Others

తెలియజెప్పేవారే గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడభరతుడు వెళ్లడానికి సమాయత్తమైయ్యాడు. రహూగణుడు సాష్టాంగప్రణామం చేస్తూ ‘‘స్వామి! మీరు నాకు జ్ఞానబోధ చేయండి. నేను ఈ మమకారబంధనాలను వదిలించుకొని పరమాత్మవైపు అడుగులు వేసేటట్లు చేయండి ’’అని పదేపదే వేడుకున్నాడు.
‘‘స్వామీ నేను చాలా తప్పు చేశాను. మీలాంటివాని చేత నేను పల్లకీ మోయించుకున్నాను.నన్నుక్షమించండి’’అన్నాడు. జడభరతుడు చిన్నగా నవ్వాడు.
‘‘స్వామి మీ నవ్వుకు కారణం నాకు తెలియడం లేదు’అన్నాడు.
‘ఏంలేదు. నీవెప్పుడూ నేను మోసాను మోసాను అంటున్నావు. నేనెప్పుడూ నిన్ను మోయలేదు. నువ్వు ఎప్పుడూ నా చేత మోయబడలేదు కదా అని నవ్వాను’అన్నాడు.
‘అదేంటి స్వామి’అన్నాడు రహూగణుడు.
‘‘నువ్వు పల్లకీలో కూర్చున్నావు. పల్లకీ నిన్నుమోసింది అనుకొంటే ఆ పల్లకీని బోయిల భుజాలు, ఆ భుజాలను వక్షాలు, కడుపు, కాళ్లు , చివరకు పాదాలు మోస్తున్నాయి. పాదాలను భూమి మోస్తోంది. భూమిని ఆదిశేషుడు మోస్తున్నాడు. శేషుడిని కాలమూ, కాలాన్ని సూర్యచంద్రాదులు, ఆ సూర్యచంద్రులను ఆకాశం మోస్తోంది. ఆకాశమంటే శూన్యమే కదా. ఆ ఆకాశం కింద నువ్వు నేను ఉండి ఆకాశాన్ని మోస్తున్నాం. అంటే శూన్యాన్ని మోస్తున్నామన్నమాట.
ఇదంతా కర్మానుక్రమణికగా జరిగిపోతోంది. దానికి మనం కర్తలు, కర్మలను క్రియలమూ అసలు కానేకాదు. ఇది తెలుసుకొంటే చాలు’’అన్నాడు భరతుడు.
రహూగణునికి విచిత్రమైన ఆనందం వేసింది. ‘స్వామి ఇంతకాలానికి నాకు జ్ఞాన బోధ చేసే గురువు దొరినట్లే ’అన్నాడు.
పూర్వకాలంలో ఋభడనే గురువు అందరికీ అన్ని విద్యలూ నేర్పించేవాడు. అందరూ అంతో ఇంతో అన్నిటినీ నేర్చుకునేవారు. కాని నిదాఘుడు అన్న శిష్యుడు మాత్రం అద్వైతాన్ని నేర్చుకునేవాడే కాదు. వానికి ఎలాగైనా అద్వైతం బోధించాలని ఋభడు అనుకొనేవాడు. ఇంతలో నిదాఘుడు విద్యాధ్యయనం పూర్తి చేసుకొని గృహస్థాశ్రమానికి వెళ్లాడు. గురువు శిష్యుని ప్రేమానురాగాతిశయంగా శిష్యుని వదలకుండా అప్పుడప్పుడూ వచ్చి జ్ఞాబోధ చేస్తుండేవాడు. కాని గురువును గుర్తుపట్టేవాడే కాదు.
ఎన్నోవిధాలుగా చెప్తున్నా పట్టించుకోని నిధాఘుని దగ్గరకు గురువు వచ్చాడు. సన్యాసి లాగా ఉన్నావు అని అన్నం తిందువు రమ్మని పిలిచాడు. గురువుకు భోజనం పెట్టి ‘అయ్యా భోజనం రుచిగా ఉందా. మీ కడుపు నిండిందా ’అని అడిగాడు.
దానికి గురువు ‘ఆకలి దాహం అనేవి దేహధర్మాలు కదా. తృప్తి, సుఖం అనేవి మనోధర్మాలు. నువ్వు దైహికపరంగా ఆలోచిస్తే కడుపు నిండడం అనేది కల్ల కదా ఇపుడు తింటే మరికొద్దిసేపటికి మళ్లీ ఆకలి వేస్తుంది. దానికి ఎపుడు తృప్తి కలుగుతుంది. ఈ తృప్తి, సుఖం అనేవి మనోధర్మాలు’ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే నిదాఘుడు అడ్డు పడ్డాడు. నేను ఏదో ఆకలితో నకనకలాడుతున్నావని అన్నం పెట్టాను నీవు వేదాంతం మాట్లాడుతున్నావు. ఇది ఏమీ నాకు అక్కర్లేదుసుమా అని మంచి మాటలతో నిదాఘుడు చెప్పాడు. కాని, ఆ గురువు ఇంకా ఏదో చెప్ప బోతున్నాడు. వద్దన్నా వదలడం లేదని నిదాఘుడు విసుగును కనబర్చాడు. కాని గురువు వెళ్లకపోయేసరికి బలప్రయోగం చేయాల్సి వస్తుందని ఇక వెళ్లు అని గురువును గుర్తుపట్టకుండానే బలవంతంగా పంపించివేశాడు.

- రాయసం లక్ష్మి