Others

జిఎస్‌టి భారం తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వస్తుసేవల పన్ను విధానం మంచిదే. కానీ అమలులో లోపాలు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఒక వస్తువుపై అనేక స్థాయిలలో పన్నులు వేసి వసూలు చేయడంకన్నా ఒకేచోట పన్ను విధింపు మంచి సంస్కరణే. ఈ విషయంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ముందడుగు వేసింది. అయితే జిఎస్‌టి అమలు విధానం లోపభూయిష్టంగా ఉంది. సంస్కరణల అసలు లక్ష్యంపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచే లక్ష్యంతో జిఎస్‌టి అమలు చేశారని, ఈ విషయంలో ప్రజలకు కలిగే మేలు పెద్దగా లేదన్నది వస్తున్న ప్రధాన విమర్శ. ప్రపంచంలోని అతి తక్కువ దేశాల్లోనే జిఎస్‌టి విధానం ఉందని, గరిష్ఠంగా 18 శాతం పన్ను అక్కడ విధిస్తున్నారని చెబుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు వివిధ శ్లాబులను నిర్ణయిస్తూ గరిష్ఠ పన్ను శాతాన్ని ఎక్కువగా నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. లక్ష్యం మేరకు ఆదాయం పెరిగిన తరువాత అభివృద్ధి పనులు చేస్తామని, ఆ తరువాత పన్ను శ్లాబుల రేటును తగ్గిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి చెప్పడం సరికాదు. ఎక్కువ పన్ను విధించి ఆదాయం పెంచుకోవడం అన్నది సరైన నిర్ణయం కాదు. ప్రణాళికేతర వ్యయం తగ్గించుకోవడం ద్వారా నిధులు మిగుల్చుకోవాలి. ఒక రూపాయి ఖర్చు మానేస్తే ఒక రూపాయి విలువ పెరుగుతుంది. ఇది ప్రాథమిక ఆర్థికసూత్రం! కానీ ప్రభుత్వాల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. జిఎస్‌టి అమలులో హేతుబద్ధీకరణ లేకపోవడం రెండవ లోపం. ఒకేరకం వస్తువుపై దాని ఉపయోగాన్ని బట్టి పన్ను స్లాబు ఉండటం అవసరం. కానీ మనదగ్గర అలా లేదు. ఉదాహరణకు టైర్లమీద 18 శాతం పన్ను విధించారు. మన దేశంలో జిఎస్‌టిలో ‘టైరు’ అంటే అది వ్యవసాయానికి కూడా ఉపయోగపడే ట్రాక్టర్ టైరు కావచ్చు, కోటి రెండు కోట్ల ఖరీదైన విలాసవంతమైన బెంజికారు టైరు కావచ్చు. నిజానికి ట్రాక్టరుకు వాడే టైరుపై పన్ను తక్కువగా ఉండాలి. కారు టైర్లపై శ్లాబు ఎక్కువగా ఉండాలి. అంటే ఆయా వస్తువులను వినియోగించేవారి స్థితి, ఆ వస్తువు ప్రయోజనాన్నిబట్టి పన్నురేటు నిర్ణయించాలి. భవిష్యత్‌లోనైనా ఈ హేతుబద్ధీకరణను ప్రభుత్వం గుర్తించి శ్లాబుల రేటు నిర్ణయించాలి. ఆదాయపన్ను పరిధిలోకి అన్ని సేవలను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావడం మరో లోపం. ఇప్పటికే, ప్రత్యక్షంగాకాని, పరోక్షంగాకాని కొన్ని సాధారణ సేవల చార్జీలలో పన్ను కొంత కలిసి ఉన్నది. వాటిపై మళ్లీ జిఎస్‌టి అంటే, అది సాధారణ వ్యక్తికి భారం అవుతుంది. డిజిటల్ చెల్లింపుల మీద 1 లేక 2 శాతం పన్నువేయడం చట్టవిరుద్ధమేనని ఆర్‌బిఐ తేల్చిచెప్పింది. ఇలాంటి సున్నితమైన అంశాలు చాలా ఉన్నాయి. వీటిపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించాలి. ఎప్పటికప్పుడు సమావేశమవుతున్న జిఎస్‌టి మండలి ప్రజోపయోగకర మార్పులు చేయాలి. ఆర్థిక నిపుణుల సూచనలు, జిఎస్‌టి అమలులో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేయాలి.

-మనె్న సత్యనారాయణ