Others

ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో భిన్నమైన సమస్యలు ఎట్లా ఉంటాయో చిన్నపిల్లల్లో కూడా అలాగే విభిన్న సమస్యలుంటాయి. పెరిగిన పిల్లలు మాట్లాడగలుగుతారు. చిన్న పిల్లలు ఆ వయసులో భాషను సొంతం చేసుకోలేక తమ భావాలను వ్యక్తం చేయలేరు. శిశువుల తరగతి గదిలో ఉపాధ్యాయుని పరిశీలన ఎక్కువగా ఉండాలి. కొంతమంది అంగవైకల్యంగల పిల్లలుంటారు. వారిలో నిరుత్సాహం ఉంటుంది. కానీ సాంకేతిక యుగంలో మానవ సమాజం అంగవైకల్యాన్ని సంపూర్ణంగా అధికమించగలుగుతున్నారు. సైంటిస్ట్ హాబ్రన్ కాళ్లూ చేతులూ లేని వ్యక్తి. అతను వీల్‌ఛైర్‌లో చక్రం తిప్పకుంటూ వస్తాడు. ఆయన పేరు మీద హాబ్రన్ విశ్వవిద్యాలయమే వెలసింది. కళ్లు కనపడని వారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డీలు చేశారు. ఒక అమ్మాయి కట్టెపట్టుకుని నడుస్తూ మా ఇంటికి వచ్చింది. ఆమె మంచిర్యాల వాసి. ఆమె నన్ను ఓ సమావేశానికి పిలిచేందుకు వచ్చింది. ఆమె పి.హెచ్.డి. పూర్తిచేసింది. చిన్నపిల్లలకు విజయగాథలు చెప్పాలి. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కాళ్లు లేకున్నా మయూరి నృత్యం చేయడం ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇలాంటి గాథలను పిల్లలకు చెప్పాలి. అంగవికలురైన పిల్లల్లో ఆత్మవిశ్వాసం కలుగుచేయాలి. దీన్ని ఉపాధ్యాయులు నిర్వహించాలి. ఈ విషయంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఉండాలి.
తరగతి గది.. ఆవిష్కరణల వేదిక
ఈనాడు తరగతి గది ముందు ఉన్న సమస్య.. సామాజిక ఆర్థిక సమస్యలతో మిళితమై ఉంది. ఒకనాడు వ్యవసాయమే ప్రధాన వృత్తి. 20వ శతాబ్దం వ్యవసాయానికి ఉత్పత్తి అనే అంశం తోడుకావటం వలన ఆర్థిక రంగానికి కొత్త వూపు వచ్చింది. 21వ శతాబ్దం ఉత్పత్తి రంగానికే కాకుండా సేవల రంగానికి ప్రాధాన్యం వచ్చింది. సేవల రంగం నిరంతరం కొత్త ఆలోచనను ఆశిస్తుంది. అందుకే ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. అందుకే తరగతి గదిలోని పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయటమే మన లక్ష్యం. ప్రతి పిల్లవాడు ప్రతిరోజు ఎన్నో విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు. అది ఆలోచనల పుట్ట. ఆ ఆలోచనలను క్రమబద్ధీకరించడమే తరగతి గది లక్ష్యం. బోధనాపద్ధతి లోనే కాల్పనిక శక్తిని జోడించటం జరిగింది. ఆ కాల్పనిక శక్తి ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. తరగతి ఈ సత్పరిణామాన్ని ఉపయోగించుకుంటేనే సామాజిక ఆర్థిక లక్ష్యాలతో మిళితమైన సవాళ్లను ఎదుర్కునే తరాన్ని సిద్ధం చేయగలుగుతుంది. తరగతి గది బోధనా కొలమానం కాల్పనిక బోధన, ఆవిష్కరణల సన్నాహంగా తయారు చేసుకోవాలి.
మన తరగతిలో ఆవిష్కరణలకు పిల్లలకు సిద్ధం చేయగలిగితేనే దేశ ప్రగతిలో భాగస్వాములవుతారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఈ నాలుగు సబ్జెక్టులు విద్యార్థులకు నైపుణ్యాన్ని కలిగించే సాధనాలు. అవి బోధించేటప్పుడు విద్యార్థుల్లో ఏర్పడిన భావాలను సమీకరించాలి. వర్షపునీటిని సమీకరించుకుంటే కాలువలవుతాయి. కొన్ని కాలువలు కలిస్తేనే అవి నదిగా మారుతుంది. తరగతి గదిలో విద్యార్థుల్లో ఏర్పడ్డ భావనలను వ్యక్తం చేయటానికై ఇదొక వేదిక కావాలి. పిల్లలకు 12 సంవత్సరాలు వచ్చేసరికి విద్యార్థి తన భావాలను వ్యక్తం చేసే స్థాయికి వస్తారు. విద్యార్థి మేధస్సు తెరుచుకోవాలంటే వారిలో భయాన్ని తొలగించాలి. దాంతో సహా ఆత్మవిశ్వాసం కలిగించాలి. తరగతి గదికి ఈ రెండు మానసికమైన శక్తులని గుర్తించాలి. ఆవిష్కరణలకు తెర ఎత్తేందుకు ఈ రెంటిని తరగతి గది సమకూర్చగలగాలి. అప్పుడే గదిలోని 40 మంది విద్యార్థుల భావనలు బైటకు వస్తే అవి ఎన్ని ఆలోచనల చుక్కలవుతాయో ఆలోచించండి. తరగతి గది ఆవిష్కరణల ట్యాంక్ లాంటిది.

-డాక్టర్ చుక్కా రామయ్య