AADIVAVRAM - Others

నిద్రకు ఉపక్రమించే ముందు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియకుండానే మన రోజులు గడిచిపోతుంటాయి.
చేయాల్సిన పనులు మిగిలిపోతూనే ఉంటాయి.
ఎందుకు ఇలా జరుగుతుంది.
మనం ప్రణాళికాబద్ధంగా లేకపోవడం ఒక కారణం.
రెండవ కారణం ఆ రోజు ఎలా గడిచిందో తిరిగి పరిశీలించి చూడకపోవడం.
చేయాల్సిన పనులని రాసుకొని లేదా సెల్‌ఫోన్‌లో టైప్ చేసుకొని వుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే విధంగా మనం పడుకునే ముందు మనకు మనం ఆ రోజు ఏం చేశామో ఒక్కసారి ప్రశ్నించుకోవడం అత్యంత అవసరం. అలా ప్రశ్నించుకున్నప్పుడు చేయలేని పనులు మరో రోజు చేయడానికి వీలవుతుంది.
అదే విధంగా మనం మరి కొన్ని ప్రశ్నలు మనకి మనం వేసుకోవాల్సిన అవసరం మరెంతో ఉంది.
ఆ ప్రశ్నలు-
మనకున్న శక్తి మేరకు ఆ రోజు పని చేశామా లేదా?
ఎవరికైనా సహాయం చేశామా?
ఎవరినైనా నవ్వుతూ పలకరించామా?
కనీసం మనకి మనం నవ్వుకున్నామా?
ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామా?
ఉత్సాహంగా పని చేశామా?
ఇతరుల పట్ల దయతో వున్నామా?
మన ఉత్సాహం ఇతరులకి అంటువ్యాధిలా పరిణమించేలా ఏమైనా ప్రయత్నం చేశామా?
తెల్లవారి ప్రణాళికాబద్ధంగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామా?
ఉదయం బయలుదేరడానికి అవసరమైన దుస్తులు, వస్తువులు అన్ని సమకూర్చుకున్నామా?
అన్నిటికన్నా ముఖ్యమైంది-
ఆ రోజు బతికి వున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశామా?
ఈ ప్రశ్నలు వేసుకొని జవాబు చెప్పుకుంటే మర్నాడు మన పనులు సక్రమంగా నిర్వర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది.
ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు మనం చేయాల్సిన పని ఇదే!
*

జింబో 94404 83001