Others

ఫలితమిచ్చే ‘కామన్ స్కూల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరు చేసిన పనిని ఒక జట్టు అనుసరిస్తుంది. సమాజంలో ఒకరు చేసిన పనిని ఇతరులు అనుకరిస్తారు. నమస్కారం పెట్టటం అన్నది ఒక సంస్కృతి. నమస్కారం చేసుకుంటూ పెద్దలు పోతుంటే పిల్లలు దాన్ని అనుకరిస్తారు.
వాకింగ్‌లో యువకులు పరుగులు పెడుతున్నారు. పిల్లలు గంతులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ పిల్లల్ని చూసి నాలో కూడా చలనం మొదలై నా నడకలో వేగం పెరిగింది. నలుగురితో కలిసి నడిస్తే వ్యక్తుల్లో వేగం పెరుగుతుంది. తరగతి గదిలో ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటారు. ఒకరు చేసిన పనిని ఇతరులు కూడా అనుకరిస్తారు. సమాజ పరివర్తనకు తరగతి గది ఒక ప్రతీక. అదొక సాధనం. అందుకే చాలా దేశాలు ప్రాథమిక స్థాయిలో గ్రామాలలో అన్ని వర్గాలతో కూడిన సమ్మేళనంలో పిల్లలను చేర్చితే కల్చరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందని అంటాయి. అంటే సాంస్కృతికమైన మార్పు జరుగుతుంది. అది సమాజ పరివర్తనకు అదొక సాధనమవుతుంది. పిల్లలు తమ వయసుగల పిల్లలు ఏమి చేస్తే ఇతరులు కూడా అదే చేస్తారు. ప్రాథమిక దశలో అన్ని దేశాలు కూడా కామన్ స్కూల్ సిస్టమ్‌ను పెట్టాయి. అమెరికాలో ప్రజలు ఒక జాతి కాదు. ప్రతివారు కూడా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వలసవెళ్లినవాళ్లే. కొందరు ముందు కొందరు వెనక కావచ్చు. అట్లాంటి ప్రజలందరూ కలిసి ఒక జాతిగా రూపొందించబడాలంటే స్కూలే సాధనమనుకున్నారు. ఒక పెట్టుబడీదారి దేశం ప్రైవేటు యాజమాన్యాలను ప్రోత్సహించకుండా కామన్ స్కూల్ సిస్టమ్‌ను ఎన్నుకున్నది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజలను ఒక జాతిగా రూపొందించింది. ఇవాళ అక్కడ ఏ విద్యార్థిని అడిగినా నువ్వెవరని అడిగితే ‘నేను అమెరికన్’ని అని సమాధానం చెబుతాడు. ఈ మార్పు రావడానికి కామన్‌స్కూల్ సిస్టమ్. సింగపూర్‌లోనూ అదే సందర్భం ఆవిష్కరించబడుతుంది.
ఉపాధ్యాయుడు పాత్రధారి
ప్రతి విద్యార్థి మనసులో ప్రతి క్షణం సంఘర్షణ జరుగుతూ వుంటుంది. ప్రతి విద్యార్థి తన ఐడెంటిటీ, గతంలో ఏర్పడిన అలవాట్లు ఈ రెంటి మధ్యన సంఘర్షణ వస్తుంది. దానినుంచే హేతువు గుర్తుకొస్తుంది. ఆ సంఘర్షణే రీజనింగ్. అదే మనిషిలో నైపుణ్యాలను పెంచుతుంది. రీజనింగ్ లేని మనిషి (హేతుబద్ధత లేని మనిషి)కి నిలకడ వుండదు. ఉపాధ్యాయుడు తన మాటను అందరు కూడా ఒప్పుకోవాలని ఆశించటం తరగతి గదిని నిశే్చష్ఠురాలు చేయటమే అవుతుంది. ఉపాధ్యాయుణ్ణి పిల్లలు ప్రశ్నిస్తే, కొన్నిసార్లు ధిక్కరిస్తే కోప్పడకూడదు. ఇది ప్రతి మనసులో జరిగే టగ్గ్ఫా వార్. ఈ టగ్గ్ఫావార్ ఎంత ఎక్కువగా జరుగుతుంటే అంతే ఆలోచనా శక్తి కూడా పెరుగుతూ వుంటుంది. దున్నిన కొద్ది కర్రు లోనికి పోతుంది. ఉపాధ్యాయుడు ప్రవక్త కాదు, లేదా అధికారి కాదు. ఒక ఉత్ప్రేరకుడు మాత్రమే. తరగతి గదిని సజీవంగా ఉంచటానికై తను చర్చను లేక భిన్నాభిప్రాయాలను అనుమతించాలి. దీనితో బోధన లెర్నింగ్‌గా మారుతుంది. (టీచింగ్ ట్రాన్స్‌ఫామెటు లెర్నింగ్) ఈ రెండింటి సమ్మేళనమే తరగతి గది ప్రాణం. తరగతి గదికి విభిన్నతత్వమే దాని ఎదుగుదలకు ఎరుపుగా మారుతుంది. ఉపాధ్యాయుణ్ణి ఎవరైనా ప్రశ్నిస్తే ఆవేశం కన్నా అనురాగం రావాలి. ఉపాధ్యాయుడు పాలకుడు కాదు, పాత్రధారి.

-డా.చుక్కా రామయ్య