Others

మనోహర దృశ్య కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని..దశాబ్దాల తెలుగు సినిమాకు నిలువెత్తు నిదర్శనం. విత్తుగా మొదలైన ఆయన నటనా జీవితం శాఖోపశాఖలుగా విస్తరించి సినీ వటవృక్షమే అయింది. సినిమా పుట్టిన పదేళ్లకు తెలుగు సినిమా అందిపుచ్చుకున్న వజ్ర సమానుడు అక్కినేని. దాదాపు 75 సంవత్సరాలు సాగిన అక్కినేని సినీ జీవితం ఆదర్శం. ఆదర్శనీయం. అలాంటి మహనీయుడికి సచిత్రమైన, సముచితమైన నీరాజనం ‘మన అక్కినేని’. అక్కినేని గురించి తెలుగువాడు తెలుసుకోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే కొన్ని తరాలు ఆయన చు ట్టూ తిరిగాయి. ఆయన నట విశ్వరూపంలో మమేకమయ్యా యి. ఎంత తెలిసినా అక్కినేని గురించి తెలియని విషయాలెన్నో ఉం టాయి. దశాబ్దాల ఆయన సినీ జీవితంతో పెనవేసుకున్న అద్భుతమైన అంశా లూ కోకొల్లలు. ఇలాంటి అద్భుతాలనెన్నింటినో అత్యద్భుత రీతిలో ఏర్చికూర్చి..శ్రమించి, తపించి..తన పరిచయానుభవాన్నీ రంగరించి ‘మన అక్కినేని’ని మన ముందుకు తెచ్చాడు సంజయ్ కిశోర్. అక్కినేని గురించి ఎన్నో పుస్తకాలు వచ్చినా.. క్లుప్తంగా, సంక్షిప్తంగా సుమధుర చిత్రాల మాలలతో ముందుకొచ్చిన పుస్తకం ఇదేననడంలో ఎలాంటి సందేహం లేదు. అందరికీ తెలిసిన వ్యక్తిగురించి ఏమని చెబుతాం.. ఎంతని చెబుతాం. ఇలా ఉపోద్ఘాతాలకు తావివ్వకుండా..‘మీరే తెలుసుకోండి..’అన్న రీతిలో సాగిన ‘మన అక్కినేని’ పాఠకుల్ని మనోహర లోకాల్లో విహరింపజేస్తుంది. మొదటి సినిమా మొదలుకుని ఈ మహానటుడు తుది శ్వాస విడిచే వరకూ ఏ అంశాన్నీ వదలకుండా, ఏ అపురూప చిత్రాన్నీ విస్మరించకుండా ఆద్యంతం నయనానందకర రీతిలోనే సాగిన ‘మన అక్కినేని’ పదికాలాల పాటు దాచుకోవాల్సిన పుస్తకం. ఓ మహానటుడి జీవితాన్ని తక్కువ మాటలతో ఎక్కువ చిత్రాలతో కళ్లకు కట్టిన సినీ గ్రంధమే ఇది.
ఇందులోని కొన్ని చాయా చిత్రాలు మనం ఇప్పటికే చూసినవే అయినా..మనం చూడనివి ఎన్నో..ఎనె్నన్నో ఉన్నాయి. ఓ సినిమా షూటింగ్‌లో అక్కినేనిని పలుకరించడానికి వచ్చిన ఎస్వీఆర్‌ఓ ఉన్న ఫొటో..ఎన్టీఆర్..అక్కినేనికి సంబంధించిన సినిమాకు సంబంధించని ఫొటోలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయి. అలాగే అక్కినేని అన్నపూర్ణతో ఆయన చిత్ర కథానాయికలు దిగిన ఫొటోలు..అమెరికా నుంచి తిరిగొచ్చిన అక్కినేనిని పలుకరించేందుకు సావిత్రి, జమున, చంద్రకళ, రాజబాబు తదితర నటీనటులు తరలి వచ్చిన ఫొటో.. ఇలా ఎన్నింటి గురించి చెప్పినా.. ఇంకా తెలుసుకోవాల్సిందేదో.. తెలియాల్సిందేదో అక్కినేని గురించి ఉందన్న భావనను ఈ పుస్తకం కలిగిస్తుంది. ఆద్యంతం అనురక్తినీ కలిగిస్తుంది.

-బి.రాజేశ్వర ప్రసాద్