AADIVAVRAM - Others

రామాయణం.. 61 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినయవంతుడైన రాముడు మంత్రి మాటలు విని దశరథుడితో వినయంగా ఇలా చెప్పాడు.
‘మహారాజా! భోగాలని, అందరితో సంబంధాలని వదిలి అడవిలో దొరికే ఆహారం తింటూ, అడవిలో జీవించేవాడిని. నాతో వచ్చే పరివారంతో నాకు ఉపయోగం ఏమిటి? ఓ రాజా! ఉత్తమమైన ఏనుగునే ఇచ్చేసిన వాడికి దాని నడుముకి కట్టిన తాటి మీద భ్రాంతి ఎందుకు? వాడికి ఆ తాడుతో ఎలా ఉపయోగం లేదో నాకూ అలాగే ఈ సేనతో ఏ ప్రయోజనమూ లేదు. వీటన్నిటినీ భరతుడికే ఇచ్చేస్తున్నాను. నాకు నార చీరలని మాత్రం తెచ్చివ్వండి. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవిలో నివసించడానికి వెళ్తున్నాను.’
తనకి ఇవ్వబడ్డ ఆ నార చీరలని తీసుకుని రాముడు తను ధరించిన సన్నటి వస్త్రాన్ని వదిలి ఆ ముని వస్త్రాలని ధరించాడు. లక్ష్మణుకు కూడా తండ్రి ఎదుటే తను ధరించిన అందమైన బట్టలని విడిచి నార చీరలని కట్టుకున్నాడు. తర్వాత పట్టువస్త్రాలనే ధరించే సీత తన కోసం తీసుకువచ్చిన నార చీరలని చూసి, వలని చూసిన లేడిలా భయపడింది. ధర్మాలన్నీ తెలిసినది, ధర్మం మీదే దృష్టి కలది, ఉత్తమ లక్షణాలు గల సీత సిగ్గుపడుతూనే కైకేయి చేతి నించి ఆ నార చీరలని తీసుకుని, బాగా విచారిస్తూ కన్నీళ్లతో నిండిన కళ్లతో చూస్తూ గంధర్వ రాజుతో సమానమైన భర్తతో ఇలా చెప్పింది.
‘అడవిలో నివసించే మునులు నార చీరల్ని ఎలా కట్టుకుంటారో?’
సీత వాటిని ఎలా కట్టుకోవాలో తెలీక అలాగే ఉండిపోయింది. తర్వాత ఓ నార చీరని మెడ మీద వేసుకుని, ఇంకోటి చేత్తో పట్టుకుని ఎలా కట్టుకోవాలో తెలీక సిగ్గుపడుతూ నిలబడింది. అది చూసిన రాముడు వెంటనే సీత దగ్గరికి వెళ్లి ఆమె ధరించిన పట్టువస్త్రాల మీదే స్వయంగా నార చీరని కట్టాడు. అలా సీతకి రాముడు నార చీర కట్టడం చూసిన అంతఃపుర స్ర్తిలంతా ఏడ్చారు. వాళ్లగా బాగా దుఃఖిస్తూ తేజస్సుతో ప్రజ్వరిల్లే రాముడితో ఇలా చెప్పారు.
‘నాయనా! ఉత్తమమైన మనసు గల సీత కూడా ఇలా వనవాసానికి వెళ్లాలని ఎవరూ ఆజ్ఞాపించలేదు కదా? నువ్వు తండ్రి మాటని అనుసరించి అడవికి వెళ్లు. నువ్వు తిరిగి వచ్చేవరకు మేమంతా ఈమెని చూస్తూ సంతోషిస్తాం. నువ్వు లక్ష్మణుడ్ని సహాయంగా తీసుకుని అడవికి వెళ్లు. మంగళ స్వరూపిణి ఐన ఈ సీత మునిలా అడవిలో నివసించడానికి తగదు. కుమారా! మా ప్రార్థనలని మన్నించి సీతని ఇక్కడే ఉంచు. స్థిరమైన ధర్మంగల నువ్వు ఇక్కడ ఉండటానికి ఎటూ ఒప్పుకోవు కదా?’
వారంతా ఇలా మాట్లాడుతున్నా రాముడు తనలా ధర్మస్వభావం గల సీతకి స్వయంగా నార చీర కట్టాడు. దశరథుడి మంత్రి సుమంత్రుడు సీత నార చీర కట్టుకోవడం చూసి ఆమెని ఆపి కైకేయితో ఇలా చెప్పాడు.
‘మితిమీరి ప్రవర్తించే చెడ్డబుద్ధి గలదానా! కులాన్ని అపవిత్రం చేసే ఓ కైకేయి! రాజుని ఈ విధంగా వంచించావు. ఇంకా నువ్వు న్యాయంగా ప్రవర్తించడం లేదు. సదాచారం లేని ఓ కైకేయి! సీత అడవికి వెళ్లాల్సిన పని లేదు. ఆమె ఇక్కడే ఉండి రాముడి సింహాసనాన్ని అధిష్టించగలదు. భర్తలకి భార్య ఆత్మలాంటిది. ఈ సీత రాముడి ఆత్మ కాబట్టి రాజ్యాన్ని పరిపాలిస్తుంది. అలా కాక సీత కూడా రాముడితో అడవికి వెళ్తే మేం కూడా ఆమె వెంటే వెళ్తాం. ఆమెతో ఈ నగరం కూడా వెళ్తుంది. సరిహద్దులు పరిపాలించే వారు, దశరథుడితో కూడిన ఈ దేశం, సకల పరివారం, పరికరాలతో కూడిన ఈ నగరం మొత్తం రాముడు ఉన్న చోటికే వెళ్లిపోతుంది. భరత శతృఘు్నలు కూడా నారచీరలు ధరించి అడవికి వెళ్లి అక్కడ నివసించే అన్నగారితో కలిసి అక్కడే ఉంటారు. ఆ తర్వాత ప్రజలకి హాని చేసే, చెడ్డ నడవడిక గల నువ్వు ఒక్కత్తివే ప్రజలంతా వెళ్లిపోవడంతో పాడుపడ్డ ఈ భూమి మీది చెట్లని మాత్రమే పరిపాలించు. రాముడు రాజుగా లేనిది రాజ్యం అవదు. రాముడు నివసించే అడవే రాజ్యవౌతుంది.
‘ భరతుడు తండ్రి తనకి మనస్ఫూర్తిగా ఇవ్వని రాజ్యాన్ని పాలించడు. ఈ విషయంలో నీ కొడుకు నీలా (చెడ్డగా) ప్రవర్తించడు. నువ్వు భూమి మీంచి ఆకాశంలోకి ఎగర గలిగినా, తండ్రి వంశంలో పుట్టి, పూర్వ పురుషుల సచ్ఛరిత్రలు తెలిసిన భరతుడు నువ్వు చెప్పినట్లు చేయడు. కొడుకు మీది ప్రేమతో నువ్వు నీ కొడుక్కి అపకారమే చేస్తున్నావు. ఈ లోకంలో రాముడ్ని అనుసరించని వాడు ఎవడూ ఉండడు కదా? పశువులు, ఏనుగులు, మృగాలు, పక్షులు కూడా రాముడి వెంటే వెళ్తూండగా, చెట్లన్నీ రాముడి వైపే ముఖం తిప్పి నిలచి ఉండటం నువ్వు ఇప్పుడే చూస్తావు. అందుచేత ఈ నార చీరని తొలగించి నీ కోడలైన సీతకి ఉత్తమమైన ఆభరణాలు ఇవ్వు. ఈమె కూడా నార చీరలు కట్టాలనే వరం నువ్వు కోరలేదు కదా?’
సీత కట్టే ఆ వస్త్రాన్ని ఆపించాడు.
‘ఓ కైకేయి! నువ్వు రాముడి ఒక్కడికే కదా వనవాసం కోరావు? అందుచేత ఈమె వివిధ అలంకారాలతో రోజూ శరీరాన్ని అలంకరించుకుని రాముడితో అడవిలో నివసిస్తుంది. సీత వెంట ప్రధానమైన వాహనాలు, సేవకులు, బట్టలు, అన్ని వస్తువులు కూడా వెళ్తాయి. నువ్వు వరాలని కోరినప్పుడు ఈమె కూడా వెళ్లాలని కోరలేదు కదా?’
సాటిలేని స్వభావంగల, రాజ గురువు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఐన వశిష్ఠుడు ఇలా చెప్పింది సీత విన్నది. (అయోధ్యకాండ సర్గ -37)
ఆనాటి హరికథ చెప్పాక హరిదాసు ఓసారి రామాయణంలోని తను చెప్పిన కాండలని తిరగేసి చెప్పాడు.
‘అరె! నేను ఇందాక చెప్పిన దాంట్లో 5తప్పులు చెప్పాను. క్షంతవ్యుణ్ణి. అవి చెప్తాను. వినండి.’
ఆ తప్పులని మీరు కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
కుబేరుడి వాహనం ఏది?
నరవాహనం
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.సుమంత్రుడు కైకేయితో ‘స్ర్తిలకి భర్త కోరిక తీర్చటం కోటి మంది కొడుకులని కనే కంటే అధికమైంది’ అని చెప్పాడు. హరిదాసు దీన్ని చెప్పలేదు.
2.‘వేపచెట్టు నించి తేనె కారుతుందా?’ అని లోకంలో సామెత ఉండనే ఉంది అని సుమంత్రుడు కైకేయితో ఆమె తల్లి గురించి చెప్పిన సందర్భంలో చెప్పాడు. హరిదాసు దీన్ని చెప్పడం విస్మరించాడు.
3.కైకేయి తండ్రి చీమ పలుకులని విన్నాడు. ఆ చీమ పేరు జృంభం. హరిదాసు ఆ పేరు చెప్పలేదు.
4.హరిదాసు 35వ సర్గని చెప్పాడు. కాని 25వ సర్గ అని పొరపాటు చెప్పాడు.
5.ఉన్నవి నాలుగు తప్పులే. కాని ఆ శ్రోత పొరపాట్న ఐదు తప్పులని చెప్పి, నాలుగు తప్పులనే చెప్పాడు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి