Others

అబ్బాయిని కాదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దంగల్ చిత్రం గుర్తుంది కదా! ఆ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ చూసినపుడు అమీర్‌ఖాన్‌తోపాటుగా వున్న వాళ్లందరూ అబ్బాయిలనుకుంటారు చూసినవాళ్లు. కానీ సినిమా చూశాకే అర్థమవుతుంది వారు అమ్మాయిలని. అందులో కూతురుగా నటించిన జైరా వశీం కూడా మొదట అబ్బాయిగానే గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు, అమీర్‌ఖాన్‌తో సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అయితే ఇపుడు విడుదలైన ఈ సినిమాలో అమీర్‌ఖాన్‌కన్నా జైరా వశీంకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఈ విషయంపై జైరా మాట్లాడుతూ- తొలి సినిమాతోనే ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదని, కానీ ఆ సినిమాకు దర్శకుడు చెప్పిన విధంగా నన్ను నేను మార్చుకోవడానికి ఇబ్బంది పడ్డానని అంటోంది. ఆ సినిమా విడుదలైనపుడు ఓ అబ్బాయి తన వద్దకు వచ్చి అరె భయ్యా, నువ్వు అమీర్‌ఖాన్ సినిమాలో నటించావు కదా, నీతో ఓ సెల్ఫీ తీసుకుంటా అని అడిగాడు. అప్పుడే నాకర్థమైంది, ఇన్నాళ్లు నన్ను అందరూ అబ్బాయిగానే అనుకున్నారట. అయితే నేను అతనికి మాత్రం నిజాన్ని చెప్పలేదు. అలా కొన్ని చెప్పకుండానే ఎంజాయ్ చేస్తుంటా అంటూ చెప్పుకొచ్చింది. హీరోయిన్ పాత్రల్లో నటించేటప్పుడు మాత్రం ఇలా కుదరదులే జైరా!