Others

జోరుగా ఆధార్ అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఆధార్ అనుసంధానం ప్రక్రియపై విస్తృత ప్రచారం జరుగుతోంది. బ్యాంకు ఖాతాలు, పాన్, మొబైల్, వివిధ పొదుపు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చిటపటలు, నిరసనలు వ్యక్తం అవుతున్నా ప్రజలు అయిష్టంగానైనా అనుసంధానానికి సిద్ధపడుతున్నారు. కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఆధార్ కేసులపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం పూర్తిస్థాయిలో వాదనలు వినేందుకు సిద్ధమైన తరుణంలో కేంద్రం మరిన్ని వెసులుబాట్లు, సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. అనుసంధానం విషయంలో ఐదు అంశాలకు సంబంధించి ఈనెల 31 చివరి గడువుగా నిర్ణయించింది. ఆధార్, బ్యాంకు అకౌంట్లు, పాన్ నెంబర్‌తో అనుసంధానానికి మాత్రం మార్చి వరకు గడువు ఇవ్వనున్నట్లు చెబుతోంది. కానీ బ్యాంకులు, టెలికమ్ కంపెనీలు ఆధార్ అనుసంధానం కోసం వినియోగదారులపై అన్ని రకాల ఒత్తిడులూ తీసుకువస్తున్నాయి. తాజాగా ఏటిఎంలనుంచి నగదు తీసుకునేందుకు ప్రయత్నించేవారికి ఆధార్ అనుసంధానం చేయకపోతే అంతరాయాలు ఎదురౌతున్నాయి. ఇక ఎస్‌ఎమ్‌ఎస్‌ల అలర్ట్‌లు నిమిషనిమిషానికి వస్తున్నాయి. ఇది ఒకరకంగా ప్రజలను చికాకుపరుస్తున్నప్పటికీ చాలామంది ఇక తప్పేట్లు లేదన్న ధోరణిలో అనుసంధానానికి మొగ్గుచూపుతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టి సంస్కరణల నేపథ్యంలో అనుకున్న లక్ష్యం సాధించలేకపోయారని, ఈ విషయాల్లో కేంద్రప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు, పేరుమోసిన ఆర్థిక విశే్లషణల సంస్థ మూడీస్ చేసిన ప్రకటనలు కేంద్రప్రభుత్వానికి కలసివచ్చాయి. ఈ నేపథ్యంలో మరో సరికొత్త లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. వందకోట్ల ఆధార్ అకౌంట్లు, వంద కోట్ల బ్యాంకు అకౌంట్లు, వంద కోట్ల మొబైల్ ఫోన్లతో ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేస్తోంది. డిజిటల్ లావాదేవీలను చేసేలా ప్రజలను మార్చడానికి, ఆర్థిక అవకతవకలు, దుర్వినియోగాలు, పన్ను ఎగవేతలను నివారించడానికి, సంక్షేమ పథకాల లబ్ధి అసలైన పేదలకు అందడానికి ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుందన్న మోదీ ప్రభుత్వం ఆలోచన. తాజాగా ప్రపంచబ్యాంకు, మూడీ సంస్థల ప్రకటనల నేపథ్యంలో త్వరితగతిన ఈ సంస్కరణను కార్యరూపంలోకి తీసుకువచ్చేలా చూస్తోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టి తరువాత కొత్తగా ఆదాయపన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం సులభమైంది. దాదాపు కోటి మంది కార్మికులు ఇపిఎఫ్, ఈఎస్‌ఐ పథకాలలో నమోదు అయ్యారు. ఇప్పటికి 52 కోట్ల ఆధార్ నెంబర్లు 73 కోట్ల అకౌంట్లతో అనుసంధానమయ్యాయి. డిసెంబర్ 31 నాటికి ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉండదని, ఇప్పటికే పలు సందర్భాలలో లక్షలమంది సమాచారం లీక్ అయ్యిందన్న వార్తలు వచ్చాయి. దేశంలో ఈ ఏడాది నవంబర్ నాటికి 1,190,663,350 ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. దాదాపు 99 శాతం జనాభా ఆధార్ సంఖ్యను పొందారు. డిసెంబర్ 5 నాటి పరిస్థితి ఇది. దాదాపు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 100 శాతం ఆధార్ సాధించాయి. ఢిల్లీలో మాత్రం జనాభాకన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉండటం గమనార్హం. అక్కడ 130 శాతం ఆధార్ కార్డులు ఉన్నాయని. దేశంలో అతి తక్కువగా అస్సాంలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఆధార్ సంఖ్య పొందారు. నాగాలాండ్, మేఘాలయ ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. లక్షద్వీప్‌లో 154 శాతం ఆధార్ కార్డులుంటే తెలంగాణలో వందశాతం, ఆంధ్రప్రదేశ్‌లో 99 శాతం మేరకు ఆధార్ జారీ అయంది.

-రవళి