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రారంభించింది. అన్ని పని దినాలలో (సోమవారం నుండి శనివారం వరకు) ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు టోల్ ఫ్రీ నెంబర్ సౌకర్యాన్ని వినియోగదారులు వినియోగించుకోవచ్చు.

- పి.జె. సుధాకర్