Others

రహస్యం(ఫ్లాష్‌బ్యాక్@50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1956లో లలితా ఫిలిమ్స్ పతాకం ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్‌లతో ‘చరణదాసి’ రూపొందించారు ఎ.శంకర్‌రెడ్డి. 1963లో లలితా శివజ్యోతి బ్యానర్‌పై పూర్తి గేవా కలర్‌లో ఎన్‌టిర్‌తో ‘లవకుశ’ నిర్మించారు. ఘనవిజయం సాధించిన ఆ చిత్రం తరువాత ఇదే బ్యానర్‌పై రంగుల్లో వీరు నిర్మించిన జానపద చిత్రం ‘రహస్యం’. 1966లో హైదరాబాద్‌లో నిర్మించిన ‘సదరన్ మూవీ టోన్ స్టూడియో’లో ఈ చిత్ర నిర్మాణం ఎక్కువ భాగం జరిగింది.
ఈ చిత్రానికి మూల కథ ఆర్.సుబ్రమణ్యం పిళ్ళై. చిత్రానువాదం, మాటలు, పద్యాలు, కొన్ని పాటలు శతావధాని భారతీ తీర్థోపాధ్యాయ బిరుదు పొందిన వెంపటి సదాశివబ్రహ్మం, మల్లాది రామకృష్ణశాస్ర్తీ, సినారె, సముద్రాల సీనియర్, ఆరుద్ర, ఛాయాగ్రహణం పి.ఎల్.రాయ్, నృత్యం హీరాలాల్, వేదాంతం రాఘవయ్య, కళ టి.వి. యస్.శర్మ, ఎడిటింగ్ ఆర్.ఎం.వేణు, దర్శకత్వం వేదాంతం రాఘవయ్య, నిర్మాత ఎ.శంకర్ రెడ్డి, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు.
మహాయోగి రక్త్భీషుడు (ఎస్.వి.రంగారావు) జగన్మాత లలితాదేవికై పాతాళ మందిరం ముందు తపస్సు చేస్తాడు. దేవి దర్శనమివ్వగా, తనకు కైవల్యం ప్రసాదించమని కోరుకుంటాడు. అది సాధ్యపడదని, ఒక జన్మలో ముక్తికాంత ద్వారా సంసార సౌఖ్యం పొంది, పుత్రుడు కలిగాక, అతనిని ముద్దులాడిన పిమ్మటే కైవల్యం లభిస్తుందని దేవి తెలియజేస్తుంది. దేవిని మందిరంలో స్వయం పూజాపీఠంగా వెలయుమన్న రక్త్భీహుని కోరిక తీర్చి, దేవీ కవచమనే ఉంగరం ప్రసాదిస్తూ, అది లేనిదే ఎవరికైనా మందిర ప్రవేశం సాధ్యం కాదని హెచ్చరిస్తుంది. కాంచీపురం మహారాజు శ్రీగండడు (గుమ్మడి) సుబ్రమణ్యేశ్వరుని భక్తుడు. నారదుడు (హరనాథ్) వలన ఈ విషయం తెలుసుకుని, తానూ ఆ ముక్తికాంతను పొందాలనుకుంటాడు. చంద్రగిరి ప్రభువు కరుణాకరుడు (నాగయ్య) రక్త్భీహుని మహిమ విని అంధురాలైన తన కుమార్తె రాజ్యలక్ష్మి (కృష్ణకుమారి) అవిటిదైన మేనకోడలు కుమారి (బి.సరోజాదేవి)తో వారి ఆశ్రమానికి వస్తాడు. అక్కడ రక్త్భీహుని వలన బాగుపడిన వారిరువురికి అద్భుత సౌందర్యం కూడా లభిస్తుంది. అక్కడే వున్న మాందకుడు (ఎ.ఎన్.ఆర్) తొలి చూపులోనే కుమారిని ప్రేమిస్తాడు. రాజ్యలక్ష్మి, కుమారిలను అపహరించబోయిన కాంచీపుర సైన్యాన్ని రవిచంద్రుడు (కాంతారావు) మాందకుడు రక్షిస్తాడు. కరుణకరుని ఆతిథ్యంలో రవిచంద్రుడు, రాజ్యలక్ష్మి ప్రేమించుకుంటారు. వారిరువురికి, మహారాజు వివాహం నిశ్చయించగా శ్రీగండడు అడ్డుకోబోవటం, రాజ్యలక్ష్మిపై దుష్ట ప్రయోగం జరగటం, రక్త్భీషుడు దాన్ని నివారించగా రాజ్యలక్ష్మి, రవిచంద్రుల వివాహం జరుగుతుంది. రాజ్యలక్ష్మి మేనత్త చంద్రమ్మ (జి.వరలక్ష్మి) తన కుమార్తె కుమారిని మహారాజుకిచ్చి వివాహం చేయాలనే దుర్బుద్ధితో శ్రీగండని వద్దకు వెళుతుంది. ఆమెకోసం నాట్యాచార్యునిగా మాందకుడు అక్కడికి చేరతాడు. రక్త్భీష యోగి, దేవిని స్మరించి వెళుతూ తన ఉంగరం పోగొట్టుకుంటాడు. తన సేనాని విరూపాక్షుని (రాజనాల) ద్వారా కరుణాకరుని శ్రీగండడు బంధించగా, రాజ్యలక్ష్మి నిరాశ్రయురాలై ఒకరి పంచన చేరి మగ బిడ్డను కని పోగొట్టుకుంటుంది. మహారాజును, కుమారిని తప్పించే యత్నంలో మాందకుడు గుహ వద్దకు చేరి దేవి కవచం ఉంగరం పొందుతాడు. యోగి శిష్యుడు కృష్ణుడు(రమణారెడ్డి) దేవీ దర్శనం చేయించి పిచ్చిని పోగొడతాడు. అతని వల్ల యోగి రహస్యం తెలుసుకుని, ఉంగరం కోసం వచ్చిన అతనితో పోరాటంలో యోగిని ఓడించి, ఉంగరాన్ని పీఠం వద్ద వుంచగా రక్త్భీషుని మహిమలు పోయి రవిచంద్రునిగా నిలుస్తాడు. వారిరువురూ కలిసి విరూపాక్షునికి, కుమారికి జరిగే పెళ్లిని ఆపుచేసి, విరూపాక్షుని సంహరించటం, ఎంతటి భక్తుడైనా రజోగుణంవల్ల శ్రీగండడు తన మహిమలు కోల్పోవటం జరుగుతుంది. సత్‌ప్రవర్తనగల మాందకునికి జయం కలగటం, మహారాజు, రవిచంద్రుడు, రాజ్యలక్ష్మిల సమక్షంలో కుమా రి మాందకుల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో లలితాదేవిగా అంజలిదేవి, రాజు, రాణిలుగా రేలంగి, గిరిజ, మంత్రసానిగా సూర్యాకాంతం, పరిచారికలుగా గీతాంజలి, ఝాన్సీ, అనుచరులుగా నాగయ్య, హెచ్.నారాయణరావు, లింగమూర్తి, లంక సత్యం ఇతరులు నటించారు.
శ్రీవిద్యోపాసన భక్తి అంశానికి, సత్వ, రజో, తామస గుణపూరితులైన వ్యక్తుల ప్రవర్తనల ఫలితాన్ని విశే్లషిస్తూ, సంగీత, నృత్య ప్రాధాన్యతతో రూపొందించిన చిత్ర రహస్యం. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, మనోరంజకమై కనువిందు కావించే పాటల చిత్రీకరణ, సెట్టింగ్స్, వీనుల విందైన సంగీతంతో కడు ధన వ్యయ ప్రయాసలతో తీర్చిదిద్దారు నిర్మాత శంకర్‌రెడ్డి. సహజంగా నృత్య దర్శకులైన వేదాంతం రాఘవయ్య, హీరాలాల్‌తో కలిసి చక్కని నృత్యగీతాలను కంపోజ్ చేశారు. మల్లాది రామకృష్ణ శాస్ర్తీ వారు వ్రాసిన గీతం ‘తిరుమలగిరి వాసా, దివ్య మందహాసా’ చిత్రం టైటిల్స్ తిరుమల వెంకటేశునిపై చిత్రీకరణ (బ్యాక్‌గ్రౌండ్- గానం ఘంటసాల) సింహాసనారూఢయైన జగన్మాత పార్వతిలో లక్ష్మి, సరస్వతుల రూపాలు వచ్చి కలిసి ‘లలితా త్రిపుర సుందరి’గా మారటం నయనానందకరంగా చిత్రీకరణ, చివర ఘంటసాల, నారదునికి ‘లలితా భావ నిలయా’ (ఎ.పి.కోమల, పి.ఎస్.వైదేహి, పద్మ, సరోజిని) ‘నాదబింద కళాధరీ, భ్రమరీ, పరమేశ్వరి’ (ఘంటసాల) ఈ పాటకు లలిత గురించి లలితారాగం, సరస్వతి గురించి సరస్వతి రాగం, సిరి గురించి శ్రీరాగంలో మూడు రాగాల్లో ఘంటసాల వరుసలు చేయటం, చివర పద్యం ‘జలజాత సనవాసనాదులు’ (ఘంటసాల), మరో చిరస్మరణీయ గీతం, లలితాదేవి విగ్రహంముందు రాజ్యలక్ష్మి (కృష్ణకుమారి) చెలులుతో పాడే నృత్యహారతి గీతం, పద్యం, కనుల నిండు భక్తి గీతం ‘శ్రీలలితా శివజ్యోతి సర్వకామద’ (పి.లీల) సూర్య, చంద్ర, కర్పూరాలతో కూడిన శాశ్వత మంగళహారతిగా నిత్య నూతనంగా విరాజిల్లుతోంది. రమణారెడ్డిపై తత్వగీత ‘దీని భావము నీకే తెలియునురా’ (ఘంటసాల) పద్యం ‘మందార మాకంద’ (మాధవపెద్ది), కాంతారావు, కృష్ణకుమారిలపై యుగళగీతం ‘ఏవోకనులు కరుణించినవి’ (ఘంటసాల, లీల), బి.సరోజాదేవి తాళం వేస్తూ ఎ.ఎన్.ఆర్ ఇతరులపై నృత్యగీతం జావళి ‘మగరాయా వలరాయా’ (పి.సుశీల, ఘంటసాల) ఇక వీధి భాగవతం గిరిజా కల్యాణ గీతం, శాస్ర్తీగారు వ్రాసిన ‘కేళీ గోపాలం’ లోనిది ‘అంబా పరాకుతో మొదలై జగమేలు తండ్రికి, జయమంగళం’ వరకు సాగుతుంది. ఈ యక్షగానాన్ని ఘంటసాలవారు కాంభోజి, శ్రీ సావేరి వంటి 10రాగాలను సమర్థవంతంగా ఉపయోగించగా, నర్తకులు కోరాడ నరసింహారావు, వేదాంతం సత్యనారాయణ శర్మ, బి.సరోజాదేవి, వేదాంతం రాఘవయ్య నర్తించారు (ఘంటసాల, కోమల, పి.సుశీల, లీల, వైదేహి, పద్మ, మల్లిక, రాఘవులు). ఇక ఇంద్ర సభలో నృత్యగీతం ఇదియే దేవ రహస్యం (ఆరుద్ర) గానం (పి.సుశీల), ఎ.ఎన్.ఆర్, బి.సరోజాదేవిల యుగళగీతాలు ‘చారడేసి కనులతో’, ఉన్నదిలే దాగున్నదిలే (సినారె, ఘంటసాల, సుశీల), సదాశివబ్రహ్మం రచన రమణారెడ్డిపై ‘ఈ జన్మ సరిపోదు’ (ఘంటసాల), జననీ నీ శుభ దర్శనంబు, దేవి సాక్షాత్కరించి స్వాధీనమైన, ‘దేవి నే రక్తబీహుండు ధిక్కరించి’ వంటి పద్యాలలో (గానం ఘంటసాల) చిత్రకథను సూచించే ‘సాధించనేనా జగనా’ (సముద్రాల సీనియర్, ఘంటసాల, సుశీల) బి.సరోజ నృత్యగీతం).
రహస్యం చిత్రం సంగీత, సాహిత్యాల గుబాళింపుతో నృత్యశోభలతో అలరించదగ్గ చిత్రంగా నిలిచింది. కానీ ఆర్థికంగా సక్సెస్ కాకపోవడం విచారకరం. రాజస, తామస గుణాల మూర్తిమంతంగా గుమ్మడి ధరించిన శ్రీకంఠుని పాత్రకు తగ్గట్టు మహానటుడు ఎస్.వి.రంగారావు పోషించిన రక్తబీషుని పాత్ర రూపొందకపోవడం, కేవలం కైవల్య ప్రాప్తికై తపనతో మంచిపనులు చేయటం, ఉంగరం పోగొట్టుకుంటే దేవి దర్శనం లభించదు కానీ తన వద్దగల శక్తుల గురించి మర్చిపోవటం.
టైటిల్‌కు తగ్గట్టు రవిచంద్రుడే రక్తబీషుడని వెల్లడికావటం కొంత ఆసక్తికరంగా లేకపోవటం, రాజస, తామస, సత్వ గుణాలను వెల్లడి చేస్తూ ఇంద్ర సభలో నృత్యగీతం అలరించినా, ఆ సభ సృష్టి జనరంజకంగా లేకపోవటం వంటి అంశాలు కూడా చిత్ర విజయానికి అవరోధాలు కావచ్చు.
నేటికి మరి పదికాలాలకు నిలిచే సంగీతం, నృత్యాలు, కొన్ని పద్యాలు, గీతాలు రహస్యం చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. అది ఎంతో అభినందించదగిన విషయం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి