Others

జమిలి ఎన్నికలతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ప్రజలు తమ అభిమతం మేరకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవులకు కాలపరిమితి ఉంటుంది. ఆ పదవీకాలం ముగిసేలోపు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తూంటారు. ప్రతి అయిదేళ్లకూ జరిగే ఈ ‘సార్వత్రిక ఎన్నికలు’ పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహించడం దేశానికి మంచిది. స్వాతంత్య్రానంతరం మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952, 57, 62లలో ఇంచుమించుగా ఇలాగే జరిగాయి. ఇలా జరిగినందువల్ల దేశమంతటా ఎన్నికల కార్యక్రమం అంతా నాలుగైదు నెలల్లో పూర్తవుతుంది. ఆ తరువాత కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి పనులపై శ్రద్ధ వహించగలుగుతాయి. అయితే గత నలబై, యాబై సంవత్సరాలుగా ఎన్నికలు అలా నిర్వహించడం లేదు. వివిధ రాష్ట్రాలకు వేరువేరు సంవత్సరాల్లోను, పార్లమెంటుకు మరోసారి, మధ్యంతరంగానూ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవధి పూర్తి కాకుండానే రద్దు కావడం ఇందుకు కొంత కారణం. అలా రద్దయిన అసెంబ్లీలకు మళ్లీ ఎన్నికలు జరపాలి. అలా మళ్లీ జరిగిన ఎన్నికల్లో ఏర్పడిన అసెంబ్లీ కాలపరిమితి అయిదేళ్లు ఉంటుంది. అందువలన, దేశంలో అన్ని రాష్ట్రాలకు, పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికల తరువాత రెండుమూడేళ్లకు ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఇదేకాకుండా, కొందరు ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం వలన లేదా రాజీనామాలు చేయడం వలన ఆయా నియోజికవర్గాల్లో మళ్లీ ఎన్నికలు జరపాలి. ఇవి కూడా మధ్యంతరంగానే జరుగుతాయి. ఇవన్నీ కాకుండా కొన్ని ప్రభుత్వాలు తమ రాజకీయ అనుకూలత కోసం, అయిదేళ్ల గడువు పూర్తికాకుండానే, తమ ప్రభుత్వాలను రద్దు చేసుకుని ముందస్తుగా ఎన్నికలకు వెళుతున్నారు. ఇవన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీల, అగ్రనాయకుల స్వార్థ ప్రయోజనాల కొరకే జరుగుతున్నవి. ఇలా అనిశ్ఛితంగా ఎన్నికలు జరుగుతుండడం వలన, దేశంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తరువాత, అవి పూర్తయ్యే వరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కాని, కేంద్ర ప్రభుత్వం కాని కొత్తగా అభివృద్ధి పనులు ప్రారంభించకూడదు. కొత్త పథకాలేవీ ప్రకటించకూడదు. అంటే కొన్ని నెలల పాటు అభివృద్ధి నిలిచిపోతుంది. అంతేకాదు, ఇప్పుడు ఎన్నికలు బాగా ఖర్చుతో కూడుకుని ఉన్నాయి. ఒక్కో స్థానానికి 20 నుండి 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా అనుత్పాదక వ్యయం. ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతున్నది ఇదే. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. అయిదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాలు కొలువుదీరేలా సంస్కరణలు రావాలి. అందుకోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలం తగ్గించడం లేదా పొడిగించడం కోసం ప్రత్యేక చట్టాలు లేదా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాక మళ్లీ అయిదేళ్ల వరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ ఎన్నికలు నిర్వహించకుండా చట్టాలు చేయాలి. రాజకీయ పార్టీలు, లేదా చట్టసభలలోని సభ్యులు రాజీనామాలు చేసినా, ముందస్తు ఎన్నికలకు కోరినా ఆ అవకాశం ఇవ్వకుండా చూడాలి. 2019లో జరగవలసిన సార్వత్రిక ఎన్నికలు ఆ పద్ధతిలో ఉండేలా చూడాలి.

-మనె్న సత్యనారాయణ