Others

నృత్యం ఓ తత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలు పుక్కిట పురాణాలు అని నేటి యువతరం కొట్టిపారేస్తోంది. ఋషులు మనకందించిన అపార విజ్ఞానాన్ని, జీవన మార్గాలను తెలుసుకోలేకపోతున్నాం. త్యాగ పురుషులు ఈ జ్ఞాన సంపదను కళల ద్వారా తెలియజేస్తున్నారు నాట్యాచారిణి సురభి గాయత్రి. ఇతిహాసాలకు సంబంధించిన నృత్యాంశాలను తయారుచేసి వాటికి నృత్యాభినయాన్ని రూపొందించి శిక్షణ ఇస్తున్నారు. ఇంఋకోసం ఆమె శ్రీ గురుకృప కళాక్షేత్రాన్ని నెలకొల్పారు. వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ.. కూచిపూడికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తున్నారు. ఇతిహాసాల విశిష్టతను చాటుతున్నారు.

మహిషాసురుడు అనే రాక్షసుడిని ఆదిపరాశక్తి చాముండేశ్వరి అవతారంలో వధించింది అని పురాణం చెప్తే ఎంతమంది కూర్చుని వింటారో ఊహించుకోండి. ఆ కథను మహిషాసురమర్థని అనే నృత్యరూపకం ద్వారా అభినయించి ప్రదర్శిస్తే హర్షధ్వానాలతో వందలాది ప్రేక్షకులు చూస్తారు. అందుకే యువతను కళల ద్వారా మేల్కొలిపి ప్రోత్సహించి వేదాంత ఇతిహాస అంశాల ద్వారా జ్ఞానోదయం కలిగించి వారిలో ప్రేరణ కలిగించాలనే సంకల్పంతో శ్రీ గురుకృప కళాక్షేత్రాన్ని 1999 సం.లో అక్టోబర్ 19న స్థాపించారు.
108 మంది యువ కళాకారులతో నృత్యార్చన చేసి రికార్డు
ఈ కళాక్షేత్రంలో ఎంతోమంది కళాకారులుగా తీర్చిదిద్దబడ్డారు. బాలశ్రీ, బాలరత్న పురస్కారాలను సైతం అందుకున్న శిష్యులు ఉన్నారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో 2010వ సం.లో 108 మంది యువ కళాకారులతో నృత్యార్చన చేసి రికార్డు సృష్టించారు. 12 గంటలపాటు నిరవధిక నృత్య కార్యక్రమాన్ని తిలకించిన భక్తులు ప్రశంసల జల్లు కురిపించారు. కార్తీక దీపోత్సవం, కార్తీక నృత్య విరాజనం, శివనామ సంకీర్తం, నృత్య నీరాజనం, ఉగాది ప్రత్యేక కార్యక్రమంగా కూచిపూడి వైభవం తదితర కార్యక్రమాలతో ప్రేక్షక హృదయాలను రంజింపచేశారు. ప్రస్తుతం ఆమె కళాక్షేత్రంలో 200మంది శిష్యులున్నారు. డిప్లొమా, సర్ట్ఫికెట్ కోర్సులలో ఆమె శిష్యులు 46 మంది ఉత్తీర్ణత సాధించారు. తన శిష్యులే కాకుండా కళాకారులకు ఎవరికైనా ఇతర దేశాలలో స్థిరపడే అవకాశం వస్తే ప్రయోగాల పేరుతో నృత్య సంప్రదాయాన్ని మార్చవద్దని సురభి గాయత్రి విజ్ఞప్తి చేశారు.
జానపద నృత్యాలకు జీవం..
తెలుగు నేలకు సంబంధించిన జానపద నృత్యాలే కాకుండా తమిళనాడు, అస్సాం, నాగాలాండ్, కేరళ, మణిపురి రాష్ట్రాల సంప్రదాయ జానపద నృత్యాలను కూడా నృత్య కల్పన చేసి శిష్యులకు నేర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సహాయ కార్యనిర్వహణాధికారిగా పదవీ విరమణ చేసిన సురభి కృష్ణమూర్తి, శారదమ్మల పుత్రిక గాయత్రి, చిన్నతనంలోనే కాలికి గజ్జె కట్టి నాట్యాచారిణి పుదుకొడై రంగనాయకి అమ్మ శిష్యరికంలో అనేక మెలకువలు నేర్చుకుని అనతికాలంలోనే ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. తిరుపతి సంగీత నృత్య కళాశాలలో భరతనాట్యంలో సర్ట్ఫికెట్ కోర్సు పొంది, బికాంలో డిగ్రీ కూడా పొందానని ఆమె చెప్పారు. దూరదర్శన్ మువ్వల సవ్వడి కార్యక్రమంలో తన శిష్యులచే ప్రదర్శన ఇప్పించారు. ఇప్పటివరకు సుమారు 3500 ప్రదర్శనలు ఇచ్చారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా మన నృత్య సంప్రదాయాన్ని అని తన శిష్యులకు బోధిస్తుంటారు. నృత్యకళ ద్వారా ఖండాంతరాలు వ్యాప్తి చేసి చిరస్థాయిగా మన సాంస్కృతిక సంప్రదాయాల కీర్తి పతాకాన్ని ఎగురవెయ్యాలి. కళల ద్వారా కళాకారుడు చిరస్థాయిగా చిరంజీవిగా ప్రజల హృదయాల్లో నిలవాలని నాట్యాచారిణి సురభి గాయత్రి అంటున్నారు.

-మురళీధర్