Others

లండన్‌లో తెలుగు మెరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ మధ్య తరగతి ప్రజలకు అందని ద్రాక్షపండు. అది కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇపుడు కాలం మారింది. మధ్యతరగతి ప్రజలు మారుతున్న అభిరుచుల ప్రకారం ఫ్యాషన్ డిజైనింగ్ విద్య ఇపుడు సామాన్య వనితలకు కూడా అందుబాటులోకి వచ్చింది.
ఆ అవకాశాలను పుణికిపుచ్చుకొని, నగరంలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన 20 సంవత్సరాల రాఖీ శర్మ ఫ్యాషన్ రంగంలో ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. నగరంలోని హిమాయత్‌నగర్‌లోగల ఐఎన్‌ఐఎఫ్‌డి ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా సంస్థలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ పొందుతోంది.
ఇటీవల తన ఫ్యాషన్ కలెక్షన్‌ను లండన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించే అవకాశం దక్కించుకుంది. ఆ అవకాశం దేశ వ్యాప్తంగా ఐఎన్‌ఐఎఫ్‌డిలో శిక్షణ తీసుకుంటున్న 500 డిజైనర్లతో పోటీ అర్హత సంపాదించుకుంది. దేశ వ్యాప్తంగా 24 మంది డిజైనర్లు ఎంపిక కాగా, అందులో తను ఒకరు. తెలుగు రాష్ట్రాలనుండి ఎంపికైన ఏకైక మహిళ.
అలాగే లండన్‌లోని భారతీయ రాయబార కార్యాలయంలో రాయబారి చేత సత్కరించబడింది. రాఖీశర్మ తన అనుభవాన్ని వివరిస్తూ తను త్వరలోనే సొంతంగా లేబుల్‌ను స్థాపించి ఫ్యాషన్‌లో తనదైన ముద్రను వేసుకోవాలనే పథకాన్ని రచిస్తున్నట్లు తెలిపింది.
మెస్మరైజింగ్ మెటాలిక్ పేరుతో పిలువబడే తన కలెక్షన్‌కు స్ఫూర్తికోసం రెండు నెలలు తపించాల్సి వచ్చిందని తెలిపింది. అలాగే తర్వాత ఆరునెలల పాటు శ్రమించి ఎనిమిది దుస్తులను డిజైన్ చేయగా, ఐదింటిని ప్రదర్శించడానికి అనుమతి లభించిందని ఈ 20 సంవత్సరాల అమ్మడు తెలిపింది.
ఈ దుస్తులు గ్లామర్ మరియు శృంగారాన్ని మేళవించి, ప్రాచీన భారతీయ నేత దుస్తుల వారసత్వాన్ని తలపించే విధంగా మరియు అందమైన దుస్తుల అలంకరణలతో చికంకర్ టెక్నిక్ మరియు దుస్తులపై ఫర్డీకా కామ్ పద్ధతిలో చిన్న చిన్న చుక్కలతో రూపొందించబడ్డాయి.
ఈ డిజైన్‌కు స్ఫూర్తి చీకటిరాత్రిలోని ఆకాశం. దుస్తులపై నక్షత్రాలను మెటల్ పనితో చుక్కల ద్వారా, మేఘాలను తెల్లని దారంతో డిజైన్ చేయడం జరిగిందని రాఖీశర్మ తెలిపింది.
లండన్ ఫ్యాషన్ వీక్ ఆరంభానికి ముందు జరిగిన ఫ్యాషన్ స్కౌట్‌లో లండన్ సలహాదార్లు మరియు జ్యూరీ సభ్యులు 24 మంది డిజైనర్లను ఎంపిక చేశారు. నా కలెక్షన్‌కు సంబంధించిన వార్తను ప్రముఖ ఫ్యాషన్ మేగజైన్, ఫ్యాషన్ ప్రపంచానికి బైబిల్లా పరిగణించబడే బ్రిటిష్ వోగ్ మ్యాగజైన్ ప్రముఖంగా ప్రచురించిందని రాఖీ శర్మ తెలిపింది.
ఫ్యాషన్ స్కౌట్ లండన్‌లో ఫ్యాషన్‌కు సంబంధించిన అతి పెద్ద వేదిక. స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటుచేసిన వేదిక. ఇది రాబోయే సుస్థిరమైన దుస్తులను, ప్రతిభను గుర్తించి పరిచయం చేసే ఓ చక్కని వేదిక.
తమ విద్యార్థిని విదేశాల్లో తమ కలెక్షన్‌ను ప్రదర్శించే అవకాశాన్ని పొందడం తమకెంతగానో గర్వంగా ఉందని ఐఎన్‌ఐఎఫ్‌డి హైదరాబాద్ హిమాయత్‌నగర్ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణా సంస్థ వ్యవస్థాపకుడు సంజయ్ సారస్వత్ తెలిపారు.
ఐఎన్‌ఐఎఫ్‌డి దేశ వ్యాప్తంగా 180 శాఖలతో ఏటా 25000 మందికి శిక్షణనిచ్చి, మధ్యతరగతి మహిళల ఫ్యాషన్ డిజైనర్ చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తోంది.