Others

డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-అల్లాణి శ్రీ్ధర్

కొమరం భీమ్, ప్రేమే నా ప్రాణం, గౌతమబుద్ధ, రగులుతున్న భారతం చిత్రాలతో దర్శకుడిగా వైవిధ్యమైన ముద్రవేసిన అల్లాణి శ్రీ్ధర్, బతుకమ్మలో పూలు ఎలా వైవిధ్యంగా వుంటాయో అలాగే సినిమాలు కూడా డిఫరెంట్ కథనాలతో వస్తే పరిశ్రమ వర్థిల్లుతుందని అంటున్నారు. అల్లాణితో చిట్‌చాట్..

మీ నేపథ్యం?
-మెదక్ జిల్లా కొడకంచి గ్రామం నుండి వచ్చాను. కరెంటులేని రోజుల్లో గ్రామీణ నేపథ్యంలో అనేక సామాజిక వర్గాల ప్రజలు వరుసలుపెట్టి పిలుచుకునే సంప్రదాయం వున్న ఊరు మాది.

గురువులు ఎవరు?
-సినిమా ఎలా తీయాలో దాసరి నేర్పితే, ఎలాంటి సినిమా తీయాలో నరసింగరావు నేర్పారు. -బయోపిక్స్ చాలా ఇష్టం.

హారర్, లవ్ చిత్రాలపై అభిప్రాయం?
-దెయ్యం పట్టినట్లుగా తలా తోకా లేని హారర్ సినిమాలు తీస్తున్నారు. ఆ దెయ్యాన్ని వదిలించే మంత్రగాళ్లలా మంచి సినిమా తీసే దర్శకులు రావాలి. బిచ్చగాడు చూస్తే సినిమా అంటే ఏంటో అర్థమవుతుంది.

పరిశ్రమలో సమస్యలు?
-కామన్ ప్రాబ్లమ్స్ వున్నమాట నిజమే. థియేటర్లు దొరక్కపోవడం, మోనోపలి లాంటివి వున్నాయి. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయాన్ని తీసుకోబోతోంది.

తెలంగాణ సినిమా?
-తెలంగాణలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఇక్కడి కథలతో సినిమాలు తీస్తే మంచి చిత్రాలు వస్తాయి. దాసి, మాభూమి వంటివి అలాంటివే. ప్రభుత్వం అనేక ప్రోత్సాహాలూ ఇవ్వనుంది. దర్శకుల సంఘం తరఫున అనేక సూచనలు ఇచ్చాం.

నెక్ట్స్ ప్రాజెక్టులు?
-చిలుకూరు బాలాజీ విడుదలవుతుంది. మరో రెండు ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.

దర్శకుడంటే?
-సినిమా స్వరూపాన్ని అందరికన్నా ముందుగా దర్శించేవాడు.

-శేఖర్