AADIVAVRAM - Others

తెలంగాణము.. శబ్దోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకతీయులు మొదట జైన మతస్థులు. తర్వాత శైవులు. శివుణ్ణి శైవులు 1.లింగరూపములో 2.కరచరణాది అవయవములగల మానవ రూపంలో 3.మంత్ర - అక్షర రూపములో 4.బిందు రూపము (శ్రీ చక్రము)లో ఉపాసిస్తారు. ఈ సృష్టి దేనినుండి పుట్టి దేనిలో పెరిగి దేనిలో లయము అవుతున్నదో దానికి లింగము ఈ పేరు.
త్రిలింగము: మూడు ప్రాంతముల మధ్య భూమి.
1.కాళేశ్వరము 2.్భమేశ్వరము 3.మల్లికార్జునము.
త్రికళింగ శబ్దము తియలింగ తెలింగగా మారిందని ఒక నిర్వచనము. విదేశాలలో ‘తైలింగ్’ అనే ఒక తెగవారు ఉన్నారు. అంటే వీరు త్రిలింగగ దేశవాసులు. వలస వెళ్లారని అర్థం. తెలివాహ = జలవాచి. తెన్ దిగ్వాచి. తెకాయ - టెకాయ - తెనుగు - త్రినగమధ్య దేశ భాష.
దక్షిణ దేశభాష-
తెలుంగు - తెలుఁగు
‘‘తెలుఁగున రచియింపుమధికథీ శక్తి....యిన్
నేను తెలుంగు రాయడ కన్నడ రాయనక్కొదువ కప్పు
ప్రియాపరిభుక్త భాక్ కథ’’ - ఆముక్తమాల్యద
తెలంగాణ్యుడు = తెలంగాణ ప్రాంతమునకు చెందిన ఒక విప్రశాఖ.
దక్షిణ దేశము = దక్కన్
మంజీరాదేశము = మంజీరానదీ తీర దేశము.
నాగభూమి = నాగశబ్దము -సర్పవాచి. జాతివాచి.
నిజాం రాష్టమ్రు = సాఫ్ అంటే విశుద్ధము -
ఆసఫ్‌జాహీలు - విశుద్ధ పాలకులు
అనే శబ్ధార్థం కలవారు, వీరే నిజాము ప్రభువులు.
సారాంశము, త్రిలింగ శైవ పరిభాష -
తెలుగు = భాషావాచి.
తెలంగాణము = దేశవాచి
కాకతి ఎవరు?
ఈమె కాకతీయుల దైవము. ఈ సామ్రాజ్యము అటు హోయసల - ఇటు దేవగిరి మధ్యలో ఉంది. కాకర్త్య గుండయ తొలి కాకతీయ ప్రభువు. వీరు గరుడలాంఛనులు. అది రాష్టక్రూట లాంఛనము. బస్తర్ ప్రాంతంలో కాకేర్ అనే గ్రామం ఉంది. కాకతమ్మకు సైదోడు ఏకవీర. వీరు తొలుత గ్రామ దేవతలా? ఏకవీర - రేణుక - ఎల్లమ - ఎల్లరి అమ్మ, కాంకేర్ -కాకేర్ - కాకర -కాకరీయ - కాకతీయ. బెల్గాం పట్టణానికి 12 కిలోమీటర్లదూరంలో ఉత్తరాన కాకతీయ అనే ఒక గ్రామం. దీనికి కాకతీయులకు ఏదో సంబంధం ఉంది. బయ్యారం శాసనంలో కాకతీయ వంశస్థాపకుడు వెన్నుడు తన గ్రామము కాకతి అని చెప్పుకున్నాడు.
*

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్