Others

మాధవసేవకు మార్గమిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సద్గురు శివానందమూర్తిగారు సాధారణంగా కనిపించిన అసాధారణ వ్యక్తి. వ్యక్తి కాదు ఒక శక్తిఅని శివానంద మూర్తి గారి శిష్య గణం చెబుతారు. తెల్లని ధోవతీ, చొక్కా, కండువాతో నుదుట మూడు రేఖల విభూతి, కుంకుమ బొట్లతో, మెడలో రుద్రాక్షమాలతో మనకు దర్శనమిస్తారు. వీరిని సద్గురువుగా భావించి గురుదేవుల దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు అందుకున్న పలువురు వారి మనస్సులో అనుకున్న కోరికలు వెంటనే నెరవేరాయని చెబుతారు. ఆనందవనంలో ఉదయం వేళ సద్గురువులు శివాభిషేకం చేసాక గురువుగారి చేతితో ఇచ్చిన తీర్థము స్వీకరించడంవలన కొన్ని వ్యాధులు నయమవుతాయని కూడా కొందరు భక్తులు చెబుతారు. మానవసేవే మాధవసేవని పలుమార్లు బోధ చేస్తారు. బోధచేయటమే కాదు ఆయన బతికున్న రోజుల్లో స్వయంగా సేవ చేసి తరించేవారు. వీరిని దర్శించిన కొందరు దక్షిణామూర్తి స్వరూపమని, శ్రీరమణ మహర్షి తేజస్సు చూసేమని అంటారు. శివానంద గురుదేవుల అనుగ్రహం పరిపూర్ణంగా కలిగిన కొందరు శిష్యబృందం, శ్రీమతి జానకీదేవి, శ్రీ గురుచరణం వెంకటరమణ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, వంటి శిష్యులు కొందరు గురుసాన్నిహిత్యంలో వారు పొందిన అనుభవాలను ఇతరులకు తెల్పి వారిని సైతం గురుమార్గంలోకి తీసుకొని రావడానికి చేసే యత్నం కూడా మానవసేవనే మాధవసేవగా గుర్తించాలి. అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞాన దానం చేసి వారిని సన్మార్గం లోకి తేవడమూ మానవసేవనే. అదే ఉత్తమమైన సేవ. అన్నిదానాల్లోకి అన్నదానం శ్రేష్ఠమైనప్పటికీ అది కేవలం క్షుద్బాధను తీరుస్తుంది. ఇహలోకంలో కోరికకొంతవరకు తీరుస్తుంది. కాని జ్ఞానదానం చేస్తే ఆ దాన గ్రహీత ఇహంలోను పరంలోను సుఖపడుతాడు. పరమాత్మ సాయుజ్యాన్ని పొందడానికి, జనన మరణ చక్రపు కోరలనుంచి తప్పించుకోవడానికి జ్ఞానదానానికి మించిన దానం ఏదీ లేదు.

- చివుకుల రామమోహన్