Others

పాపపుణ్యాలు సమానమైతే సాయుజ్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి నిదాఘుడు ఇంటికి కట్టెలమోపును మోస్తూ దారిలో వెళ్తున్నాడు. అతనికి రాజపరివారం అడ్డువచ్చింది. ఏనుగులను రాజును తప్పించుకుని వెళ్లలేక కట్టెలమోపును దించి పక్కన పెట్టి కాసేపు అక్కడ నిలబడ్డాడు. అక్కడికి గురువైన ఋభడు వెళ్లాడు. అపుడూ నిధాఘుడు గుర్తుపట్టలేదు. గురువే కల్పించుకుని ‘నాయనా ఇక్కడ నిలబడి ఉన్నావేమి ?’ అని అడిగితే ఏనుగునెక్కి రాజు వచ్చినందువల్ల దారి లేకపోయింది అన్నాడు నిదాఘుడు. రాజు ఎవరు, ఏనుగు ఎవరు, ఎవరు కింద, ఎవరు పైన కాస్త వివరించు అని అడిగాడు గురువు. ఎంత చెప్పినా గురువు అర్థం కాలేదు అనేవాడు దాంతో నిధాఘునికి బాగా విసుగు వచ్చింది. వెంటనే ‘ఓయి సన్యాసి నీకు చెబుతుంటే అర్థం కాలేదుకదా’ అంటూ బలం ఉపయోగించి గురువుగారి బాగా కొడుతూ ఆయన్ను వంగోబెట్టి తాను గురువుగారి వీపుమీద ఎక్కి కూర్చుంటాడు. ‘ఇపుడు అర్థమైందా? నేను పైన నీవు కిందా ’అంటాడు నిదాఘుడు. ‘అపుడు కూడా గురువు ‘నాయనా నీవు, నేను అంటున్నావే వారు ఎవరు’అని అడిగాడు. వెంటనే కిందికి దిగి స్వామి చాలా తప్పుచేశాను. నీవే నా గురువు. నాకు అద్వైతాన్ని నేర్పిస్తానని ఇలా వచ్చివుంటావు. అజ్ఞానంతో నేను నిన్నుబాధపెట్టాను’అంటూ బోరుమని ఏడుస్తూ గురువు పాదాలపై బడి తన్ను క్షమించమని అడిగాడునిధాఘుడు. అపుడు ఋభుడు ఆనందించి నిధాఘుని దగ్గర తీసుకొని అద్వైతామృతాన్ని అందించాడు తన శిష్యునకు. ఇలా మనం అంతా తెలుసు అనుకొంటే ఏమి తెలియదు. తెలియదు అనుకొంటే అనుకొంటే అసలు తెలియకుండా పోతుంది. కనుక నిమిత్తమాత్రులుగా వుంటే చాలు. జరగాల్సింది జరుగుతుంది. జరుగకూడనిది జరగకుండా ఉంటుంది అని భరతుడు రహూగణునికి చెప్పాడు. రహూగణుడు భరతుని మాటలు విని మాయ నుండి విడవడి తాను వనవాసానికి వెళ్లాడు అలా వారిద్దరూ భగవంతుని స్మరిస్తూ పులహాస్త్యశ్రమానికి వెళ్లారు. భగవంతుడు కూడా వారికి తన సాయుజ్యానికి వారిద్దరూ అర్హులయ్యారనుకొన్నాడు.

- డా. రాయసం లక్ష్మి