Others

పూజాపంచకము(ప్రపంచ తెలుగు మహిసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓహో! వెంకటశాస్ర్తీ సత్కవి కవిత్వోద్యాన వన్యాంగణ
శ్రీహాసన్నవ పారిజాత కుసుమ శ్రేణుల్ గుబాళించునీ
ఊహావీధి కలన్ త్రిలింగ కవిరాజ్ యూధంబు గుర్రాలపై
రాహుత్తుల్ బలె స్వారిచేసెగద ధారారమ్య కావ్యాళితో
మా తెలంగాణ మంతయు రమారమి రెండు శతాబ్దముల్ తమః
ప్రేతము చేతిలో గడచె వెచ్చని యెండయె కాయలె; దదే
దో తెరచాటునన్ గడచె; నుజ్జ్వల కాంతి ఘటా కవాటముల్
పాతర వేసి యుండె; తెలవారగ లేదుగదా శతాబ్దముల్
నేడు, నవోదయ ప్రథమ నిర్మల భానుకరాగ్రమాలల
ర్రాడును మా తెలుంగు కవిరాజుల మానస పద్యసీమన్
తోడను నీడయుండనెగదో! తెలంగాణమునందు గూడకా
వ్యోడు పతి ప్రకాండములు వ్యోమమునన్ జలతారులల్లెడిన్
అగ్ని పుష్పాలు పూచి ఉద్విగ్న మాన
సముల చీకట్లు కాల్చి వెచ్చదనమొసగి
కవుల కంఠాల శాంతిగీతి వెలలించె
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
కోటి గళాలతో పిలుచుకొన్నది నా తెలగాణ నిన్ను నీ
నోట జెలంగు భారతిని - నూత్న యుగ ప్రథమోద యానము
క్కోటి తెలుంగులొక్కకడ విశాల మహాంధ్రతా సుమ
స్ఫోటన మాచరింపుము యశోనిధి! చెళ్ళపిళాన్వయాగ్రణీ

శతావధాని శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీగారి సన్మాన సభ సందర్భములో తెలంగాణ (ఆంధ్ర) సారస్వత పరిషత్తు పక్షాన దాశరధి కృష్ణమాచార్యులు రచించిన పూజా పంచకము.
ఓరుగల్లునుంచి వెలువడిన ప్రగతి వారపత్రికలో 1949 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రచురితమైంది. ఈ పద్యాలలో దాశరధి శైలి పూర్వ తెలుగు కవుల ప్రతిభకు దీటుగా ఉన్నది. తెలుగు భాష ప్రభుత సమద్దీప్తంగా ఉన్నది. అప్పటి దాశరధి వయసు 23 ఏళ్లు.

- సేకరణ: అక్కిరాజు రమాపతిరావు