Others

ఆధ్యాత్మిక పర్యాటకానికి ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ధ్యాత్మిక టూరిజం ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద ఆదాయ వనరుగా మారింది. అటు భక్తులు, పర్యాటకులనూ ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక రంగ ప్రముఖుల సూచనలతో సరికొత్త హంగులు, ఆర్భాటాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తెలుగునాట గోదావరి, కృష్ణవంటి పవిత్ర నదీతీరాలకు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పర్యాటక శోభ మరింత అందాన్నిస్తోంది. విద్యుదలంకరణలు, దేవుళ్ల కటౌట్‌లు నదీతీరాల్లో దర్శనమిస్తున్నాయి. పుష్కరాల సమయంలో మాత్రమే నిర్వహించే హారతి కార్యక్రమాలు ఇప్పుడు నిత్య సంప్రదాయం మారింది. నదీమతల్లులకు ఇచ్చే హారతి కార్యక్రమాలు, మంత్రగోష్ఠి చూడడానికి, వినడానికి ఎంతో బాగుంటాయి. ఆముష్కింగా జనసామాన్యాన్ని తరింపచేసే గోదావరి, కృష్ణవంటి నదులు పవిత్రభావం, సందర్శన కుతూహలం, యాత్రలపట్ల ఆసక్తి, సత్కాలక్షేపంపట్ల అనురక్తిని కలిగిస్తున్నాయి. ఈ కొత్త ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రజల ఆదాయం పెరిగింది. యాత్రలకు ఇంటిల్లిపాదీ సిద్ధమవుతున్నారు. ప్రోత్సాహమూ, సౌకర్యాలు పెరిగాయి. ఆలయాలలో, మైదానాలలో కోటి దీపారాధన ఇప్పుడు సరికొత్త సంప్రదాయంగా మారింది. ప్రసార మాధ్యమాలలో వీటికి ప్రచారం కూడా లభిస్తోంది. ఇవన్నీ ప్రజలను ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లేలా చేస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక రంగానికి దూరంగా ఉండేవారు. ఉత్సవాలు, వేడుకలు, ప్రత్యేక సందర్భాలలో శాంతిభద్రతలు, రక్షణ ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టేది. ఇప్పుడు వారి దారి మారింది. నాయకులు గుళ్లుగోపురాలకు వస్తున్నారు. ఉత్సవాలలో పాల్గొంటున్నారు. దీంతో ఆధ్యాత్మిక రంగానికి ప్రాధాన్యం పెరిగింది. అది స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధికి సహకరిస్తోంది. నెమ్మదిగా ప్రైవేటు, అనధికారిక వ్యక్తులు దీనిని ఆధారంగా చేసుకుని ఎదగడం మొదలైంది. తెలుగునాట ఆధ్యాత్మిక టూరిజం ప్రాధాన్యతను లోగడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు గుర్తించారు. విదేశ టూరిస్టులకోసం మద్యపానంపై నిషేధాన్ని సడలించడం అప్పుడే జరిగింది. ఆ తరువాత ప్రభుత్వాలు విశేష ప్రాచుర్యం కల్పించి ఆధ్యాత్మిక సందర్భాలను ఘనంగా నిర్వహించడం మొదలైంది. గోదావరి పుష్కరాలకు అందుకే జన సందోహం వెల్లువెత్తింది. ఆ సందర్భంలో జరిగిన తొక్కిసలాట పలువురి ప్రాణాలను బలి తీసుకుంది.
నదీసంగమ ప్రాంతాన్ని పవిత్రస్థలంగా మనవాళ్లు భావిస్తారు. కృష్ణాగోదావరి నదుల అనుసంధానంతో వాటి సంగమస్థలం విశేష ఆధ్యాత్మిక ప్రాంతంగా మారిపోయింది. నదులు సముద్రంలో కలిసే సంగమ ప్రాంతమూ అలాంటిదే. ఇవి యాత్రికులు, పర్యాటకులకు ఆరాధ్య కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి తీరానికి భవిష్యత్తులో అద్భుత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో అమరావతి నిర్మాణం పూర్తయితే కృష్ణాతీరానికి అదనపు శోభ వస్తుంది. ఇది పర్యాటకానికి ఆశాకిరణం. ఇక పోలవరం పూర్తయితే పాపికొండల రమణీయ దృశ్యాలు కనుమరుగవుతాయన్న ప్రచారంతో ప్రజలు వాటి అందాలను చూడటానికి ఇప్పుడు తహతహలాడుతున్నారు. రాజమండ్రి నుంచి నిత్యం పాపికొండల యాత్ర పెద్ద పర్యాటక ఆదాయవనరుగా మారింది. లాంచీయాత్రలు పెరిగాయి. అయితే నదీ సంగమ ప్రాంతాల్లో, తీరాల్లో హారతులు, ఇతర ఉత్సవాల వేళ జనం రద్దీ పెరిగినపుడు ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పవిత్ర కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు కూడా ముందుచూపుతో వ్యవహరించి భద్రతను, భక్తిని లంకె వేసుకుని అడుగు ముందుకువేయాలి. అప్పుడే లక్ష్యం సిద్ధిస్తుంది.

-జయసూర్య సెల్: 94406 64610