AADIVAVRAM - Others

దేవుడికన్నా గొప్పవాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక వ్యక్తి గొప్ప రాజయిన ఖాన్ సాహెబ్ దగ్గరకు వెళ్లి ‘ఖాన్ సాహెబ్! నేను ఒక పవిత్రమయిన వ్యక్తిని సందర్శించాలనుకుంటున్నాను. మీకు తెలిసి అలాంటి గొప్ప వ్యక్తి వుంటే సెలవియ్యండి’ అన్నాడు.
ఖాన్ సాహెబ్ ‘అవునా? అయితే గొప్ప సూఫీ అయిన రూమీ దగ్గరకు వెళ్లు. అతను దేవుడికంటే గొప్పవాడు’ అన్నాడు.
ఆ మాటల్తో ఆ మనిషి ఖంగు తిన్నాడు. అంతేకాదు. అతనే కాకుండా అక్కడున్న ఇతర జనాలు కూడా అవాక్కయ్యారు.
ఒక మనిషి ఏమిటి? దేవుడికన్నా గొప్పవాడు కావడమేమిటి? ఎంత అపచారం! దేవుడిపట్ల అమర్యాదగా ప్రవర్తించడమంటే ఇదే కదా! అట్లా తనకు తను గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి అహంకారాన్ని మనం అణచివేయాలి. వెళదాం పదండి’ అన్నారు.
అందరూ కలిసి రూమీ దగ్గరకు వెళ్లారు.
రూమీని చూసి కోపంగా ‘నీకెంత పొగరు. దేవుడికన్నా గొప్పవాడివని నువ్వు అందరితో చెప్పుకుంటున్నావా?’ అని నిలదీశారు.
రూమీ ‘అయ్యో! ఎంత మాట! నేను సాధారణమయిన మనిషిని. నేను ఎంతో అల్పుణ్ణి. దేవుడి ముందు అణువు లాంటి వాడిని నేను దేవుడికన్నా గొప్పవాడినని చెప్పుకుంటానా?’ అన్నాడు ఎంతో వినయంగా.
రూమీ ప్రవర్తనకు జనం విస్తుపోయారు.
అందరూ తిరిగి ఖాన్ సాహెబ్ దగ్గరకి వచ్చి ‘మీరేమో దేవుడికన్నా గొప్పవాడయిన రూమీ దగ్గరకు వెళ్లమన్నారు. అతనేమో నేనెంత? దేవుడి ముందు నేను అల్పుణ్ణి అంటున్నాడు’ అన్నారు.
ఖాన్ సాహెబ్ ‘ఏంటి? అతను అలా అన్నాడా? అయినా అతను పిచ్చివాడు. అతని గురించి అతనికేం తెలుసు. అతని గురించి నాకు తెలుసు’ అన్నాడు.
జనం అయోమయంలో పడ్డారు.

- సౌభాగ్య, 9848157909