Others

‘మాయాబజార్’ ఓ స్ఫూర్తి సంతకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘనవిజయాన్ని సాధించిన జానపద చిత్రం ‘పాతాళభైరవి’ నుంచి స్ఫూర్తిపొంది ఆ తరువాత ఎన్నో జానపద చిత్రాలు రూపొందాయి. అందులోని సన్నివేశాలు రూపాంతరం చెంది ప్రేక్షకుల్ని రంజింపజేశాయి. ఒక చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తే అందులో జనాన్ని ఆకర్షించిన సన్నివేశాలను ఆ తరువాత వచ్చిన చిత్రాల్లో కొన్నింట్లో యధాతథంగాను, మరికొన్ని సందర్భాల్లో కొద్దిపాటి మార్పులతో సన్నివేశాలను సృష్టించి ప్రేక్షకుల్ని మెప్పించేవారు. ఆ దిశగా పరిశీలిస్తే కె.వి.రెడ్డి, పింగళి రూపొందించిన ‘మాయాబజార్’ సినేరియో ఆ తరువాత వచ్చిన కొన్ని చిత్రాల్లోని సన్నివేశ రూపకల్పనను స్ఫూర్తినిచ్చింది. ముఖ్యంగా కె.వి.రెడ్డిగారి వద్ద తొలి దశలో దర్శకత్వ శాఖలోనూ, స్క్రీన్‌ప్లే రూపకల్పనలోనూ సహకరించిన కమలాకర కామేశ్వరావు, కె.వి.రెడ్డిగారిని అభిమానించిన నటరత్న ఎన్.టి. రామారావులపై ఆ ప్రభావం ఎంతగానో వుంది. ఆ దిశగా సన్నివేశంలో విశే్లషించటానికి ముందుగా చెప్పుకోవలసింది రచయిత, దర్శకుడు జంధ్యాల.
జంధ్యాలను ఎంతగానో ప్రభావితం చేసిన చిత్రం ‘మాయాబజార్’. ఆ చిత్రాన్ని ఆయన లెక్కలేనన్ని సార్లు చూసారు. ఆ అభిమానంతోనే మాయాబజార్ చిత్రంలోని పాటల పల్లవులను అహనాపెళ్లంట, ఒహనా పెళ్లంట, వివాహ భోజనంబు, చూపులు కలసిన శుభవేళ, హైహైనాయకా అనే టైటిల్స్‌తో చిత్రాలు రూపొందించారు. తరువాత మరో దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే పేరుతో చిత్రాన్ని రూపొందించారు. పింగళివారు ప్రయోగించిన అస్మదీయులు, తస్మదీయులు పదాలు నేటికీ ప్రజలు ప్రయోగిస్తూనే ఉన్నారు.
ఇక ముందుగా చెప్పినట్లు మాయాబజార్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న కొన్ని సన్నివేశాలను పరిశీలిద్దాం.
ద్వారక చేరిన ఘటోత్కచుడు, శశిరేఖను వెతికే ప్రయత్నంలో ఓ వృద్ధున్ని కలుస్తాడు. ముందు గదమాయించి, ఆ వృద్ధున్ని కదపలేక తుదకు అతడే శ్రీకృష్ణ్భగవానుడని గుర్తించి జేజేలు పలుకుతాడు. ‘పాండవ వనవాసం’ (దర్శకులు కమలాకర కామేశ్వరరావు) చిత్రంలో సౌగంధికా కమలాలను తేవడానికి వెళ్లిన భీమసేనునికి ఆంజనేయుడు ముసలి మర్కటం రూపంలో వుండి తన తోకను తప్పించి వెళ్లమంటాడు. శతవిధాలా ప్రయత్నించి విఫలుడైన భీమబలుడు తుదకు ఆ మర్కటాన్ని ఆంజనేయునిగా గుర్తించి అంజలి ఘటించి స్తుతిస్తాడు. ‘మాయాబజార్’లోని మాయా శశిరేఖ లక్ష్మణ కుమారుల ప్రణయ ప్రహసనంలో లక్ష్మణ కుమారుడు ‘సుందరి నీ వంటి దివ్య స్వరూపం’ అని పాడగా, ‘దూరం దూరం పెద్దలున్నారు’ అనే పొడి పొడి మాటలు పలికించారు. రేలంగికి ఘంటసాల పాడగా, ఆ పొడి పొడి మాటలు నటీమణి సావిత్రి పలికారు. దీనిని రివర్స్ ఎంత ప్రమాదమో గ్రహించండి!!
రుద్రమదేవి అత్యర్కేందు వంశస్థురాలు అని ఒక శాసనంలో ఉంది. ఈ మాటకు ‘కమ్మ’ కులస్థురాలు అని వ్యాఖ్యానం చెప్పారు. జ్యూరీలోని సభ్యులు కులాతీతంగా చేశారు ‘పాండవ వనసాసం’లో. ఇక్కడ మాయా శశిరేఖ, లక్ష్మణకుమారున్ని ఆటపట్టిస్తూ ‘బావా బావా పన్నీరు’ అంటూ చిందులు వేస్తే లక్ష్మణ కుమారుడు పొడి పొడిగా ‘అబ్బా మరదలా’ అంటాడు. మయా శశిరేఖకు సుశీల పాడగా, పొడి పొడి మాటలు పలుకుతాడు లక్ష్మణ కుమారుడి పాత్రధారి పద్మనాభం.
మాయాబజార్‌లోని శకుని (సి.ఎస్.ఆర్) దుర్యోధన, కర్ణ, దుశ్శాసనుల వద్ద తన పాచికల విద్య ప్రదర్శించగా, వారు తడబాటుగా సంఖ్యను చెప్పేసరికి ఆ పాచికలు కూడా తడబడి సంఖ్యను సూచిస్తాయి. ‘పాండవ వనవాసం’లో శకుని (లింగమూర్తి) కూడా తన పాచికల ప్రభావం చూపినపుడు, ఈ తడబడ్డ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నారు. ఇక పతాక సన్నివేశంలో కల్యాణ మంటపంలో ఘటోత్కచుని మాయాజాలానికి కల్యాణమంటపం కదలిపోయి, జనం కకావికలు అవుతారు. ‘పాండవ వనవాసం’లో కూడా దానిని యధాతథంగా ఉపయోగించారు.
మాయాబజార్‌లో శశిరేఖ, అభిమన్యుల యుగళగీతం ‘చూపులు కలసిన శుభవేళ’ ఇండోర్‌లో ఉద్యానవనం సెట్ వేసి చిత్రీకరించగా, ‘పాండవ వనవాసం’లో అవే పాత్రలపైన యుగళగీతం ‘రాగాలు మేళవింప’ అవుట్‌డోర్‌లో చిత్రీకరించారు. ఇక ఎన్.టి.రామారావు స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణపాండవీయంలో కూడా మాయాబజార్ ప్రభావం కనిపిస్తుంది. మాయాబజార్‌లో అభిమన్యునికి ఘటోత్కచుడు ఎదురుపడ్డప్పుడు అతని పదఘట్టనకు కొండచరియ చిన్న ముక్క విరిగి కిందపడుతుంది. శ్రీకృష్ణపాండవీయంలో రాక్షసునితో పోరాడినపుడు భీముని గదాఘాతానికి చెట్టుపైన వున్న కాయలు నేలరాలతాయి. వివాహ భోజనంబు పాటలో లడ్డూలు ఘటోత్కచుని నోటిలోనికి వెళ్లినట్లుగానే, ఇక్కడ కిందపడ్డ కాయలన్నీ రాక్షసుని నోటిలోకి వెళతాయి. మాయాబజార్‌లో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ గీతాన్ని మూ డు జంటలపై (అభిమన్యుడు-శశిరేఖ, శ్రీకృష్ణుడు-రుక్మిణి, బలరాముడు-రేవతి) చిత్రీకరించారు. ఎన్.టి.ఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీర శూరకర్ణ’లో ‘తెలిసెనులే ప్రియ రసికా’ అనే గీతాన్ని మూడు జంటలపై (శ్రీకృష్ణ-రుక్మిణి, సరోధనుడు-్భనుమతి, కర్ణుడు-శుభాంగి) చిత్రీకరించారు.
‘నీవేనా నను తలచినది’ యుగళగీతంలో ప్రియదర్శిని పీటికలో అభిమన్యుడు కనిపించగా యుగళగీతం ప్రారంభమవుతుంది. ‘్భష్మ’ చిత్రంలో అంబ ఎదురుగా చిత్రీకరిస్తున్న పటంలోంచి కాశీరాజు కనిపించగా, ‘మనసులోని కోరిక’ యుగళగీతం రూపుదిద్దుకుంటుంది. ఈ తరహాలో రూపొందిన మరో రెండు యుగళగీతాలు ‘మోహనరాగ మహా’ (మహామంత్రి తిమ్మరుసు), ‘చిత్రం భళారే విచిత్రం’ (దానవీర శూరకర్ణ).
‘మాయాబజార్’ చిత్రంలో దుశ్శాసన పాత్రధారికి (ఆర్.నాగేశ్వరరావు) ఆ చిత్రం అంతటా ఒకే డైలాగు ‘అదే మన తక్షణ కర్తవ్యం’, ఆ వెంటనే వచ్చిన విజయావారి సాంఘిక చిత్రం ‘అప్పుచేసి పప్పుకూడు’లో కూడా విలన్ ఆర్.నాగేశ్వరరావుకు ఒకే డైలాగ్ ‘అదే చెయ్యి - అదే దెబ్బ’.
మరో ముఖ్య విషయం ఉదహరించాలి. 1995లో ‘మాయాబజార్’ను సోషలైజ్ చేస్తూ దాసరి ఓ చిత్రాన్ని రూపొందించారు. అందులో శ్రీకృష్ణుని తరహా పాత్రను నాగేశ్వరరావు ఘటోత్కచుని తరహా పాత్రను దాసరి పోషించారు. ఆ చిత్రం ప్రారంభోత్సవం రోజున కె.వి.రెడ్డిగారి నిలువెత్తు కటౌట్ రూపొందించగా, ఆ కటౌట్ క్లాప్ కొట్టింది. అదీ మాయాబజార్ ప్రభావం.
ఏమైనా ఒక చిత్రం గురించి పదే పదే చర్చించుకోవడం, వందలాది వ్యాసాలు, పదుల సంఖ్యలో పండుగలు జరుపుకోవడం మాయాబజార్‌కే దక్కింది. అందుకు కారకులైన దర్శకులు కె.వి. రెడ్డి, రచయిత పింగళి నాగేంద్రరావుగార్లకు మంగిడీలు చెబుతూ ఆ చిత్రం యాభై సంవత్సరాల వేడుక, అరవై సంవత్సరాల వేడుక ఇటు హైదరాబాద్‌లోను, అటు రాజమండ్రిలోనూ నిర్వహించే అదృష్టం నాకు దక్కటం మరిచిపోలేని అనుభూతి.

-ఎస్.వి.రామారావు