Others

ఆమె చిత్రం.. కళాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె కుంచె కదిలిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. పచ్చటి ప్రకృతి పరుచుకుని కనుల విందు చేస్తోంది. ఆధ్యాత్మిక భావనలు ప్రోదిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన చిత్ర కళాప్రదర్శనలో ఆమె పెయింటింగ్స్ వీక్షకుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకున్నాయంటే అతిశయోక్తి కాదు. బొమ్మల్లో జారువాలే రంగుల ప్రవాహం కలల్లో విహరింపజేస్తోంది. కనుల ముందు మనోహరమైన చిత్రం కదలాడేటట్లు చేసింది. ఆమే పాటిబండ్ల ఉష. ప్రభాతవేళలో ఉదయించే సూర్యుడు వలే విశ్వంలోని గెలాక్సీని ప్రతిబింబించేలా ఉంటాయి. టెలిస్కోప్‌తో ఆకాశంలోని వింతలు,విశేషాలు చూసినట్లే ఉషా చిత్రాల్లోనూ చూడగలుగుతాం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా పుచ్చుకున్న ఉష చిత్రాలు గీయటాన్ని ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తోంది. కళ్ల ముందు కనిపించే అందమైన దృశ్యాలను గీయటం చేస్తుండేవారు. తన అభిరుచికి తగ్గట్టు ఆమె ఫైన్ ఆర్ట్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. చిత్రాలను గీయటంలో నేడు ఆమె ఆధునిక పద్ధతులను అవలంభిస్తున్నారు. ముఖ్యంగా చెక్క మీద చిత్రం గీయటం అనేది అరగంట పని మాత్రమే కాని అది ఎండిపోయే వరకు దాదాపు 24 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆ తరువాతే తదుపరి పొరను అంటించగలను అని ఉషా చెబుతున్నారు. ఇది ఒక సవాల్‌తో కూడుకున్న పని అంటారు.