Others

ఫలితమిచ్చిన వాల్మీకుల పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా, విద్య, ఆర్థిక అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సంప్రదాయంగా మారింది. కులవ్యవస్థను కూల్చివేసి ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా అవకాశాలు, రాయితీలు కల్పించడానికి రాజకీయ పార్టీలు, నాయకులు అంగీకరించరు. అందువల్ల సామాజికంగా దయనీయమైన పరిస్థితుల్లో జీవించేవారు తమ ఉనికిని చాటుకుంటూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి, బోయ తెగలకు చెందినవారు ఉన్నారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో వీరిని షెడ్యూల్డు కులాలు, తెగలుగా గుర్తించారు. అయితే ఏపీలోని మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా గుర్తించడం అసలు సమస్య. బోయ, వాల్మీకి, వాల్మీకి బోయ, బోయ వాల్మీకి, దొంగబోయ, దొర, గెంటు, మొండిబోయ, బేదర్, కిరాతక, నిషాద, ఎల్లాపి, చుండు వాళ్లు, పెద్ద బోయ, తలయారి, తలారి, ఎల్లాపు, చుండి నాయకులు, గురికర, కలావతిల బోయ, కావలివారు, శబరి, సుంకులమ్మ బోయ తదితర పేర్లతో పిలవబడే వీరంతా ఒకే తెగకు చెందినవారు. వీరు విభిన్నమైన సంస్కృతితో సాధారణ జనాలతో కలవలేకపోవడం, భౌగోళికంగా ఒంటరి జీవనం, వెనుకబాటుతనం, సాంఘిక పరిస్థితి, జాతరలు, జీవన విధానం, జీవన సామర్థ్యం, శారీరక రూపం, సామాజిక, ఆర్థిక పరిస్థితి, అత్యల్ప అక్షరాస్యత, జనాభా తరుగుదల తదితర లక్షణాల ద్వారా దేశంలోని ఇతర గిరిజన తెగలలో ఒకటిగా అనేక అధ్యయనాల ద్వారా స్పష్టమైంది. బ్రిటిష్ వారి హయాంలో వీరిని సి.టి. (క్రిమినల్ ట్రైబల్ యాక్ట్) 1936 చట్టం కింద నమోదు చేశారు. రోజూ రెండుపూటలా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేయాల్సి వచ్చేది. లేదంటే కేసులు నమోదయ్యేవి. ఆ తరువాత వీరిని బ్రిటిష్ ప్రభుత్వం ఎస్‌టిలుగా గుర్తించి రాయితీలు ఇచ్చింది. 1950లో భారత ప్రభుత్వం వీరిని డీఎన్‌టి (డీ నోటిఫైడ్ ట్రైబ్స్)గా నోటిఫై చేసి విముక్తి జాతులుగా గుర్తించింది. అంతేకాకుండా మాజీ క్రిమినల్ ట్రైబ్స్‌గా కూడా గుర్తించారు. ఎస్‌టిలుగా ఉన్న వీరిని ఎస్సీ జాబితాలో చేర్చారు. యుపి, బిహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్టల్రలో వారిని అలాగే గుర్తించారు. మాజీ నేరస్తులుగా గుర్తించడంతో వారికి సమాజంలో నిరాదరణ ఎదురైంది. 1956లో ఏపీ ప్రభుత్వం వాల్మీకులను కోస్తా జిల్లాల్లో ఎస్‌టిలుగా, తెలంగాణ జిల్లాల్లో బీసీలుగా, రాయలసీమలో విముక్తి జాతులుగా గుర్తించింది. దీంతో వారికి అన్యాయం జరిగింది. పెళ్లిళ్లు పెద్ద సమస్యగా మారాయి. రాయలసీమలో ఈ పరిస్థితి వారిని ఫ్యాక్షనిస్టుల చెంత చేరేలా చేసింది. అనేక కేసుల్లో ఇరుక్కునేవారు. సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి అన్ని ప్రాంతాలలోని బోయవాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలన్న పోరాటం మొదలైంది. దాదాపు 61 ఏళ్ల పోరాటానికి చివరకు ఫలితం దక్కింది. వీరిని ఎస్‌టి జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. 33 పేర్లతో పిలిచే వీరి ఒకే తెగవారిగా గుర్తించేలా ప్రభుత్వం స్పందించింది. లోకూర్ కమిటీ అర్హతలు అన్నీ ఉన్నందున ఇది కార్యరూపందాల్చే అవకాశం ఉంది. తొలిదశ విజయం సాధించిన బోయ, వాల్మీకులకు కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే అంతిమ విజయం లభిస్తుంది.

-ఎస్.నాగార్జున