Others

తరగతి గది.. అమ్మ వొడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త రగతి గదిలో ఒకప్పుడు ఆరు సంవత్సరాలొచ్చిన పిల్లల నుంచి పాతికేళ్ల వయస్సున్నవారు కనబడేవారు. కానీ ఇప్పుడు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మూడేండ్ల నుంచే తరగతి గది లోపల అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయునికి చిన్నపిల్లల మానసిక స్థితి ఏమిటో తెలియవలసిన, వారిని అర్థం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో వాటినన్నింటిని తరగతి గది తీసుకోవాల్సిన స్థితి వచ్చింది. చిన్న పిల్లలను ఆ వయసులో ఎలా ఆడించాలి? వారికి కథలు ఎలా చెప్పాలి? పిల్లలను ఎప్పుడు ఎలా నిద్రపుచ్చాలి? వారిని ఎప్పుడు లేపాలి? అన్న వౌలిక అంశాలు వారికి తెలిసి ఉండాలి. పిల్లలకు నిద్ర ఎందుకు అవసరం అన్నది ఇప్పుడు తరగతి గదిలో ఒక భాగం అయ్యింది. వారు ఎందుకు నిద్రపోతారు? నిద్రపోయిన తరువాత ఆ పిల్లల్లో ఎలా ఉత్సాహం పెరుగుతుంది? కొత్త విషయం కనుక్కోవడానికి నిద్ర ఎంత అసరమో ఉపాధ్యాయునికి తెలియవలసిన అవసరం ఏర్పడింది. రెండు గంటలపాటు పిల్లలు ఆడుకోగానే నిద్రపోనివ్వాలి. నిద్రపోయినప్పుడు శ్వాసకోశారు, మెదడు, ఆలోచనలు ఎలా పనిచేస్తాయి. పిల్లలు నిద్రపోతున్నప్పుడు కూడా మెదటు చురుకుగానే పనిచేస్తుంటుంది. ఆ సమయంలోనే వారికి ఆలోచనలు వస్తూంటాయి. నేర్చుకున్నది నిద్రలోనే జీర్ణమవుతుంది. కొత్త విషయం తెలుసుకోవడం ఎంత ప్రధానమో జీర్ణం కావడం కూడా అంతే ప్రధానం. తరగతి గది శిశు సంరక్షకుడిగా మారిపోవాలి. మారిన పరిస్థితులలో తరగతి గదిలో విద్యార్తి గడుపుతున్న కాలం పెరుగుతున్నది. ప్రతికాలంలో ఉండే పిల్లల స్థితిగతులు, పిల్లల ఎదుగుదలల్లో మార్పులుంటాయి. ఈ సైకాలజీ తెలిసిన మను,లు తరగతి గదిలో ఉండాలి. ఉపాధ్యాయుడు అంటే కాపలాకాసే పని కాదు. అది బాధ్యతాయుతంగా పిల్లలను చూసుకునే మహోన్నతమైన పని అది.
అంతం లేదు...
పుట్టిన శిశువుకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఈ విశ్వం తన మాదిరిగా ఎంతమందికి స్థానం ఇవ్వగలుగుతుంది. పుట్టినప్పుడు కాకున్నా పెరిగినాక అయినా ఆలోచిస్తారు. విశ్వం అనేది అనంతమైనదా? అంతం లేనిదా? అనే సందేహం కలగక మానదు. చాలామంది అనంతమే అనుకుంటారు. అది కూడా అంతమే కానీ దాని సరిహద్దులు గుర్తించడం కష్టం. అదొక ఆడుకోబోయే ఫుట్‌బాల్ మాదిరిగానే ఉన్నది. మనకు కనపడే గెలాక్సీనే అన్‌రోమిడా గెలాక్సీ అంటారు. ఇది 2,20,000 కాంతి సంవత్సరాల వయసుగలది. కాబట్టే మన చూపునకు దగ్గరగా ఉండే గెలాక్సీయే. తన అవతల కూడా ఏమున్నదో కనుక్కోలేం కాబట్టి మన చూపునకు అందనిది నీలిరంగు అయిపోతుంది. ఆకాశం నీలిరంగులో ఉండటానికి కారణం మన చూపునకు అందని విషయాన్ని నీలిరంగులో చూపిస్తుంది. అందుకే చాలామంది భగవంతుణ్ణి నీలిరంగులో చూపిస్తారు. ఆకాశం నీలిరంగులో ఉంటుందని తరగతి గది మొదటి పాఠం చెబుతుంది. అదే మొదటి రహస్యం. ఇది తరగతి గదికి తెలుసు. అన్నీ తెలిసినా తరగతి గది ఎప్పుడూ విర్రవీగదు. నమ్రతతో చిన్న శిశువు నుంచి వృద్ధుల వరకు జ్ఞానస్థానాన్ని కల్పిస్తుంది. తరగతి అంతం లేనిది. అనంతంలో అంతం ఉందా? లేదా అన్న విషయాన్ని చెప్పే జ్ఞాని తరగతి గది.

-డా.చుక్కా రామయ్య