Others

సెక్స్ బాగోతాల ప్రభావం టాలీవుడ్‌పై వుంటుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాశ్చాత్య సమాజం అయినా, ప్రాచీన భారతంలో అయినా మానవాళి జీవన వికాసానికి వివిధ రంగాలలో దోహదపడిన మేధాపరిణతి చెందిన వృద్ధ ప్రతిష్ఠులను గౌరవించుకోవటం సమాజ నైజం. కాలగర్భంలో కలిసిపోయిన, మహనీయుల మాట ఎలా వున్నా, లబ్ధకీర్తివంతులై, ప్రస్తుతం సజీవంగా మసలుతున్న హాలీవుడ్ సినీ మేధావులు కొందరిపై రగులుతున్న సెక్స్ కళంక ప్రచారం ఆసక్తితో ఆలోచింపచేస్
తోంది. సృష్టి ఆవిర్భావానికి ఆధారభూతమైన సెక్స్ ఏ దేశమైనా ఏ సంఘమైనా జీవితాలకు వాంఛనీయమే. సమాజ నిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్ర్తి పురుష బాంధవ్యం ఆదర్శ, ఆచరణీయంగా దాంపత్య ధర్మంగా కొనసాగవలసినదే. కాని మానవ జీవన యానంలో అత్యంత రహస్యంగా ప్రాధాన్యత పొందుతున్న ప్రబల వాంఛలు తీర్చుకోవటం ఏ కాలంలో అయినా మగతనానిదే పైచేయిగా స్పష్టమవుతోంది. అయిష్టమైనా, వాంఛ లేకపోయినా, లైంగిక బాంధవ్యం గురించి తెలియకపోయినా అది ఆడతనానికి ఆమోదయోగ్యమే. పురుష ఆధిపత్యాన్ని అంగీకరించవలసిందే. వ్యామోహం, బలహీనతలు, అవసరాలు అన్నీ మగ ఆధిపత్యానికి లోబడినవే. 21వ శతాబ్దంలోని ప్రస్తుత భారతీయ సమాజం, కన్య అంటే ఎనిమిదేళ్ళ వయసు నిర్థారణ నుంచి ప్రస్తుతం పద్ధెనిమిది అవసరమా అంటోంది. సమాజం కోసం పోరాడుతున్న మహిళలకు తలాక్, తాళికి సంబంధించి ఎంత భరోసా ఇచ్చే న్యాయాన్ని అందిస్తున్నా, రాజ్యాంగానికి విరుద్ధం చట్ట వ్యతిరేకమైన ఏకపక్షం అని సుప్రీంకోర్టు ఎంతగా నొక్కి చెప్పినా సమాజం, ప్రభుత్వం అంతగా పట్టించుకొనే పరిస్థితులు లేవు. హాలీవుడ్‌లో ఇటీవల చెలరేగుతున్న ‘సెక్స్ స్కాండల్స్’ పాశ్చాత్య సమాజం ఎదుర్కొంటున్న పురుషాధిక్య ఉన్మాద బలహీనతలకు ఎలా తలఒగ్గవలసి వస్తుందో వెలుగుచూసే సంచలనం, మన దేశంలో కూడా భుజాలు తడుముకునే ఆలోచనలకు ఆస్కారం కల్పిస్తోంది. సంప్రదాయం, సాంకేతికం రెండింటి మేళవింపుగా కొనసాగుతున్న ఆధునిక భారతీయ జీవనసరళిలో యువ భారతీయ మహిళకు గ్రంథసాంగుల ప్రత్యక్ష, పరోక్ష గుంజాటన తప్పటంలేదు. అటువంటప్పుడు హాలీవుడ్ కథనాల ప్రస్తుత సంచలనం దృష్ట్యా ఆలోచిస్తే, గత్యంతరం లేని అనివార్య స్థితిగతులలో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎంతమంది బాలికలు లేదా యువతులు వాంఛలకు అధీనం కావలసివస్తోందో స్పష్టమవుతోంది. అది సామాజిక వాస్తవం.
సీనియర్‌లు - లేలేత యువతులు
సామాజిక వాస్తవికతగా ప్రభుత్వాలు భావిస్తున్న ఈ సంచలనాత్మక ఆరోపణలతో, మన దేశంలో ‘మీటూ’ మేం కూడా ‘యిటువంటి అనుభవాలు ఎదుర్కొన్నాం’ అంటూ ఎఫ్‌బి, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అసంఖ్యాకంగా వెల్లివిరిసే రోజులు రానున్నాయి. యువ మహిళా లోకాన్ని ప్రస్తుతం అత్యంతంగా ఆకర్షించి ప్రభావితం చేస్తున్న సినీ, క్రికెట్ క్రీడారంగాల హీరోలకే కాకుండా జీవితంలో పైకి ఎదగాలనే అందం, ఆకర్షణ, ప్రతిభ వున్న బాలికలు యువతులు ఈ ఆకర్షణలకు లొంగి అవకాశవాదులైన మేధావి వర్గాల ఔదల దాలుస్తున్నారు. వ్యామోహం శృతిమించి, వాంఛలకు బానిసలవుతున్నారు. బలి అవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. హాలీవుడ్ మేధావులకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాలలో మూడు దశాబ్దాలనాటి మూవీ మొగల్ సుప్రసిద్ధ స్టూడియో అధినేత హార్వే వైన్‌స్టీన్, ఆస్కార్ అవార్డు విజేతలు కేసీ ఎఫ్లెక్, బిల్ కోస్బీ, వుడీ అల్లెన్, మార్టిన్ లారెన్స్, బిల్ ఒరైల్లీ, రొమాన్ పొలాన్‌స్కీ వంటి ప్రపంచ ప్రసిద్ధి పొందిన నిర్మాత, దర్శక మేధావులెందరో ఈ ఆరోపణల కారణంగా వృద్ధాప్యంలో జైలు నిర్బంధాలకు గురి కావలసి వచ్చే శిక్షలను అనుభవించటానికి అప్రతిష్ఠ, అమర్యాద, అవమానాలతో క్రుంగిపోతున్నారు. ప్రపంచ స్థాయి అద్భుత అందాల నటీమణి మార్లిన్ మన్రో మాటలలో చెప్పాలంటే హాలీవుడ్ కిక్కిరిసిన వేశ్యావాటిక, మదించిన గుర్రాలకు విలాసవంతమైన పడకగదులుండే శయనాగృహం. అక్టోబర్ 5న న్యూయార్క్ టైమ్స్, హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్, దశాబ్దాల క్రితం హీరోయిన్‌లను లొంగదీసుకున్న కథనాలు బయటపెట్టడంతో, సోషల్ మీడియాలో ప్రపంచ ప్రఖ్యాత హీరోయిన్‌లు ‘మేమూ ఉన్నాం’ అంటూ తమ వేధింపు అనుభవాలను కూడా ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్‌లు ఇంతవరకు ఎవరూ అంతగా బయటపడకపోయినా, ప్రస్తుత సమాజంలో యువతులు మహిళలపట్ల నెలకొనివున్న లైంగిక వేధింపుల పర్వంలో సినిమాలలో అవకాశాలు పొందటానికి రాణించటానికి అందరూ కాకపోయినా తొలిదశలో కొందరైనా భాగస్వామ్యలే. అందం, ఆకర్షణ, ప్రతిభ, ఐశ్వర్యం అన్నీ వున్న టాలీవుడ్ హీరోయిన్‌లు ఎందరో నిస్సహాయంగా ఆత్మహత్యలు చేసుకొన్న కథనాలు మనకు కొత్తకాదు. హాలీవుడ్ సెక్స్ భాగోతాల ప్రభావం మన టాలీవుడ్‌లో కూడా కొనసాగుతోందనటంలో ఎటువంటి సందేహం లేదు. అది సామాజిక వాస్తవం.
హాలీవుడ్‌లో సెక్స్ భాగోతాలను బహిర్గతం చేయటంలో పాశ్చాత్య దేశాలలోని మీడియా ప్రధాన పాత్ర వహిస్తోంది. దశాబ్దాల క్రితం తాము వనంలో వుండగా హార్వే వైన్‌స్టీన్, రొవాన్ పొలాన్‌స్కి వంటి హాలీవుడ్ విజేతలు చిన్న వయసులో తమపట్ల ప్రవర్తించిన లైంగిక అత్యాచారాన్ని వృద్ధులయిన తరువాత నటీమణులు బహిర్గతం చేయటంలో నేర తీవ్రత తగ్గటమే కాక వయోవృద్ధులు, ఎనభై పైబడిన వయసు కావటంతో హాస్యాస్పదత చోటుచేసుకొంటోంది. కాని నేరం ఎప్పుడు జరిగినా శిక్షార్హులు కావటంతో హాలీవుడ్ చిత్రాల కీర్తి పతాక విజేతలైనా సిగ్గుతో తలదించుకొని, కనీసం పది సంవత్సరాలుల జైలుశిక్ష అనుభవించవలసిన అగత్యం తలఎత్తుతోంది. నేరం చేసినవారు, అనుభవించినవారు ఇరువురూ ప్రపంచ ప్రముఖులు కావటంతో, నేరం సెక్స్‌కు సంబంధించిన అత్యాచార, ఆకర్షణ ఇతివృత్తం కావటంతో, మీడియా అత్యంత ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఈ సెక్స్ స్కాండల్స్ పాత్రధారులు ప్రస్తుతం వృద్ధులైనా సజీవంగా వుండడంతో మీడియా వార్తోత్సాహంతో విశేష ఆసక్తి ప్రదర్శిస్తోంది.
చలనచిత్ర రంగానికి సంబంధించిన సెక్స్ భాగోతం వంటి ఇతివృత్తాలు హీరోయిన్‌లు సౌందర్యవతులు కావటంతో, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కావటంతో జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆ వార్తలలో హీరోయిన్‌లపై అయ్యో పాపం! అనే దయ, సింపతీకి అవకాశం వుండటం తక్కువే. మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అభిమానులు, వారి సంఘాలు హీరోలమీద ఈగ వాలనివ్వవు. హీరోలు ఎలా ప్రవర్తించినా, నిజ జీవితంలో ఎంతమందితో సహజీవనం చేసినా, మోసగించినా, పెళ్లిళ్ల పేరిట ఎంత చరిత్ర సృష్టించినా పలుకుబడి, వ్యాపార ప్రకటనల ఆదాయం దృష్ట్యా మీడియా అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తాయి. ఎప్పుడో ఎన్‌టిఆర్ గురించి ఏదో రాసి తన్నులు తిన్న కాగడా శర్మ వంటి సినీ పత్రికల రచయితలు ప్రస్తుతంలో లేరు. అందువలన హాలీవుడ్ స్కాండల్స్ ప్రభావం అంతగా టాలీవుడ్‌పై వుండే ఆస్కారం లేదు. భాగోతాలు అంతా గప్‌చుప్.

-జయసూర్య.. 9440664610