Others

భారత్‌లో జిబిఎస్ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భంలో ఉండగాను, పుట్టిన వెంటనే శిశువుల మరణానికి కారణమయ్యే గ్రూప్ బి స్ట్రెప్టోకొక్కస్ బ్యాక్టీరియా బాధిత గర్భిణులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఇది ఆందోళన కలిగించే పరిణామంగా తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలో ఏటా దాదాపు 15 లక్షలమంది ఇలా జిబిఎస్ బ్యాక్టీరియా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఇది గర్భిణుల్లో వ్యాపిస్తుంది. దీనివల్ల పిండదశలో ఉన్న పిల్లలు, నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి ప్రమాదకరమైన జిబిఎస్ బ్యాక్టీరియాతో కూడిన గర్భిణులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. తొలి ఐదు దేశాల్లో జిబిఎస్ బ్యాక్టీరియాతో కూడిన గర్భిణుల సంఖ్య ఇండియాలో 2,466,500, చైనాలో 1,934,900, నైజిరియాలో 1,060,00, అమెరికాలో 942,800గా ఉంది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో పరిశోధనలు నిర్వహించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21.7 మిలియన్లమంది జిబిఎస్ బాధిత గర్భిణులను వారు పరిశీలించారు. వీరిలో చాలామందికి గ్రూప్ బి స్ట్రెప్ బ్యాకీర్టియా ఉన్నట్లు తెలియదు. మరికొందరు తగిన చికిత్స తీసుకోనూ లేదు. అయితే ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. గర్భిణులకు ఇచ్చే ఒక వ్యాక్సిన్ కారణంగా జిబిఎస్ ప్రభావం లేకుండా చేయవచ్చని తొలిసారిగా ఈ పరిశోధనలో తేలింది. దాదాపు 2 లక్షల 31 వేల కేసుల్లో ఇది తేలింది. ప్రపంచంలో పేరెన్నికగన్న శాస్తవ్రేత్తలలో వందమంది చేసిన పరిశోధనలు, వారు ప్రచురించిన 11 సిద్ధాంత పత్రాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఏటా 410,000 జిబిఎస్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా కనీసం జనన దశలోను, నవజాత శిశువులు జిబిఎస్ బ్యాక్టీరియా కారణంగా ఏటా 147,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువుగా సంభవిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి కేసుల అంచనా 54 శాతంగాను, నవజాత శిశువులు, జననదశలో పిల్లల మరణాలు 65 శాతంగాను ఉంది. 2015లో తొలిసారిగా జిబిఎస్‌పై పరిశోధనలు, గణాంకాల సేకరణ విస్తృతంగా, సాధికారికంగా జరిగాయి. ప్రపంచంలోని గర్భిణుల్లో 16 శాతం మందికి జిబిఎస్ బ్యాక్టీరియా సోకుతోందని, తూర్పు ఆసియాలో 18 శాతంగా ఉంటే కరేబియన్ దేశాల్లో 35 శాతంగా ఉందని ఆ పరిశోధనల్లో తేలింది. 195 దేశాలలో 21.7 మిలియన్ల మంది నుంచి వివరాలను ఈ పరిశోధన కోసం సేకరించారు. సంపన్నవర్గాల వారు ఖరీదైన యాంటిబయాటిక్ ఔషధాలను వాడగలగడం వల్ల ఆయా వర్గాల్లో జిబిఎస్ మరణాలు తక్కువగా ఉంటున్నాయి. అలా తగ్గుతున్న జిబిఎస్ మరణాల సంఖ్య దాదాపు 29 వేలుగా ఉంది. ఈ సందర్భంగా గర్భిణులకు ఇచ్చే జిబిఎస్ వ్యాక్సిన్ వల్ల దాదాపు 80 శాతం మేరకు ఆ ప్రమాదకారక బ్యాక్టీరియా నుంచి రక్షణ లభిస్తుందని ఈ పరిశోధనల్లో తేలింది. దాదాపు 90 శాతం మంది మహిళలు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దాదాపు 231,000 మరణాలను నివారించగలుగుతారని అంచనా.

-కృష్ణతేజ