Others

బాలల్లారా.. రారండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రారండోయ్ బాలల్లారా! రారండి!
బడి పిల్లల్లారా! రారండీ!
భారతీయ చిన్నారుల పండుగలు రెండేరెండు!
దీపావళి పర్వదినం ఒకటి
‘చాచాజీ’ జన్మదినం మరొకటి,
అదే అదే బాలల దినోత్సవం!
చాచాజీకి చిన్నారులంటే ప్రియం
చాచాజీ! మీరంటే మాకెంతోప్రియం!
అదిగదిగో, అల్లదిగో ఎఱ్ఱగులాబీ
చాచాజీ షేర్వాణీనలంకరించిన గులాబీ
భారత బృందావనిలో గుబాళించే చిన్నారి గులాబీలు!
అందుకె, మరి అందుకె నేటి బాలల పండుగ
మనమంతా చాచాజీని స్మరించుకుందాం
మన చాచాజీ, మన నెహ్రూజీ
నవభారత నిర్మాత.. పంచవర్ష ప్రణాళికా దాత
బహుళార్థ సాధక ఆనకట్టల విధాత
సమసమాజ స్ఫూర్తిప్రదాత! శాంతిదూత
చాచాజీ రండు.. భారతావనిని సృజించ రండు
ఊర్థ్వలోకాల నుంచి చూస్తున్నావా చాచాజీ!
ఎటు పోతోంది భారతం?
ఎటుచూసినా కలహాలు, హింసాకాండ, లంచాలు
పదవీ వ్యామోహం, మారణహోమం
చిన్నారులపై పైశాచిక అఘాయిత్యాలు
పైనుంచి వినలేదా చిన్నారి బాలికల ఆక్రందనలు?!
చాచాజీ రండు.. చిన్నారులను కాపాడగ...
బాలల్లారా రారండి.. మనం చిన్నారులమని తప్పుకోవద్దు
భావి భారత పౌరులం, వనరులం కదా మనం
బాల కార్మికుల హక్కుల రక్షకులం కావాలి మనం
రారండోయ్! లంచగొండ్లు, ప్రజాధన భక్షకులని శిక్షిద్దాం
మనమే రేపటి దేశోద్ధారకులం!
భరతమాత ముద్దుబిడ్డలం

-పరిమి శ్యామలా రాధాకృష్ణ