Others

నాకు నచ్చిన పాట ( ఒకటి ఒకటి ఒకటి..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్య, జానకి జంటగా 1959లో విడుదలైన చిత్రం ‘ఆలుమగలు’. దీనికి సంగీత దర్శకులు కెవి మహదేవన్. ఆచార్య ఆత్రేయ కలంనుండి జాలువారిన పదిసూత్రాల పాట సరళమైన పదజాలంతో, సుశీల గళ మాధుర్యంతో అందరూ మెచ్చే పాటగా ప్రసిద్ధిపొందింది. ‘ఒకటి ఒకటి ఒకటి మానవులందరు ఒకటి’ అనే గీతం ప్రబోధ గీతంలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ నీతినంతా పది వాక్యాల్లో, పాటలో, ఇమడ్చగలగడం ఆత్రేయకే చెల్లింది. పాట విషయానికి వస్తే.. ఒకటి ఒకటి మానవులందరు ఒకటి/ మంచి వాళ్ళనీ, చెడ్డవాళ్ళనీ మనలో జాతులు రెండు/ మూడు మూడు మూడు మూఢుల స్నేహం వీడు/ నాలుగు నాలుగు నాలుగు నలుగురి సుఖము చూడు/ ఐదువేళ్ళవలె ఐకమత్యముగ అందరు ఉంటే అదియే మేలు.. అంటూ/ ఆరునూరుగా నూరు ఆరుగా అయినా కూడా అబద్ధమాడకు/ ఏడు ఏడు ఏడు, ఇతరుల చూచి ఏడవకు అని చెప్తూ, ఎనిమిది వరకూ నిద్రపోవకు, తొమ్మిదిపైనా మేల్కొని ఉండకు/ పదిమందీ నిను మంచివాడనీ పొగిడినంతనే పొంగిపోవకు అని ముగిసే ఈ చిన్న పాటలో అంతులేని అర్థం ఉంది. అభివృద్ధిని కాంక్షించి జీవితంలో మంచి బాటను ఎంచుకునేందుకు భావితరాలకు ఈ పాట తోడ్పడుతుంది. పాఠశాలలో పిల్లలకు బోధనాంశంగా ఇందులో సూత్రాలు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రముఖ గాయని సుశీల ఈ పాటకు ప్రాణం పోసారు.

----

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

ప ప్రతి మంగళవారం వెలువడే వెనె్నలకు రచనలు శుక్రవారంలోపు చేరాల్సి వుంటుంది.
ప రచనల్లో కొత్తదనం ముఖ్యం
ప అరిగిపోయిన పాత సినిమా కబుర్లు, శ్రద్ధాంజలి వ్యాసాలు, సినిమాలపై హితబోధల కన్నా, చదివించే కొత్త తరహా వ్యాసాలకు ప్రాధాన్యత వుంటుంది.
ప కొత్త సినిమాలపై సమీక్షలు రాయాలనుకున్న ఔత్సాహికులు ముందుగా ఒకటి రెండు సమీక్షలు పరిశీలన కోసం రాసి పంపితే, పరిశీలించగలం.
ప తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే కొత్తసినిమాలను పరిశీలించే ఆసక్తి వున్నవారు, సంబంధిత వ్యాసాలు పంపితే అవీ ప్రచురణార్హమే.
ప కొత్త హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వ్యాసాలకు కూడా స్వాగతం.
ప ఇంతవరకు ఎక్కడా ప్రచురితం కాని, అపురూప చిత్రాలువుంటే పంపొచ్చు.
ప రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో vennela@deccanmail.comకు మెయల్ చేయగలరు.
ప ప్రచురించిన (మీ వ్యూస్ మినహా) ప్రతి వ్యాసానికి పారితోషికం వుంటుంది.

మా చిరునామా :
ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03
నాకు నచ్చిన సినిమా

-యంవి రమణకుమారి, హైదరాబాద్