Others

తాజా గణనతోనే ఓబీసీలకు న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనుకబడిన తరగుతుల్లోని ఇతర ఉపకులాల వర్గీకరణకు కేంద్రం కమిటీ వేసింది. ఈ వర్గాలకు సమర్ధ పద్దతిలో మామాజిక న్యాయం జరగడానికి ఇది నాంది కాగలదని నిపుణులు భావిస్తున్నారు. సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు దీనిని స్వాగతిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికులు ఓబీసీలే. వీరిలో చాలా కులాలు నేటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉన్నారు. అలా ఉండిపోవడానికి గల కారణాలను అర్థం చేసుకొని, ఓబీసీల అభివృద్ధికి విధానాలను రచించడానికి మార్గం లభిస్తుంది. భారతీయ నమూనా సర్వే దళితులు 19, ఆదివాసీలు 9, ఇతర వెనుకబడిన తరగతులు 44 శాతాలుగా ఉన్నారని పేర్కొంది. దేశంలో 25-49 మధ్య వయస్కుల్లో డిగ్రీ చదివినవారు 7 శాతం కన్నా తక్కువ ఉన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థల్లో ఉద్యోగులు మొత్తం మూడు శాతానికి మించరని పలు అంచనాలు తెలుపుతున్నాయి. కాలేజీ సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు నిబంధనలకు లోబడి సగానికి మించవు కనుక పోటీ సమంజసం అనలేం. విశాల ప్రజానీకం రిజర్వేషన్లు పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. కానీ చాలా తక్కువగా వున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాల కోసం తీవ్రంగా పోటీపడాలి. కనుక తరతరాలుగా అభివృద్ధికి నోచుకోని వందలాది ఓబీసీ కులాల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండటం ఆశ్చర్యకరమైన విషయం ఏమీకాదు. అణగారిన జీవితాల్లో మార్పు రావాలంటే నాణ్యమైన విద్య అందించాలి. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు పెరగాలి. సుప్రీంకోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. అలా చేయాలంటే, అర్హులకు లబ్ది చేకూరాలంటే రిజర్వేషన్లకు అర్హులైన వారి సంఖ్యను కుదించేలా చూడాలి. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తమకు కూడా కల్పించమని ఉద్యమిస్తున్న జాట్, కాపు, పటేల్ తదితర కులాలు ఈ కమిటీ నియామకంతో వచ్చే ప్రయోజనాలు ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఏ కులం ఎంత వెనుకబడి ఉందో తెలిసేది ఎలా? దేశవ్యాప్త కులసమాచారాన్ని 1931లో బ్రిటిష్ ప్రభుత్వం సేకరించింది. ఇదే నేటికీ ఆధారం. దానికి అదనంగా ప్రత్యేకంగా కొన్ని కులాల వివరాల సేకరణ జరిగింది. 2011లో సేకరించిన ఆర్ధిక కుల జనాభా లెక్కలు సమగ్ర సమాచారాన్ని అందించగలవు. కాని వీటిని అధికారికంగా ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. ఈ లెక్కలన్నీ పేదరికం, జరిగిన నష్ట సమాచారాలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల సేకరణలో 4.6 మిలియన్ల కులాల పేర్లు గోత్రాలతో సహా ఇంటిపేర్లు, ఉచ్ఛారణ తేడాలు కూడా సేకరించారు. ఈ డాటా క్రమ పద్ధతిలో విశే్లషణ చేయడానికి సాధ్యం కాకపోవడంతో దానిని అటకెక్కించారు. మొత్తం మీద దేశ ప్రజల కుల గోత్రాల సేకరణ అంత సులువు కాదని తేలిపోయింది. మున్ముందైనా శాస్ర్తియంగా జరగాలి. జనాభా లెక్కల సేకరణ చేసేటపుడే అది సాధ్యం. 2021 జనాభా లెక్కల సేకరణకు సన్నాహాలు మొదలయ్యాయి. క్లిష్టమైన కుల సమాచార సేకరణ, మదింపుల్లో సామాజిక నిపుణుల సహాయం తీసుకోవల్సి ఉంది. కుల , ఆర్ధిక , సామాజిక పరిస్థితులపై శాస్ర్తియమైన అంచనాలు తయారుకావాలి. కుల అంశం చాలా విశాలమైంది. చాలా క్లిష్టమైంది కూడా. పట్టువీడకుండా ప్రభుత్వం కృషి చేసి కులతత్వాన్ని నిర్మూలించాలంటే శాస్ర్తియ సమాచారం ఉండాలి. ఇప్పటికే రిజర్వేషన్ల పరిధిలో ఉన్న వారికి, కొత్తగా చేరే కులాలకు సైతం సమాన ఫలాలు అందాల్సి ఉంటుంది. ఒకసారి రిజర్వేషన్లు జాబితాలోకి వచ్చిన వారు కులధృవపత్రం సాయం కోరే పరిస్థితి ఎపుడూ రాకూడదు. అంతగా సామాజిక, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి జరిగితేనే నవభారతి అవతరిస్తుంది.

- వి వరదరాజు