Others

చిటి టనేస్తం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బోన్సాయ్ మొక్కలను పెంచుకోవటం చాలా సులభం. బోన్సాయ్ మొక్క పెంచటం అంటే శిల్ప కళను ఆదరించటమే అని అంటారు. ఇంటికి అందం, ఎక్కడో అడవిలో పెరిగే వృక్షం మన ఇంటిలోనే ఉన్నదనే ఆనందం కలుగుతుంది. స్థలం ఎక్కువ అవసరం ఉండదు. కిటికీలకు సమీపంలోనూ వీటిని పెంచుకుంటే చాలు. ఉదయానే్న మిమ్మల్ని పలుకరిస్తోంది. కొన్ని బోన్సాయ్ మొక్కలకు అధిక సూర్యకాంతి కూడా అవసరం లేదు. మన ఇంటిలో పడే సూర్యకాంతికి తగిన మొక్కలను పెంచుకుంటే మంచిది. మంచి బెరడు ఉన్న నమూనాలను ఎంపికచేసుకోమని ఉద్యానవన నిపుణులు సైతం సూచిస్తున్నారు. గల గల పారే నదుల మధ్య, పర్వతాల మీద, అటవీ ప్రాంతాలలో పెరిగే ఎన్నో రకాల మొక్కలను బోన్సాయ్ రూపంలో పెంచుకోవచ్చు. ఇవి ఇంట్లో ఉంటే ప్రకృతి రమ్యత మన కళ్ల ముందే కనిపిస్తోంది. గాలి తగిలేటట్లు కుండీలలో పెంచుకుంటే అందంగా కనిపిస్తోంది. చిన్న గులక రాళ్లను, కంకర మొక్క చుట్టూ వేసుకుంటే బాగుంటుంది. ఈ మొక్కలు పెంచటానికి సాధారణ మట్టి వాడితే చాలు. పూలు, పండ్లు కాచే మొక్కలైతే అవసరమైనప్పుడు ఎరువులు వాడితే మరింత బాగా పెరుగుతుంది. మొక్కకు ఆసరా ఇచ్చేందుకు రాగి తీగతో సపోర్టు ఇస్తే చూడటానికి ముచ్చటగా ఉంటుంది.