Others

వ్యాయామంతో ఒత్తిడి దూరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిమ్‌లో చేసే వ్యాయామం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని నిపుణుల అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. వ్యాయామం చేశామంటే చేశాం అనే విధంగా కాకుండా జిమ్‌కు వెళ్లి చేస్తే శారీరకంగా, మానసికంగా మేలు జరుగుతుందని ఈ అధ్యయనాల ఫలితాలు తెలియజేస్తున్నాయి. వ్యక్తిగతంగా ఎవరికివారే చేయటం వల్ల ఒత్తిడి స్థాయిలో గణనీయమైన మార్పులు, జీవన నాణ్యత మెరుగైనట్లు పరిశోధనల్లో వెల్లడైంది. న్యూఇంగ్లాండ్ కాలేజీ ఆఫ్ ఒస్టియోపతిక్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన బృందం జిమ్ వ్యాయామంపై పరిశోధనలు చేసింది. దాదాపు 69మంది వైద్య విద్యార్థులు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు. అధిక ఒత్తిడికి గురవుతున్న కొంతమందిని ఎంపికచేసుకుని అధ్యయనం చేశారు. వ్యాయామం చేయటం వల్ల వారి శారీరక, మానసిక, భావోద్వేగాల్లో వచ్చిన మార్పులు ఏవిదంగా ఉన్నాయో ఈ బృందం అధ్యయనం చేసింది. పనె్నండు వారాల పాటు వారు చేసిన అధ్యయనంలో ఒత్తిడికి గురవుతున్న బాధితుల వ్యాయామ పద్ధతులను పరిశీలించారు. ఈ వ్యాయామం నుంచి నడక, బైకింగ్‌లను తొలగించారు. సామూహికంగా వ్యాయామం చస్తే ఫలితం ఎలా ఉంటుంది? ఒక్కరుగా చేస్తే ఎలాంటి ఫలితం వచ్చిందో కూడా పరిశీలించారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి వ్యాయామం చేసేవారిని గమనిస్తూ ఓ సర్వేను సైతం చేశారు. పనె్నండు వారాల తరువాత పరిశీలిస్తే..మానసిక ఒత్తిడి 12.6శాతం, శారీరక ఒత్తిడి 24.8 శాతం, భావోద్వేగాల ఒత్తిడి 26శాతం ఉన్నట్లు వెల్లడైంది. మొత్తంగా జిమ్‌లో చేసే వ్యాయామం వల్ల ఒత్తిడి 26.2శాతం తగ్గినట్లు వెల్లడైంది.